ఆసక్తిగా సాగుతున్న ఆట మైదానంలో జరిగే కొన్ని సంఘటనలు ఎప్పుడూ సరదాగానే ఉంటాయి. గ్రౌండ్‌లో ఉండే ఆటగాళ్లతో పాటు స్టేడియంలో ఉండే ఫ్యాన్స్ కూడా ఇలాంటి హాస్యాస్పద సన్నివేశాలను చూసి నవ్వుకుంటారు. తాజాగా అమెరికాలో ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. సోమవారం న్యూయార్క్ యాంకీస్, బాల్టీమోర్ ఓరియోలెస్ మధ్య బేస్‌బాల్ మ్యాచ్ జరుగుతుండగా.. మైదానం మధ్యలోకి ఒక పిల్లి పరుగెత్తుకుంటూ వచ్చింది. ఆ తరువాత మైదానమంతా తిరుగుతూ ఆటకు కొంతసేపు అంతరాయం కలిగించింది. దాన్ని పట్టుకునేందుకు యాంకీస్ స్టేడియం సిబ్బంది నానా అవస్థలు పడ్డారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వీడియోను గమనిస్తే.. ఆట ఆసక్తిగా సాగుతుండగా మైదానంలోకి పిల్లి రావడం గమనించవచ్చు. అనంతరం అది మైదానంలో పరుగులు తీసింది. ఆ పిల్లిని పట్టుకునేందుకు గ్రౌండ్ సిబ్బంది మోహరించారు. దీంతో అది గ్రౌండ్‌లోని ఫెన్స్ వరకు పరుగులు తీసింది. స్టేడియంలో ఉన్నవారంతా అత్యంత విలువైన ఆటగాడు వచ్చాడని హాహాకారాలు చేశారు. ఆ పిల్లిని పట్టుకోవడం కష్టమైందని, ఎన్ని ప్లాన్లు వేసినా అది చిక్కకుండా వేగంగా తప్పించుకుందని ఔట్ ఫీల్డర్ జోయే గాలో తెలిపారు.
ఇది కూడా చదవండి : ఆరు నెలల నుంచి భార్య ముఖం కూడా చూడలేదు.. చివరికి ది గ్రేట్ వాల్ అన్పించుకున్నాడు..
ఈ వీడియో నెటిజన్లకు నవ్వు తెప్పిస్తోంది. వివిధ రకాల కామెంట్లతో నెటిజన్లు సందడి చేస్తున్నారు. యాంకీస్ స్డేడియం గ్రౌండ్ సిబ్బందిపై జోకులు పేలుస్తున్నారు. "యాంకీస్ స్టేడియం సిబ్బంది కొన్ని నిమిషాల పాటు మైదానం చుట్టూ పిల్లిని వెంబడించారు. కానీ దానిపై చేతులు కూడా వేయలేకపోయారు" అని ఓ ట్విట్టర్ యూజర్ పోస్ట్ పెట్టాడు. "ఈ రాత్రి యాంకీస్ స్టేడియంలో అత్యంత ఎంటర్టైన్మెంట్ సంఘటన ఇదే" అంటూ మరోకరు స్పందించారు.
Yankee Stadium security chases a cat around the field for nearly four minutes and never gets its hands on what might be the most elusive animal that ever lived pic.twitter.com/w2HR4H3HaW
— Jomboy Media (@JomboyMedia) August 3, 2021
ఇది కూడా చదవండి : " అనుష్క శర్మ ఏంటీ పిచ్చి పనులు.. వామికా ఉందన్న విషయాన్ని మర్చిపోయావా..? "
ఇలాంటి ఆసక్తికర సంఘటనలు గతంలోనూ జరిగాయి. ప్రస్తుతం జరుగుతున్న టోక్యో ఒలింపిక్స్ లోనూ ప్లిలి ప్రస్తావన వైరల్‌గా మారింది. పిల్లిపై అమితమైన ఇష్టాన్ని పెంచుకున్నాడు రష్యాకు చెందిన ఎవెన్జీ రైలోవ్. ఈ స్విమ్మర్ 100 మీటర్ల బ్యాక్ స్ట్రోక్ ఈవెంట్‌లో స్వర్ణాన్ని కైవసం చేసుకున్నాడు. అయితే పతకం తీసుకునేటప్పుడు పిల్లి బొమ్మ ఉన్న ఫేస్ మాస్క్ ధరించాలని నిర్ణయించుకోగా.. నిర్వాహకులు ముందు అందుకు ఒప్పుకోలేదు. దీంతో విజయానందం కంటే కూడా మాస్క్ ధరించేందుకు ఒప్పుకోనందుకు అతడు ఎక్కువ బాధపడ్డాడు. అయితే ఎట్టకేలకు అతడు తన కోరికను తీర్చుకున్నాడు. పోడియం వద్ద పిల్లి మాస్క్ ధరించి పతకం తీసుకునేందుకు నిర్వాహకులు ఒప్పుకున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Sports, Viral Video