ICC Cricket World Cup 2019: ఫైనల్ మ్యాచ్ ఆ జట్ల మధ్యే...సుందర్ పిచాయ్ జోస్యం

ICC Cricket World Cup 2019 | క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్లో భారత్-ఇంగ్లండ్ తలపడే అవకాశాలున్నాయని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ జోస్యం చెప్పారు.

news18-telugu
Updated: June 13, 2019, 2:35 PM IST
ICC Cricket World Cup 2019: ఫైనల్ మ్యాచ్ ఆ జట్ల మధ్యే...సుందర్ పిచాయ్ జోస్యం
గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్(ఫైల్ ఫోటో)
news18-telugu
Updated: June 13, 2019, 2:35 PM IST
క్రికెట్ వరల్డ్ కప్ ఫీవర్ తారస్థాయికి చేరింది. వరల్డ్ కప్ ఏ దేశం గెలుచుకునే అవకాశముందన్న అంశంపై పలువురు సెలబ్రిటీలు తమ అభిప్రాయాన్ని వ్యక్తంచేస్తున్నారు. ప్రవాసభారతీయుడైన గూగుల్ సీఈవీ సుందర్ పిచాయ్ కూడా ఈ విషయంలో తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. కాలిఫోర్నియాలో జరిగన ఓ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన ఆయన...వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లండ్-భారత్ తలపడే అవకాశముందని అభిప్రాయపడ్డారు. అయితే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, మరికొన్ని జట్లు కూడా పటిష్టంగానే ఉన్నాయన్నారు. భారత జట్టు వరల్డ్ కప్ గెలుచుకోవాలని కోరుకుంటున్నట్లు 46 ఏళ్ల సుందర్ పిచాయ్ వ్యాఖ్యానించారు.

చిన్నతనం నుంచే తనకు క్రికెట్ పట్ల ఆసక్తి ఉండేదని గుర్తుచేసుకున్న సుందర్ పిచాయ్...అమెరికాకు వెళ్లిన తొలినాళ్లలో బేస్ బాల్ నేర్చుకునేందుకు ప్రయత్నించినట్లు తెలిపారు. అయితే బేస్ బాల్ తనకు కష్టంగా అనిపించిందని చెప్పుకొచ్చారు. క్రికెట్‌లో బంతిని కొట్టిన తర్వాత బ్యాట్‌ను తీసుకుని పరిగొత్తుతామని, అయితే బేస్‌ బాల్‌ దీనికి విరుద్ధమన్నారు. బేస్ బాల్ నేర్చుకునే తొలినాళ్లలో ఈ కారణంగా తాను ఇబ్బందిపడినట్లు సుందర్ పిచాయ్ వివరించారు.

First published: June 13, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...