చిరుతను రోడ్డుపై ఊరేగించి... టిక్ టాక్ వీడియో... ఎంకరేజ్ చేసిన పోలీసులు...

చిరుతను రోడ్డుపై ఊరేగించి... టిక్ టాక్ వీడియో... ఎంకరేజ్ చేసిన పోలీసులు... (credit - tiktok)

ఆ చిరుతపులి ఎవర్నీ ఏమీ అనకుండా రోడ్డుపై ఎలా సైలెంట్‌గా ఉంది అన్నదానిపై వన్యప్రాణి విశ్లేషకులు ప్రత్యేక కారణం చెప్పారు.

  • Share this:
    కొన్ని కొన్ని విషయాల్ని మనం కళ్లారా చూస్తే తప్ప నమ్మలేం. ఇది అలాంటిదే. రోడ్డుపై వాళ్లంతా చిరుతను అలా తీసుకెళ్లడం షాకింగ్ విషయమైతే... అసలా చిరుత వాళ్లను ఎమీ అనకపోవడం మరో వింత. ఇది జరిగింది నేపాల్‌లో అక్కడి పర్భత్ జిల్లా జల్జలా ఊరిలో చిరుత పులిని స్థానికులు చూశారు. వెంటనే పోలీసులకు కాల్ చేసి చెప్పారు. కాసేపటికి పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అటవీ అధికారులకు ఆల్రెడీ కాల్ చేశారు. తీరా పోలీసులు వచ్చి... అక్కడి సీన్ చూసి ఆశ్చర్యపోయారు. అక్కడి కొందరు కుర్రాళ్లు... ఆ చిరుత మెడకు (కుక్కకు కట్టినట్లు)... ఓ తాడు కట్టారు. ఆ తాడును పట్టుకున్నారు. ఆ చిరుత వాళ్లను ఏమీ అనకుండా సైలెంట్‌గా పిల్లిలా ఉంది.

    పోలీసులకు డౌట్ వచ్చింది. దాన్ని మీరు పెంచుతున్నారా అని అడిగారు. ఆ కుర్రాళ్లు లేదన్నారు. మరైతే... మీకు భయం వెయ్యట్లేదా అంటే... మొదట వేసింది. తీరా అది దగ్గరకు వచ్చి ఏమీ చెయ్యకుండా ఉండిపోయింది. అందువల్ల మేం దాన్ని పట్టుకున్నాం అన్నారు. పోలీసులు ముఖాలు చూసుకున్నారు. సరే... పులిని మాకు అప్పగించండి అంటే... సార్... మేమే తీసుకొచ్చి అప్పగిస్తాం అన్నారు. అలా కుదరదని చెప్పాల్సిన పోలీసులు... కుర్రాళ్లు ముచ్చటపడుతున్నారు సరే... అన్నారు. దాంతో... కుర్రాళ్లు, ఓ యువతి కలిసి... రోడ్డుపై చిరుతను తీసుకెళ్లారు. టిక్ టాక్ వీడియో తయారుచేసుకున్నారు. ఆ తర్వాత పోలీసులకు అప్పగించారు. అప్పటికే అక్కడకు వచ్చిన అటవీ అధికారులు పులిని తమతో తీసుకెళ్లారు.


    ఈ ఘటన నేపాల్‌తోపాటూ... మొత్తం ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది. ఇలాంటి ఘటనల్ని పోలీసులు ఎంకరేజ్ చెయ్యకూడదని వన్యప్రాణి సంరక్షకులు చెబుతున్నారు. ఆ చిరుతపులికి తిక్కరేగి ఉంటే... అప్పటికప్పుడు చాలా మందిపై దాడి చేసేదే అంటున్నారు. చిరుతపులి, పులి వంటివి... ఆకలితో ఉన్నప్పుడే వేటాడతాయనీ... మిగతా సమయాల్లో ఎవరినీ ఏమీ అనవని వారు చెబుతున్నారు. ఆ ప్రకారం చూస్తే... ఈ చిరుతపులి ఆకలితో లేకపోయి ఉండొచ్చంటున్నారు. మొత్తానికి ఈ ఘటన తీవ్ర కలకరం రేపింది.
    First published: