Home /News /trending /

ICE FORMS ON SHIVLING AT NASHIKS TRIMBAKESHWAR TEMPLE PEOPLE CALL IT MIRACLE VIDEO VIRAL PAH

నాసిక్ త్రయంబకేశ్వరాలయంలో అద్భుతం.. శివ లింగం చుట్టు ఏర్పడిన మంచు.. వీడియో వైరల్..

ఆలయంలో శివలింగం చుట్టు మంచు

ఆలయంలో శివలింగం చుట్టు మంచు

Maharashtra: మహా రాష్ట్రలోని నాసిక్ త్రయంబకేశ్వరాయంలో అద్బుత ఘటన జరిగింది. శివలింగం చుట్టు మంచు వ్యాపించింది. దీంతో ప్రస్తుతం ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

కొన్ని సార్లు ఆలయాలలో అధ్బుతమైన ఘటనలు జరుగుతుంటాయి. విగ్రహలు పాలు తాగటం, దేవతా విగ్రహాలు జరగబోతున్నదానికి ఏదో చెప్తున్నట్లుగా సూచించడం వంటి ఘటనలు జరుగుతుంటాయి. ఈ కోవకు చెందిన ఘటన వార్తలలో నిలిచింది. నాసిక్ లోని (nashik) ఆలయంలో అద్భుత ఘటన జరిగింది. ప్రతిరోజు పూజలో భాగంగా పూజారులు పూజ చేయటానికి  ఆలయంలో  వెళ్లారు. పిండం చుట్టు తెల్లగా ఉండటాన్ని గమనించారు. ఆ తర్వాత.. అక్కడ తాకి చూశారు. శివలింగం గట్టిగా ఏర్పడి ఉంది.

గర్భగుడిలోని ఆలయంలో లింగం చుట్టు మంచు వ్యాపించింది. దీంతో భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకుంటున్నారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. పూజారులు దీన్ని అద్భుతంగా అభివర్ణిస్తున్నారు. పూజారీ శివలింగం చుట్టు పువ్వులు పెట్టి అలంకరించారు.





ఆలయ పూజారులు.. శివలింగం (Trimbakeshwar Temple) పక్కన కూర్చుని ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. భారత్, చైనా యుధ్దం తర్వాత.. గతంలో..1962లో ఇలాగే నాసిక్ లో.. శివలింగం చుట్టు మంచు వ్యాపించిందని కథలుగా చెప్పుకుంటారు. ప్రస్తుతం మరోసారి మంచులాగా మారింది. అయితే, అస్సాంలో వరదలు నేపథ్యంలో.. ఇప్పుడు మరోసారి శివలింగం చుట్టు మంచు వ్యాపించినట్లు భావిస్తున్నారు.  ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట (Social media)  వైరల్ గా (viral video)  మారింది.

ఇదిలా ఉండగా అమెరికాలోని (america) సౌత్ కరోలినా లోని మిర్టిల్ బీచ్ సఫారీలో చింపాంజీ, మూడు పులి పిల్లలను ప్రేమగా లాలిస్తుంది.

అచ్చం అవి తమ తల్లి వద్ద ఉన్నట్లు వాటితో గడుపుతున్నాయి. చింపాంజీ (Orangutan) కూడా పులి పిల్లలకు పాలు తాగిస్తు.. వాటిని తన చేతుల్లో ఎత్తుకుంది. ఆ తర్వాత.. దాన్ని ప్రేమగా నిమురుతూ.. కౌగిలించుకుంటూ.. భావోద్వేగానికి లోనైంది.

ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తుంది. దీన్ని చూసిన నెటిజన్లు ఎమోషన్ కు (Emotional   Video)  గురౌతున్నారు. మిర్టిల్ బీచ్ సఫారీలో చింపాంజీ, మూడు పులి పిల్లలకు (Tiger cubs) సర్రోగేట్ మదర్ గా మారినట్లు తెలుస్తోంది.  కాగా, ఈ వీడియోను.. ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ అధికారి సమ్రాట్ గౌడ తన ఇన్ స్టాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఇది ట్రెండింగ్ మారింది.
Published by:Paresh Inamdar
First published:

Tags: Maharashtra, Viral Video

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు