విడాకులకు దరఖాస్తు చేసిన ఐఏఎస్ టాపర్స్ జంట.. ఇప్పుడిదే హాట్ టాపిక్

వారిద్దరు ఐఏఎస్ టాపర్లు. ట్రైనింగ్ సమయంలో చిగురించిన ప్రేమ వారిద్దరిని ఒకటి చేసింది. అయితే పెళ్లి చేసుకున్నా రెండు ఏళ్లకే వారిద్దరు విడాకులు తీసుకునేందుకు సిద్ధమయ్యారు.

news18-telugu
Updated: November 21, 2020, 9:04 PM IST
విడాకులకు దరఖాస్తు చేసిన ఐఏఎస్ టాపర్స్ జంట.. ఇప్పుడిదే హాట్ టాపిక్
(Photo-Instagram/dabi_tina)
  • Share this:
వారిద్దరు ఐఏఎస్ టాపర్లు. ట్రైనింగ్ సమయంలో చిగురించిన ప్రేమ వారిద్దరిని ఒకటి చేసింది. అయితే పెళ్లి చేసుకున్నా రెండు ఏళ్లకే వారిద్దరు విడాకులు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. వివరాలు.. 2015 యూపీఎస్సీ పరీక్షల్లో టీనా దాబీ టాపర్‌గా నిలిచారు. అదే ఏడాది జరిగిన సివిల్స్ పర్లీక్షల్లో అథర్ అమీర్ ఖాన్ రెండో ర్యాంక్ సాధించారు. టీనాది రాజస్తాన్ కాగా, అథర్ అమీర్‌ది జమ్మూ కశ్మీర్‌కు చెందినవారు. అయితే వీరిద్దరు కూడా రాజస్తాన్ క్యాడర్ ఐఏఎస్‌లు. ఐఏఎస్ ట్రైనింగ్ సమయంలో వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగి.. అది ప్రేమగా మారింది. కొద్దికాలానికి తమ మధ్య ప్రేమను.. వివాహ బంధంగా మార్చుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే టీనా, అథర్ అమీర్‌‌ల మతాలు వేరుకావడంతో పలు సంఘాలు వీరి వివాహంపై అభ్యంతరం వ్యక్తం చేశాయి.

అయితే అవేమీ పట్టించుకోకుండా 2018‌లో కశ్మీర్‌లో టీనా, అథర్ అమీర్‌‌లు పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఢిల్లీలో రిస్పెషన్ ఏర్పాటు చేశారు. వీరి రిస్పెషన్‌కు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో పాటు పలువురు ప్రముఖులు కూడా హాజరయ్యారు. అయితే పెళ్లైనా కొద్ది రోజులకే వీరద్దరి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తినట్టుగా తెలుస్తోంది. అవి కాస్తా రోజురోజుకు పెరగడంతో.. వారు తమ వివాహ బంధానికి ముగింపు పలకాలనే నిర్ణయానికి వచ్చారు. పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకునేందుకు జైపూర్‌లోని ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. ఇక, వారి పెళ్లి చేసుకోవడం అప్పట్లో ఎంత హాట్ టాపిక్‌గా మారిందో.. ఇప్పుడు వారిద్దరు విడిపోవాలని కోర్టును ఆశ్రయించడం కూడా అంతే చర్చనీయాంశంగా మారింది.

IAS topper Tina Dabi and Athar Khan, Tina Dabi and Athar Khan couple, Divorce, Jaipur Family Court, Tina Dabi, Athar Khan, ఐఏఎస్ టాపర్స్, టీనా దాబీ, అథర్ అమీర్,  విడాకులు, జైపూర్ ఫ్యామిలీ కోర్టు,
(Photo-Instagram/dabi_tina)


మరోవైపు సోషల్ మీడియాలో టీనా తన సర్‌ నేమ్ నుంచి ఖాన్‌ను తొలగించారు. ఇక, అమీర్ ఇన్‌స్టాగ్రామ్‌లో టీనాను అన్‌ఫాలో చేశారు. ప్రస్తుతం టీనా రాజస్థాన్ ఆర్థిక శాఖ జాయింట్ సెక్రటరీగా పని చేస్తున్నారు. అథర్ అమీర్ ఈజీఎస్ సీఈవోగా విధులు నిర్వహిస్తున్నారు.
Published by: Sumanth Kanukula
First published: November 21, 2020, 9:01 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading