Home /News /trending /

IN A FUNNY MARRIAGE VIDEO WOMAN WITH BURKA HUG GROOM IN WEDDING FUNCTION AND BRIDE REACTION GOES VIRAL IN SOCIAL MEDIA WATCH SRD

Viral Video : పెళ్లి స్టేజీ మీదే వరుణ్ని వాటేసుకున్న వేరే అమ్మాయి.. పాపం ఆ వధువు పరిస్థితి..

Photo Credit : Instagram

Photo Credit : Instagram

Viral Video : సరదా కోసం చేస్తున్నారో లేక పబ్లిసిటీ కోసమో తెలియదు కానీ, పెళ్లి కొడుకు లేదా పెళ్లి కూతురు చేసే పనులు అందరిని విస్మయానికి గురి చేస్తున్నాయి. దానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

    సోషల్ మీడియా (Social Media) ప్రపంచంలో నిత్యం ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతాయి. వైరల్ అయ్యే వీడియోల్లో పెళ్లికి సంబంధిచినవి చాలానే ఉంటాయి. ఇటీవల వెడ్డింగ్ వీడియోలు బాగా వైరల్ (Viral Video) అవుతున్నాయి. కొన్ని వీడియోల్లో వధువరుల ఆశ్చర్యపోయే దృశ్యాలు, డ్యాన్సులు ఉంటే.. మరికొన్ని వాటిల్లో పొట్టచెక్కలయ్యే ఫన్నీ సన్నివేశాలుంటాయి. ఇవి వేలాది మంది నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. ఇక, ఇటీవలి కాలంలో పెళ్లి వేడుకలకు సంబంధించిన చాలా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్న సంగతి తెలిసిందే. జనాలు కూడా ఇలాంటి వీడియోలను ఇష్టపడటమే ఇందుకు కారణం. సోషల్ మీడియా ప్రభావమో మరో కారణమో కానీ.. ఈ మధ్య కాలంలో వింత పనులకు పెళ్లి మండపాలు వేదికవుతున్నాయి. తాళి కట్టే సమయంలో వధూవరులు చేసే పనులు వైరల్ అవుతున్నాయి. సరదా కోసం చేస్తున్నారో లేక పబ్లిసిటీ కోసమో తెలియదు కానీ, పెళ్లి కొడుకు లేదా పెళ్లి కూతురు చేసే పనులు అందరిని విస్మయానికి గురి చేస్తున్నాయి. దానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

    సాధారణంగా ఏ భార్య అయినా తన భర్త కేవలం తనకు మాత్రమే సొంతమనే భావనలో ఉంటుంది. పక్కవారి చూపు పడినా మాటలతో యుద్ధం చేస్తుంది. అలాంటి ఏకంగా తనముందే తన భర్తను కౌగిలించుకుంటే ఎలా ఉంటుంది. అందులోనూ పెళ్లైన తొలిరోజే, పెళ్లి వేదికపైనే ఇలా జరిగితే.. తీవ్రంగా మనస్థాపం చెందుతుంది కదూ.! తాజాగా ఇలాంటి ఓ వీడియోనే నెట్టింట వైరల్‌ అవుతోంది. అయితే చివర్లో ఆసక్తికర ట్విస్ట్‌ ప్రస్తుతం నవ్వులు పూయిస్తోంది.

    వివరాల్లోకి వెళితే.. వివాహం పూర్తి అయిన తర్వాత వధూవరులు ఇద్దరు స్టేజ్‌పై నిల్చున్నారు. కొత్త జంటను ఆశీర్వదించడానికి స్నేహితులు, బంధువులు ఒక్కొక్కరూ స్టేజ్‌పైకి వస్తూ అభినందనలు తెలియజేస్తున్నారు. ఇదే సమయంలో బురఖా ధరించిన ఓ మహిళ కూడా స్టేజ్‌పైకి ఎక్కింది.

    ముందుగా పెళ్లి కూతురికి షేక్‌ హ్యాండ్‌ ఇచ్చి. ఆ తర్వాత వరుడికి షేక్‌ హ్యాండ్‌ ఇచ్చింది. అయితే అంతటితో ఆగకుండా అతణ్ని గట్టిగా హత్తుకుంది. ఎంతకీ వదలకుండా అలాగే వాటేసుకుంది. దీంతో పెళ్లి కూతురు ఒక్కసారిగా షాక్‌కి గురైంది. ఏం జరుగుతుందో అర్థం కానీ ఆ అమ్మాయి తల పక్కకు తిప్పుకొని ధీనంగా మొహం పెట్టింది.



    అయితే ఇక్కడే అసలు ట్విస్ట్‌ జరిగింది. వరుడిని కౌగిలించుకున్న ఆ మహిళా.. నెమ్మదిగా బురఖాను తొలిగించింది. అప్పుడు కానీ తెలియదు ఆ వ్యక్తి మహిళ కాదని.. అబ్బాయి అని. వరుడి స్నేహితుడు అతడిని ఆటపట్టించడానికి అలా బురఖా రూపంలో వచ్చాడన్నమాట. ఈ సంఘటన చూసిన కొత్త పెళ్లి కూతురు ఒక్కసారిగా షాక్‌కి గురైంది.

    ఇది కూడా చదవండి : వారిద్దరు అమ్మాయిలు.. పైగా డాక్టర్స్.. చివరకు వాళ్లు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారో చూడండి..

    పెళ్లికి హాజరైన వారంతా నవ్వడంతో పెళ్లి వేదిక సందడిగా మారింది. దీనంతటినీ అక్కడే ఉన్న కొందరు స్నేహితుల వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు రకరాలుగా ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Marriage, Trending videos, Viral Video

    తదుపరి వార్తలు