Home /News /trending /

IN A VIRAL VIDEO A YOUNG BOY THRASHED DONKEY AND BEATS CONTINUOSLY FINALLY ANIMAL RESPONSE WAS EPIC WATCH SRD

Viral Video : కర్మ సిద్ధాంతం అంటే ఇదే.. గాడిద మీద ప్రతాపం చూపించాడు.. చివరికి ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు..

Photo Credit : Twitter

Photo Credit : Twitter

Viral Video : మనం చేసిన పాప, పుణ్య కర్మలు ఫలితాలను ఎవరికి వారు తప్పక అనుభవించాల్సిందే అంటుంది శాస్త్రం. చేసే పని, దానికి కలిగే ఫలితం కూడా కర్మను అనుసరించి వస్తుంది. ఓ యువకుడి విషయంలో కర్మ సిద్ధాంతం ఇన్ స్టెంట్ గా పనిచేసింది.

    ప్రస్తుత సోషల్ మీడియా(Social Media) యుగంలో ప్రపంచమే ఒక కుగ్రామంలా మారింది. ఏ మూలన ఏం జరిగినా ఇట్టే తెలిసిపోయే పరిస్థితి ఉంది. ఇక సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక వార్త, వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. వాటిలో చాలా వరకు ఫన్నీ వీడియోలు ఉంటాయి. ఇక ప్రాంక్‌లు, జంతువులకు సంబంధించిన ఫన్నీ వీడియో, భయానకమైవి, ఆశ్చర్యాన్ని కలిగించేవి, విజ్ఞానాన్ని పెంపొందించేవి కూడా ఉంటాయి. కానీ.. ఈ మధ్య కొందరు పాపులర్ అవ్వడానికి మూగజీవాల్ని (Animals) హింసిస్తున్నారు. అలాంటి కోవకు చెందిన వీడియో ఒకటి వైరలవుతుంది. కొన్నిసార్లు తోక లాగడం, కొన్నిసార్లు చెవులు లాగడం, తాడు లేదా బెల్టుతో లాగడం, బూట్లతో కొట్టడం.. ఇలా ఒకటి లేదా రెండు జంతువులను హింసించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాంటి దారుణమైన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇందులో ఓ యువకుడు గాడిదను కొట్టాడు. అయితే తనను బాగా హింసించిన యువకుడికి కూడా తిక్క కుదిర్చింది గాడిద.

    గాడిదలు తెలివితక్కువ జంతువులు అని చాలా మంది అంటారు. అవి నిశ్శబ్దంగా మరియు బలహీనంగా ఉన్నందున ఏం చేయలేవని చాలా మంది భావిస్తారు. ఈ యువకుడి కూడా అలానే అనుకుని రెచ్చిపోయాడు. ఆ మూగ జీవితో చెలగాటమాడాడు. కానీ మనిషికైనా, మూగజీవికైనా సహనం అనేది ఓ పరిమితిలోనే ఉంటుంది. ఓపిక నశిస్తే ఏం జరుగుతుందో చెప్పాల్సిన పనిలేదు. ఈ వీడియోలో ఇదే జరిగింది.



    వీడియోలో మీరు గాడిద మరియు యువకుడిని చూడవచ్చు. గాడిద నిలబడి ఉంది. యువకుడు ఆ గాడిదను కొడుతున్నాడు. తన కుడిచేత్తో దాని ముఖంపై కొట్టాడు. ఆ తర్వాత ఆ యువకుడు తన శక్తి నంతా ఉపయోగించి.. గాడిదను తీవ్రంగా హింసించాడు. బట్టలు ఉతికినట్టుగా గాడిదను బాదాడు. పాపం.. ఈ వీడియోలో గాడిదను చూస్తే మనకు ఆ యువకుడి మీద తీవ్ర కోపం వస్తుంది.


    అయితే.. యువకుడు గాడిద సహనానికి ముగింపు పలికాడు. చివరలో గాడిద ఓర్పు నశించి.. అతనిపై తన కోపాన్ని చూపించింది. అక్కడిక్కడే మనోడు తిక్క కుదిర్చింది. యువకుడు కాలును నోటితో పట్టుకుని అతన్ని గిరగిరా తిప్పి నేలపై విసిరికొడుతుంది. యువకుడు తన ప్రాణాలను కాపాడుకోవడానికి పోరాడటం మనం చూడొచ్చు. తనకు జరిగిన అన్యాయానికి గాడిద.. ప్రతీకారం తీర్చుకుంది.

    ఇది కూడా చదవండి : మెట్రో రైల్‌లోనే రెచ్చిపోయింది.. హైదరాబాద్‌ అమ్మాయా.. మజాకా

    ఈ వీడియో @javroar ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయబడింది. వీడియో ప్రారంభంలోనే ఆగ్రహం వ్యక్తం చేసిన నెటిజన్లు... ఆ తర్వాత ఎండింగ్ లో వీడియో ముగింపును చూసి ఆనందిస్తున్నారు. గాడిద యువకుడి తిక్క కుదిర్చింది.. ఇన్ స్టంట్ కర్మ అంటే ఇదేనని కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరలవుతుంది. దీన్ని దాదాపు 30 లక్షల మంది చూశారు.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Donkey, Trending video, VIRAL NEWS, Viral Video

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు