• Home
  • »
  • News
  • »
  • trending
  • »
  • ICC WORLD CUP 2019 KAPIL DEV PICKS HIS SURPRISE PACKAGE FOR THE TOURNAMENT

ICC World Cup 2019: ఫేవరెట్ జట్లు ఏవో చెప్పిన కపిల్ దేవ్

కపిల్ దేవ్ (ఫైల్ ఫోటో)

ICC World Cup: క్రికెట్ వరల్డ్ కప్‌లో భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా సెమీస్‌కు చేరుకుంటాయని అంచనావేసిన కపిల్ దేవ్...నాలుగో స్థానం కోసం పాకిస్థాన్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా మధ్య పోటీ నెలకొంటున్నట్లు అభిప్రాయపడ్డారు.

  • Share this:
    ఈ నెలాఖరులో ప్రారంభంకానున్న ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్‌లో హాట్ ఫేవరెట్ జట్లు ఏవో భారత మాజీ కెప్టెన్, దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ అంచనావేశారు. 1983లో క్రికెట్ వరల్డ్ కప్ సాధించిన భారత జట్టుకు సారథ్యంవహించిన కపిల్ దేవ్‌...క్రికెట్ వరల్డ్ కప్‌ను గెలుచుకునే సత్తా కోహ్లీ సేనకి ఉందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం భారత జట్టులో యువరక్తంతో పాటు అనుభవం సమపాళ్లలో ఉన్నాయని కితాబిచ్చారు. అయితే జట్టు కూర్పుతో పాటు అవసరమైన సమయంలో ఆటగాళ్లు రాణించడం చాలా ముఖ్యమని వ్యాఖ్యానించారు.

    భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్లు సెమీ ఫైనల్స్‌లో చోటు సాధించే అవకాశముందని కపిల్ దేవ్ అంచనావేశారు. సెమీస్‌లో బెర్త్ సాధించే నాలుగో జట్టు న్యూజిలాండ్, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా జట్లలో ఏదో ఒకటి కావచ్చని అభిప్రాయపడ్డారు. వరల్డ్ కప్ టోర్నీలో న్యూజిలాండ్ లేదా వెస్టిండీస్ సంచలనాలు సృష్టించే అవకాశమున్న జట్లుగా చెప్పారు.

    హార్దిక్ పాండ్యా జట్టులో ఉండడం భారత్‌కు కలిసివచ్చే అంశమన్న కపిల్...పాండ్యాను ఎక్కువ ఒత్తిడికి గురిచేయకుంటే మంచి ఫలితాలు వస్తాయన్నారు. యువ ఆటగాడైన పాండ్యాను అతని సహజశైలిలో ఆడనివ్వాలని సూచించారు. ఇంగ్లండ్ గడ్డ ఫేస్‌కు అనుకూలంగా ఉంటుందన్న కపిల్ దేవ్...బుమ్రా, షమి వరల్డ్ కప్‌లో కీలక పాత్ర పోషిస్తారని ధీమా వ్యక్తంచేశారు.
    First published: