Modi Speech : త్రివిధ దళాలపై మరో పదవి... ప్రధాని మోదీ ఎందుకీ నిర్ణయం తీసుకున్నారు?

ప్రధాని నరేంద్ర మోదీ (Image : Twitter - Narendra Modi)

73rd Independence Day Speech : 73వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా... ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రసంగంలో... త్రివిధ దళాలపై చేసిన ప్రకటన అందర్నీ ఆలోచనలో పడేస్తోంది. మోదీ ఉద్దేశం ఏమిటన్నది ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది.

  • Share this:
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎప్పుడు ఏ ప్రసంగం చేసినా... అందులో ఏదో ఒక సంచలన ప్రకటన చెయ్యడం కామనైపోతోంది. తాజాగా 73వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా... ఎర్రకోటపై వరుసగా ఆరోసారి జాతీయ జెండా ఎగరవేసిన సందర్భంగా... మోదీ ఆసక్తికరమైన ప్రసంగం చేశారు. అందులో చాలా అంశాలు మనకు తెలిసినవే ఉన్నాయి. ఒక్కటి మాత్రం సామాన్యులకు అర్థం కాకుండా... మేధావులకు చర్చనీయాంశంగా మారింది. అదే... త్రివిధ దళాలను ముందుకు నడిపించే... కొత్త పదవి. దీనికి "చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ పోస్ట్" అని పేరు పెట్టారు మోదీ. రక్షణ రంగంలో ఇదే కీలకమైన సంస్కరణ (మార్పు)గా చెబుతున్నారు నిపుణులు. అసలేంటి ఈ పోస్టు? ఇది ఎందుకు? అవసరమా? అన్న చర్చ జరుగుతోంది.

ప్రస్తుతం రాజ్యాంగం ప్రకారం త్రివిధ దళాలకు అధిపతి రాష్ట్రపతి. కానీ ఈ రోజుల్లో రాష్ట్రపతికి చాలా పనులు ఉంటున్నాయి. ఎన్నో సందర్భాల్లో ఆయన్ని ఎన్నో కార్యక్రమాలకు ఎంతో మంది పిలుస్తున్నా్రు. అదీ కాక... రక్షణ రంగంలో త్రివిధ దళాలపై రాష్ట్రపతికి పూర్తి అవగాహన ఉండకపోవచ్చు. ఈ కారణాల దృష్ట్యా... ప్రత్యేకించి ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌పై పూర్తి ఆధిపత్యం చెలాయించగల, పూర్తి అవగాహన ఉన్న వ్యక్తిని ప్రత్యేక పోస్టులో నియమిస్తే... సదరు వ్యక్తి పూర్తి త్రివిధ దళాల్ని ఏకతాటిపై నడిపిస్తూ... పూర్తిగా దృష్టి పెట్టే అవకాశాలు ఉంటాయి. అందుకే ప్రత్యేకించి ఈ పోస్టును మోదీ సృష్టిస్తున్నట్లు తెలిసింది.

ఈ కొత్త పోస్టులో వచ్చే అధికారి... అటు రాష్ట్రపతి, ఇటు ప్రధాన మంత్రి, మరోవైపు రక్షణ శాఖ మంత్రితో టచ్‌లో ఉంటూ... వారి ఆదేశాల ఆధారంగా... ఎప్పటికప్పుడు త్రివిధ దళాల్ని ముందుకు నడిపించే వీలు ఉంటుంది. అలాగే... రాష్ట్రపతి, ప్రధానీ, రక్షణ మంత్రి వేర్వేరు పనుల్లో బిజీగా ఉన్నా... దేశ రక్షణ విషయంలో ఏమాత్రం రాజీ పడకుండా చూసేందుకు కొత్త అధికారికి వీలవుతుంది. అందుకే ప్రధాని మోదీ ఈ కొత్త పదవిని క్రియేట్ చేస్తున్నట్లు తెలిసింది.

ఇటీవల జమ్మూకాశ్మీర్ అంశంలో కేంద్రం తీసుకున్న సెన్సేషనల్ నిర్ణయాలు దేశ రక్షణపై సవాల్ విసురుతున్నాయి. పక్క దేశం పాకిస్థాన్... ఇండియాపై జీహాద్ యుద్ధాన్ని ప్రకటించడం కూడా దేశంలో రక్షణ వ్యవస్థల్ని మరింత బలోపేతం చెయ్యాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతున్నాయి. అందుకే ప్రధాని మోదీ... ఈ కొత్త పదవిని సృష్టించినట్లు కనిపిస్తోందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

1999లో కార్గిల్ యుద్ధం వచ్చినప్పుడు... భారత రక్షణ రంగంలో కొన్ని లోటుపాట్లు కనిపించాయి. ముఖ్యంగా రక్షణ శాఖ మంత్రికీ, త్రివిధ దళాలకూ మధ్య గ్యాప్ కనిపించింది. ఈ పరిస్థితి మరోసారి రాకూడదని... కేంద్రంలోని కొందరు మంత్రుల బృందం ప్రధాని మోదీకి వివరించింది. 2012లో నరేష్ చంద్ర టాస్క్ ఫోర్స్... ఇలాంటి కొత్త పదవి ఉండాలని ప్రతిపాదించింది. అప్పటి నుంచీ ఈ దిశగా ఆలోచనలు, అడుగులూ పడుతున్నాయి.

సపోజ్ పాకిస్థాన్‌తో యుద్ధమే వస్తే... సరిహద్దుల్లో సైన్యాన్ని అలర్ట్ చెయ్యాల్సి ఉంటుంది. అదే సమయంలో... గగన తలం నుంచీ ఎయిర్‌ఫోర్స్ క్షణాల్లో యుద్ధానికి సిద్ధం కావాల్సి ఉంటుంది. మరోవైపు సముద్ర మార్గాల్ని అలర్ట్ చేసుకుంటూ... నౌకాదళం సన్నద్ధం కావాల్సి ఉంటుంది. జనరల్‌గా ఈ మూడు దళాలకూ ముగ్గురు అధికారులు ఉంటారు. ఐతే... ఈ ముగ్గురూ కలిసి... యుద్ధ సన్నద్ధంపై చర్చించేందుకు సమయానికి రాష్ట్రపతి, రక్షణ మంత్రి, ప్రధాని అందుబాటులో లేకపోతే... అది ఇబ్బందికరమే. అందుకే త్రివిధ దళాలకు కొత్త అధిపతి వస్తే... వెంటనే ఆయనకు విషయం చెప్పి... క్షణాల్లో యుద్ధానికి సిద్ధం కావచ్చు. ఆ కొత్త అధిపతి కంటిన్యూగా రక్షణ వ్యవహారాలే చూసుకుంటారు కాబట్టి... డైరెక్టుగా రాష్ట్రపతి, ప్రధాని, రక్షణ మంత్రికి విషయం చెప్పి... చకచగా యుద్ధానికి సిద్ధమయ్యేలా చెయ్యడానికి వీలవుతుంది. ఇలాంటి కారణాలన్నీ దృష్టిలో పెట్టుకొని మోదీ... ఈ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది.
First published: