నల్ల జాతీయులపై పోలీసుల దౌర్జన్య కాండను వ్యతిరేకిస్తూ... అమెరికాలో ఆరు రోజులుగా రాత్రి వేళ నిరసనలు జరుగుతున్నాయి. ఆఫ్రికన్ అమెరికన్ అయిన జార్జ్ ఫ్లాయిడ్‌ను పోలీసులు అరెస్టు చేస్తుండగా అతను చనిపోయాడు. దాంతో... పోలీసులపై యువత తిరగబడుతున్నారు. ఎక్కడికక్కడ హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. వాహనాలని తగలబెడుతున్నారు. అమెరికాలో నలభై నగరాల్లో కర్ఫ్యూ ఉంది. అయినా నిరసనలు ఆగట్లేదు. ఉద్రిక్తతలూ తగ్గట్లేదు. న్యూయార్క్, చికాగో, ఫిలడెల్ఫియా, లాస్ ఏంజెల్స్‌లో టెన్షన్ వాతావరణం ఉంది. ఆందోళనకారులు పోలీసు వాహనాల్ని తగలబెట్టారు. షాపుల్లో దూరి దోపిడీలు చేశారు. చివరకు వైట్‌హౌస్ దగ్గర కూడా రాళ్లు విసిరి... మంటలు పెట్టారంటే... పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఈ అల్లర్లలో ఓ నిరసనకారుడు... బ్యాట్‌మేన్ గెటప్‌తో ఎంట్రీ ఇవ్వడం అందరి దృష్టినీ ఆకర్షించింది. బ్యాట్‌మేన్ సినిమాలో ఆందోళనలు జరుగుతున్నప్పుడు ఎలాగైతే బ్యాట్‌మేన్ వస్తాడో... అలాగే... ఆందోళనకారుడు కూడా అదే కాస్ట్యూమ్‌తో రావడంతో... అతన్ని వెనక నుంచి వీడియో తీశారు. ఆ సమయంలో ఆందోళనలు, పొగ, దుమ్ము అన్నీ సినీమాటిక్ లుక్ తెప్పించాయి. ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో షేర్ చేశారు. అది కాస్తా వైరల్ అయ్యింది.
US protests and someone is roaming around as Batman. It’s 2020, why not... 🤷🏽♂️ pic.twitter.com/1vxthrjAmw
— Kabir Taneja (@KabirTaneja) May 31, 2020
నల్లజాతీయులకు మద్దతుగా బ్యాట్‌మేన్ ఎంట్రీ బాగుందని నెటిజన్లు అంటున్నారు. చాలా మంది నిరసనలకు తమ మద్దతు తెలుపుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: America, VIRAL NEWS, Viral Videos