IN MADHYA PRADESH THE OWNER HAS SET UP AN INNOVATIVE HOARDING TO CELEBRATE HIS DOG BIRTHDAY PRV
Hoarding for dog: ప్రతీ కుక్కకూ ఓ రోజు వస్తుందంటారు కదా? ఈ కుక్కకు ఆ రోజు వచ్చేసింది.. రాష్ట్రం అంతా ఆ కుక్క గురించే చర్చ..
Hording
ఓ పెంపుడు కుక్క పుట్టినరోజు పురస్కరించుకుని దాని యజమాని నాంచు అగర్వాల్ వినూత్న ఆలోచన చేశాడు. ఏకంగా హోర్డింగ్ ఏర్పాటుచేసి శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు ఏర్పాటుచేశాడు. అయితే అందులోనూ వినూత్న పద్దతిని అవలంభించాడు
మామూలుగా నగరాల్లో హోర్డింగ్ (Hoarding)లు సహజం. రాజకీయ నాయకుల పుట్టినరోజులు, సినీ తారల పుట్టిన రోజులు గానీ, ఎవరైన రాజకీయ రంగ ప్రవేశం చేస్తే వాళ్ల వాళ్ల అభిమానులు పెద్ద పెద్ద హోర్డింగ్‌లు ఏర్పాటుచేస్తారు. ఇక వ్యాపార ప్రకటనలైతే ఎక్కువే. అయితే ఓ ప్రాంతంలో వెలిసిన హోర్డింగ్ మాత్రం మొత్తం రాష్ట్రం దృష్టిని ఆకర్షిస్తోంది. ఇంతకీ ఆ హోర్డింగ్‌లో ఏముందో తెలుసా..? ఓ కుక్క ఫొటో.. ఏంటీ కుక్కలకు (Dogs) హోర్డింగ్ అనుకుంటున్నారా? అయితే ఈ కథా కమామీషు తెలుసుకోండి.
గ్రామాల్లో గానీ, నగరాల్లో గానీ హోర్డింగ్‌లో పుట్టినరోజు శుభాకాంక్షలు (Birthday wishes) అంటే అదో గౌరవంగా భావిస్తారు చాలామంది. అదే దారిలో మధ్యప్రదేశ్ (Madhya Pradesh)లో ఓ పెంపుడు కుక్క పుట్టినరోజు పురస్కరించుకుని దాని యజమాని నాంచు అగర్వాల్ (Nanchu Agarwal) వినూత్న ఆలోచన చేశాడు. ఏకంగా హోర్డింగ్ ఏర్పాటుచేసి శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు ఏర్పాటుచేశాడు. అయితే అందులోనూ వినూత్న పద్దతిని అవలంభించాడు. ఆ కుక్కకు శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు కొన్ని పేర్లతో ఫొటోలు ముద్రించాడు. ఇపుడు అదే హాట్ టాఫిక్‌గా మారింది.
మధ్యప్రదేశ్‌లోని బేతుల్ ప్రాంతంలో ఓ కుక్క యజమాని తన కుక్క పుట్టినరోజును ప్రత్యేకంగా జరుపుకున్నాడు. ఆ కుక్కకు హోర్డింగ్ ఏర్పాటుచేసి కింద పేరుకు బదులు వఫాదార్ (నమ్మకమైన) కుక్కగా రాశాడు. అంతేకాదండోయ్ ఆ కుక్కకు ఆ ప్రాంతంలోని మిగిలిన కుక్కలు శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు వాటి ఫొటోలు ముద్రించాడు. ఇక్కడే ఆ యజమాని తన చాతుర్యాన్ని ప్రదర్శించాడు. ఆ కుక్కులకు పేర్లు పెట్టాడు. రాజకీయ నాయకులకు చురకలంటించేలా ఆ పేర్లు ఉండటం గమనార్హం.
ఆ కుక్కలకు బ్యానర్లలో 'దల్బద్లు' (ఫిరాయింపుదారు), ధోకేబాజ్ (మోసగాడు), 'చాప్లస్' (సైకోఫాంట్), 'ఖుజ్లీ' (దురద), 'పెహ్చానో కౌన్' (ఎవరో ఊహించండి), 'ఛర్రా (కింద వాడు లేదా పనివాడు)' 'జాంకీబాజ్' (పెద్దగా మాట్లాడేవాడు), 'ఫేకులాల్' (గొప్పవాడు), 'మౌకా పరస్ట్' (అవకాశవాది) అని పేర్లు పెట్టారు. కాగా, ఈ పేర్లన్నీ రాజకీయ నాయకలను ఉద్ధేశించి పెట్టినవిగా ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ హోర్డింగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
MP के बैतूल जिले में डॉगी मालिक ने उसका मुलताई के बीच चौराहे पर हॉर्डिंग लगाया है. इस हॉर्डिंग को देखते ही लोग इसकी चर्चा करने लगे हैं. हॉर्डिंग में मुख्य डॉगी के साथ-साथ कई अन्य डॉगी भी हैं. मुख्य डॉगी को नाम दिया गया है वफादार, जबकि अन्य को झांकीबाज, धोखेबाज जैसे नाम दिए. pic.twitter.com/puro3ymzbw
దీనిపై సమాజ్‌వాదీ పార్టీ జిల్లా అధ్యక్షుడు అనిల్ సోనీ మాట్లాడుతూ.. రాజకీయ నేతలను, వారి స్వార్థ ప్రయోజనాల కోసం వారిని పొగిడే వారి అనుచరులను హేళన చేసేందుకే ఈ హోర్డింగ్‌లు ఉన్నాయని తెలిపారు.
Published by:Prabhakar Vaddi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.