Viral Video : సైకిలింగ్ చేస్తోన్న యువతికి సడన్ షాకిచ్చిన కంగారూ.. అసలు ఏం జరిగిందంటే..

Photo Credit : Twitter

Viral Video : జంతు ప్రపంచంలో ఎన్నో వింతలు, అద్భుతాలు జరుగుతుంటాయ్. అలాంటివి సోషల్ మీడియాలో ప్రత్యక్షమైనప్పుడు వాటిని చూసి థ్రిల్ అవుతాం.

  • Share this:
    వింతలు-విశేషాలకు సోషల్ మీడియా(Social Media) నిలయం. ప్రపంచం నలమూలల ఏం జరిగినా క్షణాల్లో వైరల్‌(Viral Latest Telugu News)గా మారుతుంటాయి. ముఖ్యంగా జంతువుల, పక్షుల వీడియోలు ఆకట్టుకుంటాయ్. జంతు ప్రపంచంలో ఎన్నో వింతలు, అద్భుతాలు జరుగుతుంటాయ్. అలాంటివి సోషల్ మీడియాలో ప్రత్యక్షమైనప్పుడు వాటిని చూసి థ్రిల్ అవుతాం. కొంత మంది సమయం దొరకని వారు సోషల్ మీడియాలో జంతువుల సరదాను చూసి తమ సమయాన్ని గడుపుతారు. జంతువులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వచ్చిన వెంటనే వైరల్ కావడానికి కారణం ఇదే. వాస్తవానికి, చాలా అరుదైన దృశ్యాలు అడవిలో కనిపిస్తాయి. అవి చూస్తే మనం కూడా ఆశ్చర్యపోతుంటాం. అయితే, మానవుల తప్పిదంతో అడవులు నాశనం అవుతున్న సంగతి తెలిసిందే. దీంతో అవన్నీ కాంక్రీట్ జంగిల్‌లా మారాయి. మానవులు అడవులను నరకడం ఆపలేదు. అలాగే అందులో ఉండే జంతువుల గురించి కూడా ఆలోచించడం లేదు. ఇలాంటి పరిస్థితిలో, జంతువులు తరచుగా ఊళ్లలోకి వస్తున్న సంఘటనలు ఎన్నో చూస్తునే ఉన్నాం. ప్రస్తుతం నెట్టింట వైరలవుతున్న వీడియో ఈ కోవకే చెందినది. ఈ వీడియోను భారత అటవీ అధికారి సుశాంత్ నందా ఐఎఫ్ఎస్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పంచుకున్నారు. దీంతో నెట్టింట్లో బాగా వైరల్‌గా మారింది.

    ఈ వీడియోలో కొంతమంది యువతులు సైక్లింగ్‌ చేస్తూ కనిపించారు. అయితే ఒక అమ్మాయి వేగంగా దూసుకుపోతూ.. తన ముందున్న వారిని ఓడిస్తో సూపర్ ఫాస్ట్ గా వెళ్లింది. అయితే రోడ్డు మొత్తం‎ ఖాళీగా కనిపిస్తుడడంతో వేగం పెంచిన యువతికి సడన్ షాక్ తగిలింది. ఇంతకీ ఏం జరిగిందంటే సదరు యువతిని సడన్ గా రోడ్డపైకి వచ్చిన ఓ కంగారూ భయపెట్టేసేంది.


    అడవిలో నుంచి ఉన్న రోడ్డు మార్గంలో వీరు సైక్లింగ్ చేస్తున్నారు. ఇంతలో సడన్‌గా రోడ్డు ఓ వైపు నుంచి మరోవైపుకు కంగారూ రోడ్డు దాటేందుకు వేగంగా పరుగెత్తుకొస్తుంది. సదరు యువతి, కంగారు ఒకేసారి రావడంతో.. కంగారూ వేగంగా ఆమెను ఢీకొట్టింది. దీంతో ఆ యువతి సైకిల్‌పై నుంచి కింద పడి అలానే ఉండిపోతుంది. ఇదంతా ఆమె వెనుకాల ఉన్న వారు వీడియోలో బంధించడంతో ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్‌గా మారింది.

    ఇది కూడా చదవండి : రోహిత్ శర్మ డౌటే..! మార్పులు ఖాయం.. ఆఖరి టెస్ట్ లో బరిలోకి దిగే తుది జట్టు ఇదే..!

    దీనిపై చాలా మంది నెటిజన్లు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. జంతువులో రాజ్యంలోకి మనుషుల వెళ్లడం తప్పు.. తగిన శాస్తి జరిగిందంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇప్పటికైనా.. తెలిసిందా.. వాటి స్వేచ్చను హరిస్తే ఏం జరుగుతుందో అంటూ ఫన్నీగా మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.
    Published by:Sridhar Reddy
    First published: