Bizarre tradition: ఆ మూడు రాత్రులూ వధూవరులు మూత్రం పోయకుండానే శోభనం చేసుకోవాలంట. ఎక్కడో తెలుసా..

బోర్నియో దీవి (photo: besttoppers.com)

శోభనం (shobhanam) ఏర్పాట్లయితే చేస్తారు. కానీ, వారిని ఆ మూడు రోజులు ఓ గది (Room)లో ఉంచేస్తారు. కనీసం మూత్ర విసర్జనకు కూడా వదిలిపెట్టరు. ఆ మూడు రోజులు తగినంత ఆహారం (food), నీళ్లు (water) మాత్రమే ఇస్తారు. ఇంతకీ ఈ ఆచారం ఎక్కడ పాటిస్తున్నారో తెలియాలంటే.. మీరు బోర్నియో (Borneo) వెళ్లాల్సిందే.

 • Share this:
  శోభనం (Shobanam). పెళ్లి అయిన తర్వాత సంప్రదాయ బద్దంగా జరిగే కార్యక్రమం. చాలామంది యంగ్​స్టర్స్​కి అదొక తియ్యని అనుభూతి. పెళ్లి తర్వాత వచ్చే మూడు రాత్రులు (three nights after marriage) చాలా గుర్తుంచుకుంటారు. భార్యలతో ఇబ్బందులు పడిన వారైనా.. భర్తలతో ఇబ్బందులు పడిన వారైనా శోభనం మూడు రాత్రుల తర్వాత జరిగే వాటి పైనే జోకులు పేల్చుకుంటారు తప్ప. ఆ మూడు రాత్రులపై ఎక్కువగా ఫిర్యాదులు చేసుకోరు. అయితే ఆ ఐలాండ్ (Island)లోని ఓ తెగ వాళ్లకు మాత్రం అదొక నరకం. ఏంటీ మూడు రాత్రుళ్లు నరకం ఎందుకు అంటారా? అవును మరి ఆ మూడు రాత్రులు బతికితే చాలు రా బాబు.. అనుకునేంత భయపడుతుంటారు ఆ తెగ వాళ్లు.. అక్కడి ఆచారం అలా ఉంది. ఇంతకీ ఆ మూడు రాత్రుళ్లు వాళ్లు ఏం చేస్తారో తెలిస్తే షాక్​ అవ్వాల్సిందే.. శోభనం (shobhanam) ఏర్పాట్లయితే చేస్తారు. కానీ, వారిని ఆ మూడు రోజులు ఆ గది (Room)లోనే బంధిస్తారు. కనీసం మూత్ర విసర్జనకు కూడా వదిలిపెట్టరు. ఆ మూడు రోజులు తగినంత ఆహారం (food), నీళ్లు (water) మాత్రమే ఇస్తారు. ఇంతకీ ఈ ఆచారం ఎక్కడ పాటిస్తున్నారో తెలియాలంటే.. మీరు బోర్నియో (Borneo) వెళ్లాల్సిందే.

  మూడు దేశాలకు ఒకే దీవి

  బోర్నియో ఐలాండ్ (Borneo island) ఆసియాలోనే మూడో అతిపెద్ద దీవి. సుమత్రా దీవులకు తూర్పు భాగంలో ఉన్న ఈ ఐలాండ్‌ను ఇప్పటివరకు ప్రత్యేక దేశంగా గుర్తించలేదు. అయితే, ఇండోనేషియా, బ్రూనై, మలేషియాలకు చెందిన మూడు రాజకీయ పార్టీలు ఈ ప్రాంతాన్నీ పాలిస్తున్నాయి. ఇక్కడి తీర ప్రాంతాలు పర్యాటకులకు ఎంతగానో ఆకట్టుకుంటాయి. అయితే, ఇక్కడ పాటించే కొన్ని ఆచారాలు (Traditions) చాలా చిత్రంగా ఉంటాయి.

  గదిలోనే మూడు రాత్రులు..

  బోర్నీయాలో నివసిస్తున్న కొన్ని గిరిజన తెగలు.. పెళ్లి (marriage)ని గొప్ప ఆచారంగా భావిస్తాయి. పెళ్లి తర్వాత వధూవరులను (The bride and groom) ఒక గది (room)లో బంధిస్తారు. వారిని కనీసం టాయిలెట్‌కు కూడా వెళ్లనివ్వరు. అలాగని, ఆ గదిలో ఏర్పాట్లు చేస్తారని అనుకున్నా పొరపాటే. ఎందుకంటే.. ఆ మూడు రోజులు వాళ్లు మూత్రాన్ని(Stopping to go to the urinal) ఆపుకోవాలి. కనీసం మల విసర్జన (Defecation )కు కూడా అనుమతి ఇవ్వరు.

  ఆ కొత్త జంట ఆ మూడు రోజులు (three days) శోభనాన్ని ఎంజాయ్ చేయడం దేవుడెరుగు. మొదటి రోజు వారికి ఈ ఆచారం ( Prohibits couples from using the bathroom) పెద్దగా ఇబ్బంది కలిగించకపోవచ్చు. కానీ, మిగతా రెండు రోజులు వారికి నరకమే కనిపిస్తుండొచ్చు. శృంగారం అంటే చాలు వణికి పోతారేమో. ఒక వేళ సెక్స్ చేసినా.. ఆ తర్వాత శుభ్రం చేసుకోడానికి కూడా అనుమతి (No permission) కూడా లభించదట. దీంతో వాళ్లు ఆ మూడు రోజులు ఆ గదిలో కలిసి ఉన్న కలవలేని పరిస్థితి నెలకొంటుంది.

  మూత్రానికి వెళితే చనిపోతారని..

  ఇది ఎన్నాళ్ల నుంచో వస్తున్న సంప్రదాయమని బోర్నియో ప్రజలు చెబుతున్నారు. పెళ్లి తర్వాత వధు, వరులు మూత్రానికి పోయినట్లయితే.. ఇద్దరిలో ఒకరు చనిపోతారని (dies) నమ్ముతారు. అలాగే, వారికి పుట్టే బిడ్డలు పుట్టిన వెంటనే చనిపోతారని భావిస్తారు. ఆ మూడు రోజులు మూత్రానికి వెళ్లకుండా ఆపుకోవడం (Stopping to go to the urinal) వల్ల వారి మధ్య బంధం బలోపేతం అవుతుందని చెబుతున్నారు. అయితే, ఇలా చేయడం ఆరోగ్యానికి మంచిది కాదని వైద్య నిపుణులు తెలుపుతున్నారు.

  ఇది కూడా చదవండి: మద్యంతో మీ అందాన్ని రెట్టింపు చేసుకోవచ్చంట.. మీ నొప్పులనూ దూరం చేస్తుందట.. ఎలాగంటే

  ఇది కూడా చదవండి: ఉద్యోగుల బదిలీ కోసం టాస్​ వేసిన పంజాబ్​ కాబోయే సీఎం.. సోషల్ మీడియాలో వీడియో వైరల్​
  Published by:Prabhakar Vaddi
  First published: