Viral Video : ఓర్నీ.. ఈ జంట బైక్ మీదే అంతా కానిచ్చేలా ఉన్నారుగా..! నడిరోడ్డు మీదే..!

Photo Credit : Twitter

Viral Video : బైక్‌పై వెళ్తూ నలుగురు ఉన్నారన్న విషయాన్ని కూడా మరిచి ముద్దుల్లో మునిగి తేలింది. బిజీగా ఉన్న రోడ్డులో బండిమీద ఉన్నామన్న విషయాన్ని కూడా మరిచి రోమాన్స్ చేయడం ప్రారంభించింది.

 • Share this:
  ఈ మధ్య కొందరు సిగ్గు శరం ఏమాత్రం లేకుండా ప్రవర్తిస్తున్నారు. వాళ్లు జీవిస్తోంది నలుగురి తిరిగే సమజాంలోనేన్న విషయాన్ని కొందరు మరిచిపోయి వికృతంగా ప్రవర్తిస్తున్నారు. ఓ ప్రేమ జంట ఇలాంటి పనులకు తెరదీసింది. బైక్‌పై వెళ్తూ నలుగురు ఉన్నారన్న విషయాన్ని కూడా మరిచి ముద్దుల్లో మునిగి తేలింది. బిజీగా ఉన్న రోడ్డులో బండిమీద ఉన్నామన్న విషయాన్ని కూడా మరిచి రోమాన్స్ చేయడం ప్రారంభించింది. సినిమాల్లో హీరోహీరోయిన్లు చేసినట్లుగా వెరైటీగా రొమాన్స్ చేద్దామనుకుంది ఓ ప్రేమజంట. ఈ నేపథ్యంలో బైక్‌పైనే ఇద్దరూ ముద్దులు హగ్గులతో రెచ్చిపోయారు. ప్రియుడు బైక్ నడుపుతుండకగా ప్రేయసి ఫ్యుయెల్ ట్యాంక్‌పై అతడి వైపునకు తిరిగి కూర్చుని ముద్దుల వర్షం కురిపించగా.. అతగాడు లోకాన్నే మైమరచిపోయాడు.

  వివారాల్లోకెళితే.. మధ్యప్రదేశ్ భోపాల్ లోని ఓ జంట నడిరోడ్డుపై హల్చల్ చేసింది. సినిమాల్లోని హీరోహీరోయిన్ల తరహాలో రొమాంటిక్ బ్రైక్ డ్రైవ్ చేసింది. ప్రియుడు బైక్ నడుపుతుండగా ప్రేయసి ట్యాంక్‌పై అతడికి ఎదురుగా కూర్చుని రొమాన్స్ పండించింది. ప్రేయసి నుంచి ముద్దులు, హగ్గులు అందుకుంటూనే ప్రియుడు వేగంగా బండి నడుపుతున్నాడు. ప్రస్తుతం ఈ 13 సెకన్ల వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

  ఈ వైరల్ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. మీ రొమాన్స్ కోసం ఎదురుగా వచ్చేవారి ప్రాణాలతో చెలగాటం ఎందుకు ఆడుతున్నారని కామెంట్లు చేస్తున్నారు. ఇలాంటి వారిని పోలీసులు పట్టుకుని కఠినంగా శిక్షించాలని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. బహిరంగంగా ఇలా రెచ్చిపోవడం ఏంటని మందలిస్తున్నారు. మీ రొమాన్స్ కి రోడ్డే దొరికిందా అంటూ జనం మండిపడుతున్నారు. సీసీ కెమెరా పుటేజి ఆధారంగా ఆ జంటను పట్టుకుని జైల్లో పెట్టాలని సోషల్ మీడియా వేదికగా ట్వీట్స్ ట్రోల్ అవుతున్నాయి.

  ఈ వీడియోపై స్థానిక పోలీసు అధికారి స్పందిస్తూ.. ఈ వ్యవహరంపై మాకు ఇంతవరకు ఇలాంటి ఫిర్యాదు అందలేదని వెల్లడించారు. అయితే, బైక్ పై హెల్మెట్ లేకుండా ఇలాంటి పనులు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


  మరో, వైరల్ వీడియోలో ఓ యువకుడు స్కూటీని రివర్సు (opposite)లో కూర్చొని... స్కూటీని రివర్సు (reverse driving)లో నడిపాడు. అసలు అలా ఎలా నడిపాడన్నది వీడియో చూసిన మొదటి క్షణం వచ్చే డౌట్. అతను రివర్సులో కూర్చుంటే.. స్కూటీ ఎలా వెళ్లగలుగుతోందనే డౌట్ అంత ఈజీగా తీరదు. పైగా.. అతను బైక్ నడిపినట్లుగా... స్కూటీపై రివర్సులో కూర్చొని నడుపుతూ వెళ్లడం, పెట్రోల్ బంక్ చుట్టూ రౌండ్లు వెయ్యడం ఆశ్చర్యం కలిగిస్తుంది.  వీడియోని జాగ్రత్తగా గమనిస్తే ఓ విషయం అర్థమవుతుంది. బైక్‌కి ముందు హ్యాండిల్ ఉన్నట్లే... వెనక సీటుకి కూడా ఆ కుర్రాడు హ్యాండిల్స్ పెట్టాడు. వాటికే బ్రేక్స్, క్లచ్ అన్నీ సెట్ చేశాడు. అందువల్ల బైక్ అతను చెప్పినట్లుగా వెళ్తోంది. కాకపోతే చూడ్డానికి మాత్రం ఇలా ఎవరూ నడపరే అనిపించేలా ఉందీ వీడియో.
  Published by:Sridhar Reddy
  First published: