భూతాపాన్ని అంచనా వేయడానికి మంచుపలకల సాయం

వాతావరణ మార్పులు, మంచు కరిగిపోవడం, సముద్ర మట్టం పెరగడం వంటివి భూతాపం పెరగడానికి కారణాలని గుర్తించిన శాస్త్రవేత్తలు, వీటి గురించి ఎప్పటికప్పుడూ ప్రపంచాన్ని అప్రమత్తం చేస్తూనే ఉన్నారు.

news18-telugu
Updated: September 18, 2020, 6:31 PM IST
భూతాపాన్ని అంచనా వేయడానికి మంచుపలకల సాయం
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
వాతావరణ మార్పులు, మంచు కరిగిపోవడం, సముద్ర మట్టం పెరగడం వంటివి భూతాపం పెరగడానికి కారణాలని గుర్తించిన శాస్త్రవేత్తలు, వీటి గురించి ఎప్పటికప్పుడూ ప్రపంచాన్ని అప్రమత్తం చేస్తూనే ఉన్నారు. వాతావరణ మార్పు ప్రభావాన్ని అంచనా వేయడానికి వారు ఉపయోగింస్తున్న నమూనాలలో అసమానతలు ఉన్నాయని నిపుణులు గుర్తించారు. అందుకే ఇప్పుడు వాటిని సరికొత్తగా అంచనా వేస్తున్నారు. ఇందుకోసం ఐస్-షీట్ మోడల్ను ప్రామాణికంగా తీసుకోనున్నారు.

గ్రీన్‌లాండ్, అంటార్కిటిక్ ల వద్ద ఉన్న మంచుకొండలు భవిష్యత్తులో ఎలాంటి ప్రభావాలకు గురయ్యే అవకాశం ఉందో తెలుసుకోవడానికి ఐస్-షీట్ నమూనాలు ఉపయోగపడతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇప్పటివరకు ఉపయోగించిన ఐస్-షీట్ మోడల్ ప్రయోగాల గురించి ఆన్లైన్ జర్నల్ క్రియోస్పియర్‌లో ఒక కథనం ప్రచురించనున్నారు. గ్రీన్‌హౌస్ ఉద్గారాలు ఇప్పటిలానే కొనసాగితే గ్రీన్‌లాండ్ వద్ద ఉన్న మంచు కరిగి, ప్రపంచవ్యాప్తంగా సముద్రమట్టాలు తొమ్మిది సెంటీమీటర్ల మేర పెరుగుతాయని ఐస్ షీట్ మోడల్ ద్వారా అంచనా వేస్తున్నారు. అంటార్కిటికా ఐస్ షీట్ నమూనాలతో చేసిన ప్రయోగాల ఫలితాలు మాత్రం వివాదాస్పదంగా మారాయి.

వివాదం ఎందుకు?
అనేక పారిశ్రామిక, శాస్త్రీయ రంగాలలో కంప్యూటర్ ద్వారా చేసే ప్రయోగాలనే(కంప్యూటర్ సిమ్యులేషన్) ప్రామాణికంగా తీసుకుంటున్నారు. మెకానికల్ ఇంజనీర్లు, ఇతర మెకానిక్ రంగాలు కూడా ఇలాంటి నమూనాలే అనుసరిస్తాయి. కానీ ఐస్ షీట్ మోడళ్లకు మాత్రం ఇది సవాలుగా మారింది. ఇందుకు రెండు కారణాలు ఉన్నాయి.
1. ప్రయోగాలకు ఎలాంటి ఐస్ షీట్లను ఉపయోగించాలనేది పెద్ద సమస్యగా మారింది. ఎందుకంటే ఫలితాలను అంచనా వేయడానికి ప్రామాణికంగా తీసుకున్న ఐస్ షీట్‌ను ప్రయోగశాలలో సహజంగా సృష్టించలేం. ఇది తుది ఫలితాలపై ప్రభావం చూపిస్తుంది.
2. ప్రయోగానికి కావాల్సిన కీ- ప్యారామీటర్లు కచ్చితంగా తెలియకపోవడం మరో కారణం. గ్రీన్లాండ్, అంటార్కిటికాల గురించి, అక్కడి మంచు కొండల కదలికల గురించి తెలియాల్సింది ఇంకా చాలా ఉంది.

శాస్త్రవేత్తలు ఏమంటున్నారు?

ఐస్ షీట్ మోడల్ ప్రయోగాల్లో తలెత్తిన సమస్యలపై సందేహాలను నివృత్తి చేసుకోవడానికి కచ్చితమైన సమాచారం ఇంకా అందుబాటులోకి రాలేదు. దీంతో వారు ఇతర పరిశోధకుల నమూనాలతో పోల్చి చూసి ఫలితాలను విశ్లేషించుకుంటున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆరేళ్ల క్రితం ఒక సహకార ప్రాజెక్టును శాస్త్రవేత్తలు ప్రారంభించారు. 36 సంస్థల పరిశోధకులు వివిధ రకాల గ్రీన్‌లాండ్, అంటార్కిటిక్ ఐస్-షీట్ నమూనాలను ఒకదానితో ఒకటి పోల్చారు. రాబోయే వందేళ్లలో ప్రపంచవ్యాప్తంగా సముద్ర మట్టాలు ఎలా పెరగనున్నాయో అంచనా వేయడానికి రెండు వేర్వేరు క్లైమేట్ సినారియోలు తీసుకున్నారు.

-2015 నుంచి 2100 వరకు వాతావరణం, సముద్ర మార్పులకు అవసరమైన డేటాను ఈ మోడళ్లు అందిస్తున్నాయి. కపుల్డ్ మోడల్ ఇంటర్కంపారిసన్ ప్రాజెక్ట్ ఫేజ్-5 (సిఎమ్ఐపి-5) వాతావరణ నమూనాల్లో ఈ డేటాను తిరిగి పొందుపరిచారు.
-ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్-5 సదస్సుకు రిపోర్టు అందించేందుకు ఐస్ షీట్ మోడళ్లు ఉపయోగపడనున్నాయి. ఇంతకుముందు శాస్త్రవేత్తలు తీసుకున్న నమూనాలు ప్రపంచ సముద్ర మట్టం పెరగడానికి గ్రీన్లాండ్ మంచు కరగడం ఎంతవరకు కారణమైందో తెలుసుకోలేకపోయాయని సై-టెక్ డైలీ పేర్కొంది.
Published by: Sumanth Kanukula
First published: September 18, 2020, 6:31 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading