IN HEART TOUCHING VIDEO PARALYSED MAN JOSH SMITH USES EXOSKELETON SUIT TO GET DOWN ON ONE KNEE AND PROPOSE TO GIRL FRIEND GH SRD
Viral Video: వీల్‌చైర్‌కే పరిమితమయ్యాడు.. అయినా మోకాళ్లపై లవర్‌కు ప్రపోజ్ చేశాడు.. ఎలాగంటే...
Photo Credit : You Tube
Viral Video: ప్రేమ అనే భావన కొందరికి వ్యసనంలా మారుతుంది. ఎదుటి వాళ్లు తమని ప్రేమించట్లేదని తెలిసినా.. వారిని చూస్తూ కళ్లతోనే ప్రేమ వర్షం కురిపించే వన్‌సైడ్ లవర్స్‌ను మనం చూసే ఉంటాం.
ప్రేమ అనే భావన కొందరికి వ్యసనంలా మారుతుంది. ఎదుటి వాళ్లు తమని ప్రేమించట్లేదని తెలిసినా.. వారిని చూస్తూ కళ్లతోనే ప్రేమ వర్షం కురిపించే వన్‌సైడ్ లవర్స్‌ను మనం చూసే ఉంటాం. పెద్దవాళ్లను ఎదిరించి ప్రేమ పెళ్లి చేసుకున్న వారిని చూశాం. అయితే ప్రేయసి ప్రేమను గెలిచేందుకు వైకల్యం అడ్డురాదని నిరూపించాడు ఒక అమెరికన్ యువకుడు. వీల్‌చైర్‌కే పరిమితమైన ఆ వ్యక్తి.. ప్రేయసికి లవ్ ప్రపోజ్ చేయడానికి మోకాళ్లపై నిల్చోవడం విశేషం. ఊపిరి సినిమాలో నాగార్జున మాదిరిగానే కేవలం వీల్‌చైర్‌కే పరిమితమైన ఆ వ్యక్తి సంకల్పానికి.. ప్రేయసి సైతం ముగ్ధురాలైంది. అందుకే లిప్ కిస్ ఇచ్చి మరీ అతడి ప్రపోజల్‌కు ఓకే చెప్పింది. ఈ సంఘటన అమెరికాలోని వర్జీనియా రాష్ట్రంలోనిని రిచ్‌మండ్ ప్రాంతంలో జరిగింది.
వివరాల్లోకి వెళ్తే.. వర్జీనియాకు చెందిన జోష్ స్మిత్ ఎంతో చురుగ్గా ఉండేవాడు. ఒకరోజు స్నేహితులతో కలిసి సముద్రంలో డైవింగ్ చేస్తుండగా అతడికి ప్రమాదం జరిగింది. అతడి తల, శరీరం ఒక ఇసుకదిబ్బకు తగలడంతో నరాలు దెబ్బతిన్నాయి. అతడు నడవలేడని, వీల్ చైర్‌కు పరిమితం కావాల్సి ఉంటుందని వైద్యులు చెప్పారు. అయితే స్మిత్ కుటుంబం అతడికి అండగా నిలిచింది. అతడి అవసరాలకు అనుగుణంగా వారు ఒక ఇంటిని నిర్మించారు. ఈక్రమంలో ఓ డేటింగ్ యాప్‌లో అతనికి గ్రేసీ అనే యువతి పరిచయమైంది. గ్రేసీ కూడా పేరుకు తగినట్టుగానే అందమైనది. చురుకైనది. పైగా ఆమెది కూడా రిచ్‌మండే. ఇద్దరూ వెళ్ళేది కూడా ఒక చర్చికే. ఇలా ఇద్దరి మనసులు కలిశాయి. ఒకరి ప్రేమ ఒకరికి అర్థమైంది.
అయితే తన ప్రేమను సంప్రదాయబద్ధంగా మోకాళ్లపై నిల్చొని చెప్పాలనుకున్నాడు జోష్ స్మిత్. కానీ అందుకు అతని శరీరం సహకరించదు. కనీసం ఒక మోకాలినైనా అతడు వంచలేడు. అయినా తన ప్రయత్నాన్ని మాత్రం ఆపలేదు. ఇందుకోసం తనకు చికిత్స అందిస్తున్న డాక్టర్లతో మాట్లాడాడు. వారు ఎక్సోస్కెలిటన్ సూట్‌ను ఉపయోగించమని చెప్పారు. దీని ద్వారా అంగవైకల్యం ఉన్నవారు కాళ్లు, చేతులను వేరే యాంగిల్‌కు మార్చుకునే అవకాశం ఉంటుంది. దీంతో స్మిత్‌కు ఎక్సో స్కెలిటన్ సూట్‌ను అందించారు అతడి స్నేహితులు. దగ్గరుండి మరీ వారు ఈ ఏర్పాట్లను చూసుకున్నారు.
మొత్తానికి ఆ రోజుగ్రేసీ.. స్మిత్ ఇంటికి వచ్చింది. కుటుంబసభ్యులందరూ ఉత్కంఠగా ఒక గదిలో ఉన్నారు. ఈ క్రమంలో స్మిత్.. ఒక మోకాలిపై డౌన్ అయి "విల్ యు మ్యారీ మీ" అని గ్రేసీని అడిగాడు. అలా ఒంటికాలుపై ప్రేమను వ్యక్తం చేసిన జోష్ స్మిత్‌ను.. గ్రేసీ మెరిసే కళ్ళతో చూసింది. ఆమె కన్నీళ్లు.. అతని ప్రేమను అంగీకరించినట్టు చెప్పాయి. ఆమె పెదవులు అతని పెదవులకు ఆ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాయి. ఇంట్లోంచి ఈ దృశ్యాన్ని చూసిన జోష్ కుటుంబసభ్యుల ఆనందం అంతా ఇంతా కాదు. ఇలా వీల్‌చైర్‌కే పరిమితమైన స్మిత్ జీవితానికి గ్రేసీ ఇప్పుడిక కొత్త నడకలు నేర్పనుంది. బహుశా ప్రపంచంలో ఒంటి మోకాలుపై తన ప్రేమను వ్యక్తం చేసిన ఏకైక వ్యక్తి జోష్ స్మిత్ మాత్రమే అయ్యుంటాడని గ్రేసీ హర్షం వ్యక్తం చేసింది.
Published by:Sridhar Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.