హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Aeroplane Accident: ఆకాశంలో ఎగురుతున్న విమానం విండ్‌స్క్రీన్‌కు బీటలు.. తర్వాత ఏం జరిగిందో తెలిస్తే షాకవుతారు..

Aeroplane Accident: ఆకాశంలో ఎగురుతున్న విమానం విండ్‌స్క్రీన్‌కు బీటలు.. తర్వాత ఏం జరిగిందో తెలిస్తే షాకవుతారు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

సాధారణంగా చిన్న ప్రమాదం జరిగితేనే విమానాలు కుప్ప కూలిపోతుంటాయి. గాల్లో చోటుచేసుకున్న ప్రమాదాల వల్ల ఇప్పటికే ఎంతోమంది ప్రయాణికులు చనిపోయారు. అయితే తాజాగా 200 మంది ప్రయాణికులతో 35 వేల అడుగుల ఎత్తులో వేగంగా దూసుకెళ్తున్న ఓ విమానం ఘోర ప్రమాదానికి గురైంది.

ఇంకా చదవండి ...

సాధారణంగా చిన్న ప్రమాదం(Small Accident) జరిగితేనే విమానాలు(Flights) కుప్ప కూలిపోతుంటాయి. గాల్లో చోటుచేసుకున్న ప్రమాదాల వల్ల ఇప్పటికే ఎంతోమంది ప్రయాణికులు చనిపోయారు. అయితే తాజాగా 200 మంది ప్రయాణికులతో 35 వేల అడుగుల ఎత్తులో వేగంగా దూసుకెళ్తున్న ఓ విమానం ఘోర ప్రమాదానికి గురైంది. ఈ విమానం విండ్‌స్క్రీన్‌పై(Wing Screen) వెయ్యి అడుగుల ఎత్తు నుంచి ఒక పెద్ద మంచు ముద్ద దబ్ మని పడింది. ఆ ఫోర్స్‌కు ఒక్కసారిగా విండ్‌స్క్రీన్‌ బీటలు వారింది. అదృష్టం కొద్దీ ఆ ఫ్రంట్ గ్లాస్ పగిలిపోలేదు. దీనితో పెను ప్రమాదం తృటిలో తప్పింది. భీతిగొల్పే ఈ సంఘటన బ్రిటీష్ ఎయిర్‌వేస్‌ బోయింగ్ 777(British airways boing) విమానం లండన్‌లోని(Lundon) గాట్విక్ నుంచి కోస్టారికాలోని శాన్ జోస్‌‌కి ప్రయాణిస్తున్నప్పుడు జరిగింది. ఇక, వివరాల్లోకి వెళితే..

Jet airways: కొత్త ఏడాదిలో మళ్లీ ఎగరనున్న జెట్​ విమానాలు...విమానయాన పరిశ్రమకు మంచి రోజులు వచ్చాయా...


డిసెంబర్ 22న బ్రిటీష్ ఎయిర్‌వేస్‌కు చెందిన బోయింగ్ 777 విమానంలో 200 మంది ప్రయాణికులు ఎక్కారు. ఇది లండన్‌లోని గాట్విక్ నుంచి కోస్టారికాలోని శాన్ జోస్‌‌ డిసెంబర్ 23 సాయంత్రంలోగా చేరుకోవాల్సి ఉంది. అలాగే డిసెంబర్ 25 సాయంత్రంలోగా మళ్లీ లండన్‌కు వెళ్లాల్సి ఉంది. ప్రయాణికుల్లో చాలామంది క్రిస్మస్ రోజున తమ బంధుమిత్రులను కలుసుకోవాలనే సంతోషంతో మునిగితేలుతున్నారు. అయితే విమాన ప్రయాణం సాఫీగా జరుగుతుందన్న క్రమంలోనే ఒక భయంకరమైన సంఘటన జరిగింది.

ఆకాశంలో విహరిస్తున్న విమానంపై ఏదో పడినట్లు హఠాత్తుగా భారీ శబ్దం వినిపించింది. ఈ పరిణామంతో ప్రయాణికులంతా ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. 35 వేల అడుగుల ఎత్తులో ఎగురుతున్న ఈ బ్రిటిష్ విమానంపై ఒక మంచు ముద్ద పడటంతో ఇలా శబ్దం వచ్చింది. ఈ మంచు ముద్ద 36 వేల అడుగుల ఎత్తులో అంటే బోయింగ్ 777 కంటే వెయ్యి అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న మరొక విమానంపై నుంచి జారి పడింది. దీనితో రెండు అడుగుల మందం గల బోయింగ్ 777 విండ్‌స్క్రీన్‌పై బీటలు ఏర్పడ్డాయి.

50 గంటలు ఆలస్యంగా బయలుదేరినవిమానం..

మామూలుగా అన్ని విమానాల విండ్‌స్క్రీన్‌లు బుల్లెట్‌ప్రూఫ్ గ్లాస్‌లాగా గట్టిగా ఉంటాయి. అవి ఎత్తైన ప్రదేశాలలో విపరీతమైన శక్తిని తట్టుకోగలవు. కానీ తాజాగా జరిగిన సంఘటనలో అలా జరగలేదు. మంచు ముద్ద ఫోర్స్‌కు విండ్‌స్క్రీన్‌ ఘోరంగా దెబ్బతిన్నది. ఈ ఘటనలో పైలట్లతో సహా అందరూ భయాందోళనకు గురయ్యారు. అయితే పైలట్లు సమీపంలోని ఒక విమానాశ్రయంలో విమానాన్ని సురక్షితంగా ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. 90 నిమిషాల్లో మళ్లీ విమానాన్ని టేకాఫ్ చేస్తామని బ్రిటిష్ ఎయిర్‌లైన్స్ ప్రయాణికులకు హామీ ఇచ్చింది.

Wedding Insurance: పెళ్లి అకస్మాత్తుగా ఆగిపోయిందా..? దిగులు అవసరం లేదు.. మీ డబ్బు మీ వెంటే ఉంటుంది..


కానీ దెబ్బతిన్న విమానం మరమ్మతు పనుల కారణంగా వెంటనే టేకాఫ్ కాలేదు. ఇది ప్రయాణీకుల అసలు షెడ్యూల్ సమయానికి 50 గంటల ఆలస్యంగా బయలుదేరింది. దాంతో క్రిస్మస్ పండుగ ప్లాన్ అంతా నాశనం కావడంతో ప్రయాణికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నిజానికి డిసెంబర్ 25న ఒక ఫ్లైట్ రెడీ చేశారు కానీ 200 మంది ప్రయాణికుల్లో సగం మంది కూడా ఎక్కలేదు. దీంతో ఈ ఫ్లైట్ ను క్యాన్సిల్ చేశారు. ఏదేమైనప్పటికీ ఈ ప్రమాదం నుంచి ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు. ఈ సంఘటన తర్వాత, బ్రిటిష్ ఎయిర్‌వేస్ ప్రయాణీకులకు క్షమాపణలు చెప్పింది.

“అనుకోని సంఘటన వల్ల మేం ప్రయాణికుల క్రిస్మస్ ప్లాన్‌లను చెడగొట్టాం. ఇందుకు హృదయపూర్వకంగా క్షమాపణలు. విమానం సురక్షితమైన ప్రయాణానికి రెడీ అయిందని నిర్ధారించుకున్న తర్వాతే మేం ప్రయాణాలను ప్రారంభించడం. అందుకే ఈ ఆలస్యం జరిగింది. విమానాన్ని సక్రమంగా రిపేర్ చేసినందుకు మా ఇంజనీర్లు కాస్త ఎక్కువ సమయం తీసుకున్నారు" అని బ్రిటిష్ ఎయిర్‌వేస్ ప్రతినిధి చెప్పారు.

First published:

Tags: Accident, Flight

ఉత్తమ కథలు