స్మార్ట్ఫోన్లు వాడుతున్న వారికి ఎప్పుడూ ఓ భయం ఉంటుంది. చేతిలో నుంచి ఫోన్ జారిపోతే స్క్రీన్ పగిలిపోతుందని ఆందోళన చెందుతుంటారు. ఎందుకంటే ఫోన్లో స్క్రీన్ ఎంతో ఖరీదైన పార్ట్. బద్దలైతే రిపేర్ చేయించుకునేందుకు చాలా ఖర్చవుతుంది. అయితే దీనికి ఓ అద్భుతమైన పరిష్కారం అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీని ద్వారా బద్దలైన స్క్రీన్ రిపేర్ ఒక్క సెకనులోనే పూర్తవుతుంది. ఆ దిశగా ఓ ట్రాన్స్‌ప్రంట్ మెటీరియన్‌ను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ ఎడ్యుకేషన్, రీసర్చ్ (ఐఐఎస్ఈఆర్), కోల్‌కతా పరిశోధకులు కనుగొన్నారు. ట్రాన్స్‌ప్రంట్ మెటీరియల్ ద్వారా ఫోన్ స్క్రీన్ ఆటోమేటిక్‌గా సరిచేసుకునేలా దీన్ని సృష్టించారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) ఖరగ్‌పూర్‌తో కలిసి ఐఐఎస్ఈఆర్ పరిశోధకులు.. సంప్రదాయ సెల్ఫ్ హీలింగ్ మెటీరియల్‌కు విభిన్నంగా ఇంకా హార్డ్‌గా ఉండేలా తయారు చేయాలని నిశ్చయించారు. ఇందులో భాగంగానే ప్రపంచంలోనే అత్యంత దృఢంగా ఉండే సెల్ఫ్ హీలింగ్ మెటీరియల్‌ను సృష్టించారని టెలీగ్రాఫ్ ఇండియా పేర్కొంది. దీని ద్వారానే మొబైల్ ఫోన్ స్క్రీన్లతో పాటు అనేక వస్తువులను సెకన్ల వ్యవధిలోనే సరిచేసే అవకాశం ఉంటుంది.
మెకానికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా మార్చే పీజోఎలక్ట్రిక్ ఆర్గానిక్ మెటీరియల్‌ను పరిశోధకులు వినియోగించారు. దీని ద్వారా 2 మిల్లీ మీటర్ల పొడువు, 0.2 మిల్లీ మీటర్ల మందం మించకుండా నీడిల్ షేప్‌లో ఉండే క్రిస్టల్స్‌ను తయారు చేశారు. ఈ క్రిస్టల్స్‌ను వేయగానే రెండు ఉపరితలాల మధ్య ఫోర్స్ డెవలప్ అయి అతుక్కుపోతాయి. ఇలా ఒక్కసారి క్రిస్టల్స్‌ను వేస్తే పగిలిన ప్రతీసారి వాటంతటికవే స్క్రీన్‌ను రిపేర్ చేసేస్తాయి. ఇందుకోసం ప్రత్యేకంగా బయటి నుంచి వేడి అవసరం ఉండదు. “మిగిలిన సెల్ఫ్ హీలింగ్ మెటీరియల్స్ కంటే మేం తయారు చేసేంది 10 రెట్లు దృఢంగా ఉంటుంది. అలాగే అంతర్గతంగా క్రిస్టలైన్ నిర్మాణంలో ఉంటుంది. ముఖ్యంగా ఇది ఎలక్ట్రానిక్స్, ఆప్టికల్ అప్లికేషన్స్‌కు ఎక్కువగా ఉపయోగపడుతుంది” అని పరిశోధనకు నేతృత్వం వహించిన ప్రొఫెసర్ చిల్ల మల్లారెడ్డి చెప్పారు. ఇలాంటి మెటీరియల్ ఫోన్స్క్రీన్లకు ఎంతో ఉపయోగపడుతుందని, ఒకవేళ కిందపడి పగుళ్లు వస్తే రిపేర్ చేసేందుకు వినియోగించవచ్చని టీమ్ సభ్యులు పేర్కొన్నారు.
అయితే ఈ మెటీరియల్ ఇప్పట్లో కమర్షియల్‌గా అందుబాటులోకి వచ్చేలా కనిపించడం లేదు. ఇది పూర్తిస్థాయిలో ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే దానిపై స్పష్టత లేదు. అయితే, స్వయంగా రిపేర్ చేసుకునేలా వస్తువులను తయారు చేసేందుకు శాస్త్రవేత్తలు దశాబ్దాలుగా కృషి చేస్తున్నారు. కొన్ని అందుబాటులోకి కూడా వచ్చాయి. అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు చిన్నగా ఉండే స్విమ్మింగ్‌పూల్ రొబోట్స్ను తయారు చేశారు. ఏదైనా సమస్య వస్తే తామంతట అవే రిపేర్ చేసేసుకుంటాయి.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.