Home /News /trending /

IMD FORECAST RAIN IN ANDHRA PRADESH AND TELANGANA HERE IS DETAILS MKS

rain alert : ఏపీ, తెలంగాణకు వర్ష సూచన.. రాబోయే 2 రోజుల్లో ఎక్కడ కురుస్తాయంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

చలికి వణుకుతోన్న తెలుగు ప్రజలకు మరో స్వీట్ షాక్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. రాబోయే రెండు రోజులపాటు రెండు రాష్ట్రాల్లో వానలు పడతాయని, కనిష్ట ఉష్ణోగ్రతలు ఇంకా తగ్గొచ్చని ఐఎండీ అంచనా వేసింది. పూర్తి వివరాలివి..

ఇంకా చదవండి ...
కనిష్ణ ఉష్ణోగ్రతలు పడిపోతూ చలికి వణుకుతోన్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు భారత వాతావరణ విభాగం తాజాగా మరో హెచ్చరిక జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. రాబోయే రెండు రోజులపాటు రెండు రాష్ట్రాల్లో వానలు పడతాయని, కనిష్ట ఉష్ణోగ్రతలు ఇంకా తగ్గొచ్చని ఐఎండీ అంచనా వేసింది. హైదరాబాద్ వాతావరణ విభాగం, అమరావతి వాతావరణ కేంద్రాలు విడివిడిగా చేసిన ప్రకటనలు ఇలా ఉన్నాయి..

ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాల్లో రాబోయే రెండు రోజుల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఉపరితల ద్రోణి నైరుతి రాజస్థాన్‌ పరిసర ప్రాంతాల నుంచి విదర్భ మీదుగా ఉత్తర తెలంగాణ వరకు సగటు సముద్ర మట్టానికి సుమారు 1.5 కిమీ ఎత్తు వరకు విస్తరించి ఉందని వెల్లడించారు. దీంతో కింది స్థాయి గాలులు ఆగ్నేయ దిశ నుంచి తెలంగాణ వైపు వీస్తున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో బుధ, గురువారాల్లో ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉందని, శుక్రవారం పొడి వాతావరణం ఉంటుందని చెప్పారు.

booster: 60 ఏళ్లు దాటి ఇతర వ్యాదులున్నా మెడికల్ సర్టిఫికేట్ లేకుండానే covid మూడో డోసు టీకా



ఇక ఆంధ్రాలో.. బంగాళాఖాతం మీదుగా కోస్తాపైకి వీస్తున్న తూర్పు గాలుల ప్రభావంతో మంగళవారం కోస్తా, రాయలసీమల్లో దట్టంగా మంచు కురిసింది. ఉదయం పది గంటల వరకు మంచు కురవడంతో వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తూర్పు గాలులు, మంచు ప్రభావంతో రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యాయి. ఆరోగ్యవరంలో 15.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న రెండు రోజుల్లో తూర్పుగాలులు మరింత బలపడే అవకాశముందని.. ఈ నెల 30 నుంచి మూడు రోజులపాటు దక్షిణ కోస్తా, రాయలసీమల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది.
Published by:Madhu Kota
First published:

Tags: Andhra Pradesh, IMD, Imd hyderabad, Rains, Telangana

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు