IMRAN KHANS PARTY PAKISTAN TEHREEK E INSAF LAWMAKERS ATTACKED 3 OTHERS FOR SWITCHING SIDES BEFORE THE SENATE ELECTIONS VIDEO GOES VIRAL SRD
Viral Video : WWE ఫైటర్లు కూడా ఈ నేతల ముందు దిగదుడుపే...పాక్ అసెంబ్లీలో రచ్చ రచ్చ..
Photo Credit : Twitter
Viral Video : కొందరు ప్రజాప్రతినిధులు తమ హోదాను మరిచి.. తాము ఎక్కడ ఉన్నాం.. ఏం చేస్తున్నామన్న ఇంగిత జ్ఞానం మరిచిపోయి ప్రవర్తిస్తున్నారు.. చట్టసభలో కూర్చొని ప్రజలకు అవసరమైన పనులపై చర్చించాల్సిన నేతలు బాహాబాహికి దిగుతున్నారు.
కొందరు ప్రజాప్రతినిధులు తమ హోదాను మరిచి.. తాము ఎక్కడ ఉన్నాం.. ఏం చేస్తున్నామన్న ఇంగిత జ్ఞానం మరిచిపోయి ప్రవర్తిస్తున్నారు.. చట్టసభలో కూర్చొని ప్రజలకు అవసరమైన పనులపై చర్చించాల్సిన నేతలు బాహాబాహికి దిగుతున్నారు. తాము ప్రజాసేవకులమని మర్చిపోయి రౌడీల్లాగా ప్రవరిస్తున్నారు. పాకిస్థాన్ లోని సింధ్ అసెంబ్లీలో రాజకీయ పార్టీల నేతలు బాహాబాహికి దిగారు. వీరు కోట్లాట చూస్తే WWE ఫైటర్లు కూడా సరితూగరు. ఇప్పుడు పాక్ నేతలు గొడవకు దిగిన వీడియో వైరలవుతోంది. వివరాల్లోకెళితే.. ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్థాన్ తెహ్రీక్-ఈ-ఇన్సాఫ్ కి చెందిన కొందరు నేతలు..ముగ్గురి రెబల్ అభ్యర్ధులపై చట్ట సభ సాక్షిగా విరుచుకుపడ్డారు. పిడిగుద్దులు కురిపించారు. సెనేట్ ఎన్నికలకు ముందు ముగ్గురు నేతలు.. వేరే పార్టీలోకి జంప్ అయ్యారు. దీంతో ఆ నేతలపై ఇమ్రాన్ ఖాన్ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సెనేట్ ఎన్నికల్లో ఆ రెబల్ నేతలు పీటీఐ పార్టీకి ఓట్లు వేయడానికి నిరాకరిచడమే ఇందుకు ముఖ్య కారణం. అలాగే, ఆ రెబల్ అభ్యర్థులు ఇమ్రాన్ సర్కార్ దిగిపోవాలంటూ నినాదాలు చేశారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఇమ్రాన్ ఖాన్ వర్గీయులు ఇలా గొడవకు దిగినట్లు స్థానిక నేత తెలిపారు.
ఇలాంటి కొట్లాటలు పాకిస్థాన్ చట్ట సభల్లో సర్వ సాధారణంగా మారిపోయాయ్. గత నెలలో కూడా ఇలానే చట్ట సభల సాక్షిగా నేతలు బాహాబాహికి దిగారు. ప్రస్తుతం సింధ్ అసెంబ్లీలో గొడవకు దిగిన నేతల వీడియో వైరలవుతోంది. దీనిపై పాకిస్థాన్ పౌరుల ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టాలు చేయాల్సిన నాయకులు ఇంతలా దిగజారడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు.
ఇక నిన్న జరిగిన సెనేట్ ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ పార్టీ 18 స్థానాల్ని కైవసం చేసుకుంది. అయితే, ముఖ్యమైన ఇస్లామాబాద్ సెనేట్ ను మాత్రం ప్రత్యర్థి పార్టీకి కోల్పోయింది.