లోక్ సభ ఎన్నికల్లో గెలిచిన సన్నీలియోన్... ఎలాగంటే...

Lok Sabha Election Results 2019 : లోక్ సభ ఎన్నికల్లో అభ్యర్థుల సంగతేమో గానీ... హాట్ స్టార్ సన్నీ లియోన్ మాత్రం ఇండియాలో ట్రెండింగ్ సృష్టిస్తోంది. ఇందుకు కారణం మాత్రం లోక్ సభ ఎన్నికలే. ఎందుకంటే....

Krishna Kumar N | news18-telugu
Updated: May 23, 2019, 1:59 PM IST
లోక్ సభ ఎన్నికల్లో గెలిచిన సన్నీలియోన్... ఎలాగంటే...
సన్నీ లియోన్ (File Image)
Krishna Kumar N | news18-telugu
Updated: May 23, 2019, 1:59 PM IST
లోక్ సభ ఎన్నికల్లో ఈసారి బీజేపీ దూసుకెళ్తోందని మనకు తెలుసు కదా. ఈ ఎన్నికల్లో బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్ బీజేపీ తరపున పంజాబ్‌లోని గుర్దాస్‌పూర్ నుంచి పోటీ చేశారు. ఆ కౌంటింగ్‌లో ఆయన భారీ మెజారిటీతో ఆధిక్యంలో ఉన్నారు. అంతవరకూ అంతా బాగానే ఉంది. ఐతే... సన్నీడియోల్ గురించి చెబుతూ... రిపబ్లిక్ టీవీ ఎడిటర్ అర్నబ్ గోస్వామి... సన్నీలియోన్ లీడింగ్‌లో ఉన్నారు అని పలికి... వెంటనే నాలిక కరచుకొని... సన్నీ డియోల్ లీడింగ్‌లో ఉన్నారు అని అన్నారు. ఇప్పుడది వైరల్ అయిపోయింది. ఆయన మాటల్ని రికార్డ్ చేసిన నెటిజన్లు ట్విట్టర్‌లో షేర్ చేశారు. అంతే క్షణాల్లో ఆ వీడియో... దేశమంతా చేరింది. దాన్ని పది వేల మందికి పైగా లైక్స్ చేయడంతో... లోక్ సభ ఎన్నికలతో ఏ సంబంధమూ లేని సన్నీ లియోన్ ట్రెండింగ్ అయిపోయింది.

తన గురించి అర్ణబ్ గోస్వామి నాలిక కరచుకోవడంపై సన్నీ లియోన్ ట్విట్టర్‌లో స్పందించింది. నేను ఎన్ని ఓట్లతో ఆధిక్యంలో ఉన్నాను అని సరదాగా ట్వీట్ చేసింది. ఆ ట్వీట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. 39 వేల మందికి పైగా లైక్ చేశారు.మొత్తానికి అర్ణబ్ గోస్వామి... సన్నీడియోల్ బదులు... సన్నీ లియోన్ అని ఎందుకు పలికారన్నది నెటిజన్లు వేస్తున్న ప్రశ్న. మాట జారితే వెనక్కి తీసుకోలేం అన్నట్లుగా... అనుకోకుండా అలా పలికేసిన అర్ణబ్... ఇప్పుడు నెటిజన్లకు ఎలా సమాధానం చెప్పాలో తెలియక ఇరకాటంలో పడ్డారు.

 

ఇవి కూడా చదవండి :

ఇక నవరత్నాలు, మేనిఫెస్టో అమలుపై వైసీపీ దృష్టి... రైతులకు అధిక ప్రాధాన్యం...

రావాలి జగన్... కావాలి జగన్... గ్రాండ్ సక్సెస్...

లగడపాటి సర్వే సన్యాసమేనా... RG ఫ్లాష్ టీమ్ ఫసక్...

ఏపీ ఉద్యోగుల సెగ... టీడీపీకి మరోసారి షాక్...
First published: May 23, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...