IN A FUNNY MARRIAGE VIDEO GROOM EATING RASGULLA IN FRONT OF BRIDE SEE WHAT HAPPENED NEXT SRD
Viral Video : వీడేం వరుడండీ బాబూ.. పెళ్లికూతురుని పక్కన పెట్టుకుని ఇదేం పని..
Photo Credit : Instagram
Viral Video : సరదా కోసం చేస్తున్నారో లేక పబ్లిసిటీ కోసమో తెలియదు కానీ, పెళ్లి కొడుకు లేదా పెళ్లి కూతురు చేసే పనులు అందరిని విస్మయానికి గురి చేస్తున్నాయి. దానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
సోషల్ మీడియా (Social Media) ప్రపంచంలో నిత్యం ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతాయి. వైరల్ అయ్యే వీడియోల్లో పెళ్లికి సంబంధిచినవిచాలానే ఉంటాయి. ఇటీవల వెడ్డింగ్ వీడియోలు బాగా వైరల్ (Viral Video) అవుతున్నాయి. కొన్ని వీడియోల్లో వధువరుల ఆశ్చర్యపోయే దృశ్యాలు, డ్యాన్సులు ఉంటే.. మరికొన్ని వాటిల్లో పొట్టచెక్కలయ్యే ఫన్నీ సన్నివేశాలుంటాయి. ఇవి వేలాది మంది నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. ఇక, ఇటీవలి కాలంలో పెళ్లి వేడుకలకు సంబంధించిన చాలా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్న సంగతి తెలిసిందే. జనాలు కూడా ఇలాంటి వీడియోలను ఇష్టపడటమే ఇందుకు కారణం.
సోషల్ మీడియా ప్రభావమో మరో కారణమో కానీ.. ఈ మధ్య కాలంలో వింత పనులకు పెళ్లి మండపాలు వేదికవుతున్నాయి. తాళి కట్టే సమయంలో వధూవరులు చేసే పనులు వైరల్ అవుతున్నాయి. సరదా కోసం చేస్తున్నారో లేక పబ్లిసిటీ కోసమో తెలియదు కానీ, పెళ్లి కొడుకు లేదా పెళ్లి కూతురు చేసే పనులు అందరిని విస్మయానికి గురి చేస్తున్నాయి. దానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
సాధారణంగా పెళ్లి స్టేజీపైన లడ్డూ లాంటి భార్యను పక్కను పెట్టుకుని ఏ వరుడైనా ఏం చేస్తాడు. ఆమె వైపు శ్రద్దగా చూస్తాడు. లేకపోతే.. సైలెంట్ గా కూర్చుంటాడు. కానీ, ఓ వరుడు మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా.. వధువును పక్కన పెట్టుకుని రసగుల్లాల తెగ లాగించేశాడు.
అసలు పెళ్లి కూతురుని తింటావా అని మొహమాటానికి కూడా మనోడు అడగలేదు. ఒక దాని తర్వాత ఒకటి ఫటాఫట్ లాగించేశాడు. ఏం జరుగుతుందో అర్థం కానీ ఆ అమ్మాయి తల పక్కకు తిప్పుకొని ధీనంగా మొహం పెట్టింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
పెళ్లికి హాజరైన వారంతా పెళ్లి కొడుకు చేష్టలకు నవ్వడంతో పెళ్లి వేదిక సందడిగా మారింది. దీనంతటినీ అక్కడే ఉన్న కొందరు స్నేహితుల వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. ఇది చూసిన నెటిజన్లు రకరాలుగా ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. వరుడు బకాసురుడికి కజిన్ బ్రదర్ లా ఉన్నాడంటూ క్రేజీ కామెంట్లు పెడుతున్నరు. మరి కొందరు లడ్డూ లాంటి భార్యను పక్కన పెట్టుకుని.. వీడేం వరుడండీ బాబు అంటూ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.
Published by:Sridhar Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.