World Cup 2019: సెమీస్‌లో అందుకే ఓడాం...రోహిత్ శర్మ ఆవేదన

ICC Cricket World Cup 2019 | కీలకమైన సమయంలో జట్టుగా విఫలంకావడమే సెమీస్‌లో భారత జట్టు ఓటమికి కారణమని భారత ఓపనర్ రోహిత్ శర్మ ఆవేదన వ్యక్తంచేశాడు.

news18-telugu
Updated: July 12, 2019, 10:32 AM IST
World Cup 2019: సెమీస్‌లో అందుకే ఓడాం...రోహిత్ శర్మ ఆవేదన
రోహిత్ శర్మ (File)
news18-telugu
Updated: July 12, 2019, 10:32 AM IST
వరల్డ్ కప్ సెమీస్‌లో భారత జట్టు ఓటమి చెందడంపై భారత ఓపనర్ రోహిత్ శర్మ స్పందించాడు. సెమీస్‌లో భారత జట్టు 18 పరుగుల తేడాతో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించడం తెలిసిందే.  కీలకమైన సమయంలో జట్టుగా విఫలం చెందినందునే సెమీస్‌లో ఓడిపోయామని పేర్కొన్నాడు. 30 నిమిషాల చెత్త ఆట కారణంగా...ప్రపంచకప్‌ను గెలుచుకునే అవకాశాన్ని చేజార్చుకున్నామని అన్నాడు. మీకులాగానే తనకు కూడా గుండె భారమైయ్యిందని ఆవేదన వ్యక్తంచేశాడు.

దేశానికి బయట ఆడుతున్న తమకు అభిమానుల నుంచి వచ్చిన మద్దతు వెలకట్టలేనిదని వ్యాఖ్యానించాడు. యూకేలో టీమిండియా ఎక్కడ ఆడినా భారీ సంఖ్యలో తరలివచ్చి మద్దతు తెలిపిన అభిమానులందరికీ ధన్యవాదులు తెలియజేసుకుంటున్నట్లు రోహిత్ శర్మ ట్వీట్ చేశాడు.



First published: July 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...