Viral video: టూరిస్ట్ ప్లేస్‌లకు వెళ్తున్నారా.. ఈ వైరల్ వీడియో చూశాక.. నిర్ణయం తీసుకోండి

Viral video: టూరిస్ట్ ప్లేస్‌లకు వెళ్తున్నారా.. (image credit - twitter)

Viral video: వర్షాకాలం రాగానే చాలా మంది టూరిస్ట్ ప్లేస్‌లకు వెళ్లేందుకు ఇష్టపడతారు. చక్కగా ప్లాన్ చేసుకొని వెళ్తారు. అయితే... అలాంటి వాళ్లను అలర్ట్ చేస్తోంది ఓ వీడియో. అది చూసిన వాళ్లు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

  • Share this:
    Viral video: ఇండియాలో కరోనా కేసులు తగ్గడం... రాష్ట్రాలు లాక్‌డౌన్లు ఎత్తివేయడం... అదే సమయంలో... వాతావరణం చల్లగా మారడంతో... చాలా మంది టూరిస్ట్ ప్లేస్‌లకు వెళ్తున్నారు. అలా వెళ్లేవారు పూర్తి సెక్యూరిటీ కలిగి ఉంటున్నారా అనేదే ప్రశ్న. ఇందుకు సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఓ జంట... రాజస్థాన్... ఉదయ్‌పూర్‌లో టూరిజంకి వెళ్లారు. దారిలో ఓ చోట రోడ్డు పక్కన కారును ఆపారు. అక్కడ వాళ్లు సెల్ఫీలు తీసుకుంటూ ఉండగా... రెండు బైకులపై నలుగురు వ్యక్తులు అటుగా వెళ్లసాగారు. ఆ వ్యక్తులు ఆ ఇద్దరినీ చూశారు. వెంటనే కారుకు దగ్గర్లోనే బైకులు ఆపారు. బైకులు దిగి... ఆ జంట దగ్గరకు వచ్చారు.

    ఆ దుండగులు కత్తులు తీశారు. మర్యాదగా మీ దగ్గర ఏమి ఉంటే అవి ఇచ్చేయండి అని బెదిరించారు. పాపం ఆ జంట తమ దగ్గర ఏమీ లేవని చెప్పింది. కానీ వాళ్లు వినలేదు... కారు డోర్లు తీసి వెతికారు. ఆ జంటను కూడా చెక్ చేసి... నగలు, ఉంగరాలు, డబ్బు, మొబైల్ వంటివి లాక్కున్నారు. కారు కీస్ తీసుకున్నారు.

    ఇదంతా ఆమె వీడియో తీసింది. అయినా వాళ్లు ఏమాత్రం భయపడలేదు. తమను వీడియో తీసినా ఏం కాదు, పోలీసులు మమ్మల్ని ఏమీ చెయ్యలేరు, పట్టుకోలేరు అనే ఓవర్ కాన్ఫిడెన్స్ వాళ్లలో ఉంది.

    ఇది కూడా చదవండి: Viral Pics: అమ్మాయి వెంటపడిన ఆకతాయిలు... షాకయ్యేలా చితకబాదిన ఆమె వదిన

    చివర్లో వాళ్లు బైక్‌పై వెళ్లిపోయారు. కనీసం కారు కీస్ అయినా ఇవ్వమని అతను కోరగా... ఆ దుండగులు ఇవ్వలేదు. ఇలా... ఏమాత్రం సెక్యూరిటీ లేని ప్రాంతంలో ఆ యువతీ, యువకుడు దుండగుల చేతికి చిక్కినట్లైంది.


    ఈ వీడియోని లక్ష్మీకాంత్ భరద్వాజ్... ట్విట్టర్‌లో అప్‌లోడ్ చేశారు. దుండగులు ఏమాత్రం భయంలేకుండా దోచుకున్నారు అని క్యాప్షన్ పెట్టారు.



    ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. దీనిపై పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. ఎవరైనా సరే... టూరిజం ప్లేసులకు వెళ్లేటప్పుడు... సెక్యూరిటీ లేదు అని అనుకునే ప్రాంతాలకు వెళ్లకపోవడమే మంచిదనే సంకేతాలు ఇస్తోంది ఈ వీడియో. పోలీసులు కూడా టూరిజం ప్లేసుల్లో సెక్యూరిటీని పెంచాలని నెటిజన్లు కోరుతున్నారు.
    Published by:Krishna Kumar N
    First published: