ICC World Cup 2019: సచిన్, సెహ్వాగ్‌తో స్పెషల్ ఫోటో...షేర్ చేసిన కోహ్లీ

ICC World Cup 2019: సచిన్ టెండుల్కర్, వీరేంద్ర సెహ్వాగ్‌తో తీసుకున్న స్పెషల్ ఫోటోను టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సోషల్ మీడియాలో షేర్ చేశారు.

news18-telugu
Updated: June 12, 2019, 10:55 AM IST
ICC World Cup 2019: సచిన్, సెహ్వాగ్‌తో స్పెషల్ ఫోటో...షేర్ చేసిన కోహ్లీ
విరాట్ కోహ్లీ (ఫైల్ ఫోటో)
news18-telugu
Updated: June 12, 2019, 10:55 AM IST
వరల్డ్ కప్‌లో వరుసగా రెండు మ్యాచ్‌లను నెగ్గిన టీమిండియాలో కొత్త జోష్ కనిపిస్తోంది. వరల్డ్ కప్‌లో హాట్ ఫేవరెట్లుగా ఉన్న దక్షిణాఫిక్రా, ఆస్ట్రేలియాలను ఓడించిన టీమిండియా...టైటిల్‌ రేసులో తాము అందరికంటే ముందున్నట్లు చాటుకుంది. ఇంతలోనే గాయం కారణంగా శిఖర్ థావన్ జట్టుకు దూరంకావడం టీమిండియాను నిరుత్సాహానికి గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఓ స్పెషల్ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ స్పెషల్ ఫోటోలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్, వీరేంద్ర సెహ్వాగ్‌తో కలిసి విరాట్ కోహ్లీ ఉన్నారు. కోహ్లీ ఏదో చెబుతుండగా సచిన్, సెహ్వాగ్ ఆసక్తిగా వింటున్న ఫోటో ఇది. ఆదివారం ఆస్ట్రేలియా మ్యాచ్‌కు ముందుగా సచిన్, సెహ్వాగ్‌తో కోహ్లీ ముచ్చుటిస్తుండగా తీసిన ఫోటో ఇది. వరల్డ్ కప్‌లో సచిన్, సెహ్వాగ్ కమెంటేటర్లుగా వ్యవహరిస్తుండడం తెలిసిందే.



 




Loading...

Instagramలోని ఈ పోస్ట్‌ని వీక్షించండి




 

Some pictures indeed are special. 😃😇@virendersehwag @sachintendulkar


Virat Kohli (@virat.kohli) ద్వారా పోస్ట్ భాగస్వామ్య చేయబడింది





వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా మరో బలమైన న్యూజిలాండ్ జట్టుతో కోహ్లీ సేన గురువారం తలపడనుంది. ఇప్పటి వరకు జరిగిన మూడు మ్యాచ్‌లలోనూ న్యూజిలాండ్ విజయం సాధించింది.
First published: June 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...