Home /News /trending /

IN THIS FUNNY VIDEO ELEPHANT FAMILY ENJOYING IN MUD POND AND PLAYING LIKE KIDS WATCH SRD

Viral Video : బురదలో ఈ ఏనుగులు చేసే అల్లరి అంతా ఇంతా కాదు.. వైరలవుతున్న గజరాజుల ఫన్నీ వీడియో..

Photo Credit : Twitter

Photo Credit : Twitter

Viral Video : భూమిపై అతిపెద్ద జంతువు ఏనుగు.. అత్యంత తెలివైనదిగా ఏనుగును పరిగణిస్తారు. అలాంటి ఏనుగులు అల్లరి చేస్తే ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూడొచ్చు.

    వింతలు-విశేషాలకు సోషల్ మీడియా నిలయం. ప్రపంచం నలమూలల ఏం జరిగినా క్షణాల్లో వైరల్‌గా మారుతుంటాయి. ముఖ్యంగా జంతువుల వీడియోలు ఆకట్టుకుంటాయ్. జంతు ప్రపంచంలో ఎన్నో వింతలు, అద్భుతాలు జరుగుతుంటాయ్. అలాంటివి సోషల్ మీడియాలో ప్రత్యక్షమైనప్పుడు వాటిని చూసి థ్రిల్ అవుతాం. కొంత మంది సమయం దొరకని వారు సోషల్ మీడియాలో జంతువుల సరదాను చూసి తమ సమయాన్ని గడుపుతారు. జంతువులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వచ్చిన వెంటనే వైరల్ కావడానికి కారణం ఇదే. వాస్తవానికి, చాలా అరుదైన దృశ్యాలు అడవిలో కనిపిస్తాయి. అవి చూస్తే మనం కూడా ఆశ్చర్యపోతుంటాం.. ఇటీవలి కాలంలో ఏనుగుకు సంబంధించిన వీడియోలు చాలా కనిపిస్తున్నాయి.భూమిపై అతిపెద్ద జంతువు ఏనుగు.. అత్యంత తెలివైనదిగా ఏనుగును పరిగణిస్తారు. అలాంటి ఏనుగులు అల్లరి చేస్తే ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూడొచ్చు.

    ఇది కూడా చదవండి : ఐపీఎల్ 2021 మలిదశలో ఈ రికార్డులు బద్దలు అయ్యేనా..? వాటిని బ్రేక్ చేసే మొనగాళ్లు ఎవరు..?

    వాస్తవానికి.. ఏనుగులు నీటిలో ఆనందించడానికి ఇష్టపడతాయని మనందరికీ తెలుసు. అవకాశం దొరికినప్పుడల్లా అవి సరదాగా ఉండే మూడ్‌లో ఉంటాయి. ఇక, ఈ వీడియోలో ఏనుగుల కుటుంబం చాలా సరదాగా కనిపిస్తుంది. ఈ ఏనుగు కుటుంబం ఒక వాలులో దిగుతూ చిన్నపిల్లలా అల్లర్లు చేయడం ప్రారంభించాయి. వీడియోలో మీరు ఏనుగుల కుటుంబం అడవిలో సరదాగా తిరుగుతున్నట్లు చూడొచ్చు. అప్పుడే క్రిందికి వాలు నుంచి జారడం చూస్తాం. మొదట ఏనుగు వాలుపై కూర్చుని కిందికి జారి వస్తుంది. దీని తర్వాత పిల్ల ఏనుగు కూడా అదే పని చేయడానికి ప్రయత్నిస్తోంది. కానీ అది మధ్యలో ఆగి మళ్లీ పైకి వెళ్లేందుకు ప్రయత్నిస్తుంది.


    ఈ వైరల్ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ సుధా రామన్ తన ట్విట్టర్ ఖాతా నుండి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో.. ఈ వీడియోను నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ ఫన్నీ వీడియోను తమదైన శైలిలో స్పందిస్తున్నారు.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Elephant, Trending, Viral Video

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు