IN MADHYA PRADESH THE VIDEO OF THE BRIDE CARRYING THE GROOM ON A SCOOTER TO THE WEDDING HAS GONE VIRAL SNR
పెళ్లికి ముందే ఆ ముచ్చట తీర్చుకున్న నూతన వధువు..ఆశ్చర్యపోయిన బంధు,మిత్రులు
Photo Credit: Youtube
Viral video: ఓ నూతన వధువు పెళ్లికి ముందే తన ముచ్చట తీర్చుకుంది. అది కూడా పెళ్లి కొడుకు సమక్షంలో పెద్దల అంగీకారంతో తన కోరిక తీర్చుకోవడం చూసిన వాళ్లంతా ఆశ్చర్యపోతున్నారు. ఓ పెళ్లి కూతురు ఏంటీ ఇలా చేసిందని ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ విచిత్రమైన ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది. ఇంతకీ ఆ పెళ్లి కూతురు ఏం చేసిందో తెలుసా.
పెళ్లిళ్లు వెరైటీగా జరగడం చూశాం. కానీ పెళ్లి మండపాలకు వధు,వరులు వచ్చే సంప్రదాయం విచిత్రంగా మారుతోంది. ఆ మధ్య పెళ్లి జరిగిన తర్వాత ఊరేగింపులో వధువు నీ బుల్లెట్టు బండెక్కి వచ్చెస్తబా అనే పాటకు వరుడు, బంధువుల ముందే డ్యాన్స్ చేసి ఎక్కడ లేని గుర్తింపు తెచ్చుకుంది. ఇలాంటి ఘటనే మరొకటి మధ్యప్రదేశ్(Madhya Pradesh)లో జరిగింది. కాకపోతే ఇక్కడ ఇంకా గమ్మత్తైన విషయం ఏమిటంటే వధువు (Groom)పెళ్లి మండపానికి స్కూటర్‌పై వచ్చింది. ఒంటరిగా కాదు..కాబోయే భర్త అంటే పెళ్లి కొడుకు(Bride)ని తన యాక్టివా (Activa)వెనుక సీటుపై కూర్చోబెట్టుకొని తీసుకొచ్చింది. ఇదేంటి పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని కల్యాణ వేదికకు తీసుకురావడం ఏమిటని ఆశ్చర్యపోకండి. ఈఘటన జరిగింది మధ్యప్రదేశ్‌లోని నీముచ్ (Neemuch)నగరంలో చోటుచేసుకుంది. వధువు పేరు నీలు దమామి(Neelu damami).నీముచ్ సిటీలో నివసించే బాల్ముకాంద్ (Balmukand)కుమార్తె నీలుకు మానస(Manasa)కు చెందిన అర్జున్(Arjun)తో ఈనెల 16న పెళ్లి (Wedding)జరిగింది. అయితే వివాహ వేదిక నీముచ్‌లోని కల్యాణేశ్వర ఆలయం (Kalyaneshwar Mahadev Temple)దగ్గరున్న ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేశారు పెద్దలు. పెళ్లి ముహుర్తానికి వధువు నీలు ఇంటి నుంచి కల్యాణ మండపానికి స్కూటర్‌పై వెళ్లాలని ముచ్చటపడింది. ఆ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో అంగీకరించారు. ఇంకేముందు తల్లిదండ్రులు పర్మిషన్ ఇచ్చారో లేదో కాబోయే భర్తను తన బైక్ వెనుక సీటుపై కూర్చొబెట్టుకొని డైరెక్ట్‌గా పెళ్లి దుస్తుల్లో కల్యాణ మండపానికి చేరుకున్నారు నూతన వధువరులు. ఈ వెరైటీ ఘటనే ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
ఇదో టైపు సరదా ..
పెళ్లి దుస్తుల్లో యాక్టివాపై వచ్చిన నూతన వధువరులను చూసి మొదట ఆశ్చర్యపోయిన బంధువులు, అతిధులు తర్వాత వారికి పూలమాలలు, బ్యాండ్ మేళం నడుమ కల్యాణ వేదిక దగ్గరకు తీసుకెళ్లారు. ఇక్కడ గమ్మత్తైన విషయం ఏమిటంటే మొదట స్కూటర్‌పై కల్యాణ మండపం దగ్గరకు బయల్దేరింది. కల్యాణేశ్వర ఆలయం రోడ్డు దగ్గరలో వరుడు మండపానికి వెళ్లేందుకు ఎదురుచూస్తుండగా తన స్కూటర్‌పైనే ఎక్కించుకొని తీసుకెళ్లింది. ఈఘటన చెప్పడానికి చాలా హాస్యాస్పదంగా ఉన్నప్పటికి నూతన వధువు ముచ్చట తీర్చుకోవడం కోసం ఇలా బైక్‌పైన భర్తను పెళ్లి మండపానికి తీసుకెళ్లిన వీడియో మాత్రం తెగ వైరల్ అవుతోంది.
ఏంటో ఈ వింత కోరిక..
ఈ మొత్తం ఎపిసోడ్లో నీలు దమామి యాక్టివాపై పెళ్లిమండపానికి వెళ్లేందుకు తల్లిదండ్రుల అనుమతి తీసుకుంది కానీ..కాబోయే అత్తమామలకు మాత్రం వాళ్లిద్దరు అలా ఫంక్షన్ హాలుకు వచ్చే వరకూ తెలియదంట. ఈ వార్త విన్నవాళ్లాంత ముందే చెప్పుంటే ఒప్పుకునే వాళ్లు కాదేమో అని కామెంట్స్ చేస్తున్నారు.
Published by:Siva Nanduri
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.