హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Viral Video : కేరళ సీఎంకు చేదు అనుభవం..విమానంలోనే సీఎంకు నిరసన సెగ

Viral Video : కేరళ సీఎంకు చేదు అనుభవం..విమానంలోనే సీఎంకు నిరసన సెగ

కేరళ సీఎంకు విమానంలో నిరసన సెగ

కేరళ సీఎంకు విమానంలో నిరసన సెగ

Slogans Against CM In Flight : కేరళ(Kerala)ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ కు విమానంలో చేదు అనుభవం ఎదురైంది. కేరళలో సంచలనం సృష్టించిన గోల్డ్ స్మగ్లింగ్‌ కేసు(Gold Smuggling Case)లో ప్రధాన నిందితురాలు స్వప్నా సురేష్..ఇటీవల ముఖ్యమంత్రి పై సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.

ఇంకా చదవండి ...

Slogans Against CM In Flight : కేరళ(Kerala)ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ కు విమానంలో చేదు అనుభవం ఎదురైంది. కేరళలో సంచలనం సృష్టించిన గోల్డ్ స్మగ్లింగ్‌ కేసు(Gold Smuggling Case)లో ప్రధాన నిందితురాలు స్వప్నా సురేష్..ఇటీవల ముఖ్యమంత్రి పై సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్​ కారణంగానే తాను బంగారం స్మగ్లింగ్​లో ఇరుక్కున్నట్లు స్వప్న సురేశ్​ వెల్లడించారు. ఈ కేసుతో కేర‌ళ సీఎం పిన‌రయి విజ‌య‌న్‌(CM Pinarayi Vijayan), ఆయన భార్య క‌మ‌లా విజ‌య‌న్‌, కూతురు వీణా విజ‌య‌న్‌, రాష్ట్ర ప్ర‌భుత్వ మాజీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి న‌ళిని నెట్టో, సీఎం అద‌న‌పు వ్య‌క్తిగ‌త కార్య‌ద‌ర్శి సీఎం ర‌వీంద్ర‌న్‌, రాష్ట్ర మాజీ మంత్రి కేటీ జ‌లీల్‌ల‌కు సంబంధం ఉంద‌ని స్వ‌ప్న సురేశ్ ఆరోపించారు. గత మంగళవారం ఎర్నాకుళంలోని కోర్టుకు హాజరైన ఆమె.. ఈ కేసుకు సంబంధించి పలు ఆధారాలను సమర్పించారు.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ సహా విపక్షాలు ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా కొద్దిరోజులుగా ఆందోళన నిర్వహిస్తున్నాయి. సీఎం పదవికి విజయన్ రాజీనామా చేయాలని నిరసనలు చేస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం(జూన్13)తిరువనంతపురంలో క్యాన్సర్‌ చికిత్స పొందుతున్న బంధువుల్ని పరామర్శించేందుకు సీఎం విజయన్... కన్నూరు(Kannur)లో విమానంలో ఎక్కారు. అయితే ఇద్దరు యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ప్యాసింజర్లు మాదిరిగా ఆ విమానం ఎక్కారు. అయితే విమానం(Flight)తిరువనంతపురం ఎయిర్ పోర్ట్ లో ల్యాండ్ అవుతున్న సమయంలో..విమానంలోనే  ఇద్దరు యూత్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలు సీఎం ఎదుట ఆందోళనకు దిగారు. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసనకు దిగారు. అయితే అప్రమత్తమైన లెఫ్ట్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్ కన్వీనర్ జయరాజన్‌ వారిని అడ్డుకుని పక్కకు నెట్టేశారు.


ఏడు జన్మలా,ఏడు సెకన్లు కూడా ఈ భార్యలు మాకొద్దు. వ్రతం చేసిన భార్యబాధితులు

ఈ వ్యవహారాన్నంతా విమానంలోని ప్రయాణికుడు వీడియో తీశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. నిరసనకారుల్ని మత్తనూర్ బ్లాక్‌ కాంగ్రెస్ అధ్యక్షుడు ఫాజిన్‌ మాజిద్‌, కార్యదర్శి ఆర్కే నవీన్‌లుగా గుర్తించారు. నిరసనకారులు మద్యం మత్తులో ముఖ్యమంత్రి వైపు దూసుకొచ్చేందుకు ప్రయత్నించారని ఎల్డీఎఫ్‌ కన్వీనర్ ఈపీ జయరాజన్ చెప్పారు. మద్యం సేవించారనే ఆరోపణల్ని నిరసకారులు తోసిపుచ్చారు. విమానంలో తమ కార్యకర్తలు ప్రజాస్వామ్యబద్దంగా నిరసన మాత్రమే తెలిపారని ముఖ్యమంత్రిపై దాడికి ప్రయత్నించలేదని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. విమానంలో సీఎంకి చేదు అనుభవం నేపథ్యంలో రాష్ట్రంలోని పలు చోట్ల ఘర్షణలు చెలరేగాయి. ఇడుక్కిలో కాంగ్రెస్‌ కార్యకర్తలపై సిపిఎం కార్యకర్తలు దాడులు చేశారు. రెండు పార్టీల మధ్య జరిగిన ఘర్షణల్లో 17మందికి పైగా గాయపడ్డారు.


See pics : సముద్రంలో బంగారు ఓడ..కుప్పలు కుప్పలుగా బంగారం.. దేశం అప్పులు తీరిపోతాయ్..

ఇక,ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని, బాధ్యులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని సీపీఎం ఎంపీ వీ.శివదాసన్‌ డీజీసీఏ(DGCA)డైరెక్టర్‌ జనరల్‌కు లేఖ రాశారు. . విమానంలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని,అలా చేయడం విమాన భద్రత నిబంధనలకు భంగం కలిగించడమే అవుతుందని తెలిపారు.

First published:

Tags: Flight, Gold smuggling, Kerala, Pinarayi Vijayan, Viral Video

ఉత్తమ కథలు