హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

సెక్స్ చేస్తే ముక్కు ఉపశమనంగా ఉంటుందని కనుక్కున్నారు.. నోబెల్ ప్రైజ్ కొట్టేశారు.. పూర్తి వివరాలివే..

సెక్స్ చేస్తే ముక్కు ఉపశమనంగా ఉంటుందని కనుక్కున్నారు.. నోబెల్ ప్రైజ్ కొట్టేశారు.. పూర్తి వివరాలివే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Ig Nobel Prizes: సైన్స్ (Science) అంటే క్లిష్టమైన విషయాలే కాకుండా కొన్ని సరదా(Funny) అంశాలు కూడా ఉంటాయి. అత్యద్భుతమైన, ప్రపంచానికి ఎంతో ఉపయోగపడే పరిశోధనలు చేసిన వారికి ప్రతిష్ఠాత్మకమైన నోబెల్ పురస్కారాలు(Noble Prizes) ఇస్తారు. వీటిని వచ్చే నెల ప్రకటించనున్నారు. అయితే ఇప్పటికే ఐజీ నోబెల్(Ig Nobel Prizes) బహుమతులను ప్రకటించారు.

ఇంకా చదవండి ...

సైన్స్ (Science) అంటే క్లిష్టమైన విషయాలే కాకుండా కొన్ని సరదా(Funny) అంశాలు కూడా ఉంటాయి. అత్యద్భుతమైన, ప్రపంచానికి ఎంతో ఉపయోగపడే పరిశోధనలు చేసిన వారికి ప్రతిష్ఠాత్మకమైన నోబెల్ పురస్కారాలు(Noble Prizes) ఇస్తారు. వీటిని వచ్చే నెల ప్రకటించనున్నారు. అయితే ఇప్పటికే ఐజీ నోబెల్(Ig Nobel Prizes) బహుమతులను ప్రకటించారు. అసలు ఈ ఐజీ నోబెల్ ప్రైజెస్ గురించి చాలామందికి తెలియదు. సైన్స్ పరంగా వింతైన, విచిత్రమైన, చాలా తేడాగా, సరదాగా ఉండే విషయాలపై పరిశోధనలు చేసి కొత్త విషయాలను కనిపెట్టిన వారికి ఇచ్చే పురస్కారాలే ఐజీ నోబెల్ ప్రైజెస్. ప్రపంచానికి మరీ అంత ఉపయోపగడకపోయినా వింతైన విషయాలు కనుగొనే పరిశోధకులకు ఈ బహుమతులు ఇస్తారు. ఈ పురస్కారాలు సాధించిన పరిశోధనలు చాలా వింతగా, తేడాగా అనిపిస్తాయి. మరి 2021కి గాను ఈ పురస్కారానికి ఎంపికైన కొన్ని పరిశోధనలు ఏవంటే..

స్నేహితుల పుట్టినరోజును గుర్తు చేసే అద్భుతమైన ఫీచర్​ వచ్చేసింది.. ఆండ్రాయిడ్​, ఐఓఎస్​ యూజర్లకు అందుబాటులోకి..


జర్మనీకి చెందిన ఓక్లే సెమ్ బులుట్ గ్రూప్ ఈసారి మెడిసిన్ విభాగంలో ఐజీ నోబెల్ పురస్కారం గెలుచుకుంది. ఆర్గాజంతో కూడిన సెక్స్ చేస్తే ముక్కు ఉపశమనంగా ఉంటుందని, బ్లాకింగ్ పోతుందని ఆ బృందం కనుగొందట. 18 జంటలపై ఈ పరిశోధన చేయగా.. సెక్స్ తర్వాతి 60 నిమిషాలు వారి శ్వాస చాలా మెరుగుపడిందని గుర్తించారట.

ప్రతీకాత్మక చిత్రం

ఇక శాంతి(పీస్) విభాగంలో ఐజీ నోబెల్ బహుమతి కూడా చాలా విచిత్రమైన పరిశోధనకే దక్కింది. గడ్డం కేవలం స్టైల్ కోసమే కాకుండా మనుషుల ముఖాలను కూడా కాపాడుతాయని నిరూపించిన వారికి ఈ అవార్డు దక్కింది. ఉథా ఇథాన్ బెసెరిస్ యూనివర్సిటీకి చెందిన స్టీవెన్ నెల్వే, డేవిడ్ కేరియ‌ర్‌కు ఈ బహుమతి దక్కింది. ఒకవేళ పూర్తి గడ్డం ఉంటే అస్తిపంజరాలు అయ్యాక కూడా దవడ ఎముకలు దృఢంగా ఉంటాయని ఆ బృందం చెప్పింది.

దేశ విదేశాల్లో తిరుగుతాడు.. వేరు వేరు సిటీల్లో ఒక భార్య.. 10 మంది భార్యలతో విలాసవంతమైన జీవితం.. చివరకు ఇలా..


ఇక ఖడ్గ మృగాలను తరలించేందుకు వింతైన పద్ధతిని చెప్పిన రాబిన్ రాడ్ క్లిఫేకు వైల్డ్ లైఫ్ లో అవార్డు దక్కింది. ఖడ్గ మృగాల కాళ్లకు తాడు కట్టి విమానానికి వేలాడ దీసి.. తలకిందులుగా రవాణా చేయడం ఉత్తమమని ఆయన పరిశోధన చేశాడు. పక్కన పక్కన ఉంచి వాటిని వేరే చోటికి తరలించడం కంటే ఇలా తలకిందులుగా విమానం సాయంతో తీసుకెళ్లడం బెస్ట్ అని చెప్పారు. అలాగే పిల్లుల భాషపై పరిశోధన చేసిన ది సీక్రెట్ లాంగ్వేజ్ ఆఫ్ క్యాట్స్ పుస్తకం రాసిన సుసానే సోల్జ్ కు బయాలజీ విభాగంలో ఐజీ నోబెల్ పురస్కారం దక్కింది. కాగా కరోనా ప్రభావం కారణంగా ఈసారి ఐజీ నోబెల్ ప్రైజెస్ కార్యక్రమాన్ని వర్చువల్ పద్ధతిలో నిర్వహించారు.

First published:

Tags: Germany, Trending news, USA

ఉత్తమ కథలు