Home /News /trending /

IAS OFFICER SUPRIYA SAHU SHARES WINDSHIELD OF KERALA BUS CRACKS DURING ELEPHANT ENCOUNTER VIDEO GOES VIRAL PAH

Viral Video: మరీ ఇలానే ఉంటది.. పిలిచి మరీ గెలుక్కొవడం అంటే ఇదే.. బస్సుపై ఏనుగు దాడి..

బస్సుపై ఏనుగు దాడి

బస్సుపై ఏనుగు దాడి

Elephant Encounter Video: సాధారణంగా ఏనుగులు అడవుల్లో ఉంటాయి. ఒక్కొసారి దారితప్పి మానవ ఆవాసాల దగ్గరకు వస్తుంటాయి. కొన్ని చోట్ల అడవులలో టూరిస్ట్ లు ఏనుగులను దగ్గరి నుంచి చూడాలని వాటి సఫారీలోకి వస్తుంటారు. ఈ క్రమంలో కొన్ని సార్లు ఏనుగుల దాడులకు గురౌతారు.

ఇంకా చదవండి ...
Kerala Bus Cracks During Elephant Attack: ఏనుగులు గుంపులు గుంపులుగా సంచరిస్తాయి. అవి ప్రధానంగా చెట్ల ఆకులు, కొమ్మలు తింటూ ఉంటాయి. ఒక్కొసారి ఏనుగులు వస్తున్నాయంటే.. సింహాలు సైతం తోక ముడుచుకుని పక్కకు తప్పుకుంటుంటాయి. వాటి దరిదాపుల్లోకి వెళ్లే సాహాసం అసలు చేయవు. కానీ కొన్ని సార్లు ఏనుగులు దారితప్పి మానవ ఆవాసాలకు, అడవికి సమీపంలో ఉన్న గ్రామాల్లోకి వస్తుంటాయి. ఈ క్రమంలో అవి మనుషులపైకి, ఇళ్లపైకి దాడులు చేస్తాయి.

ఈ క్రమంలో అధికారులు ఏనుగులను, ఇతర గజరాజలను రప్పించి వాటిని తిరిగి అడవికి వెళ్ళేల చేస్తారు. ఏనుగులు ఒక్కొసారి భీకరంగా ప్రవర్తిస్తాయి. ప్రధానంగా వాటికి మదం కారేటప్పుడు ఆడతోడు కోసం వెతుకు తాయి. కొన్ని సార్లు వేరే ఏనుగులతో ఆడ ఏనుగు కోసం పోట్లాటకు సైతం దిగుతాయి. కొన్ని సార్లు పర్యాటకులపై ఏనుగులకు దాడి చేసిన అనేక సంఘటనలు గతంలో చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం , ఇలాంటి సంఘటన ఒకటి వైరల్ గా మారింది.





పూర్తి వివరాలు.. కేరళలో ఒక బస్సులో కొంత మంది ప్రయాణికులు మున్నార్ కు వెళ్తున్నారు. రోడ్డు పక్కన అడవి ఉంది. ప్రయాణికులు ఉల్లాసంగా కేరింతలు కొడుతున్నారు. ఎంజాయ్ చేస్తున్నారు. అప్పుడు వారికి ఒక ఏనుగు కనిపించింది. అది ఏంతో పెద్దగా ఉంది. దానికి పెద్ద వైన రెండు దంతాలు ఉన్నాయి. వారు దూరం నుంచి ఏనుగును వీడియో తీస్తున్నారు. అప్పుడు ఊహించని పరిణామం జరిగింది. ఆ ఏనుగు మెల్లగా బస్సు దగ్గరకు వచ్చింది. ప్రయాణికులు కేరింతలు కొడుతూ.. అలానే ఉండిపోయారు. బస్సు ముందటి అద్దం వరకు వచ్చింది.

ఆ తర్వాత.. గట్టిగా తన దంతాలు.. తొండంతో బస్సును ముందుకు గుద్దింది. దీంతో బస్సు అద్దాలకు పగుళ్లు వచ్చాయి. డ్రైవర్ చాకచక్యంగా మెల్లగా బస్సును వెనక్కి వెళ్లనిచ్చాడు. బస్సులో ఉన్న వారంతా ఒక్కసారిగా భయంతో వణికిపోయారు. కాసేపటికి ఏనుగు తిరిగి అడవిలోనికి వెళ్లిపోయింది. అయితే, ఈ వీడియోను ఐఏఎస్ అధికారిణి సుప్రియా సాహు తన ట్వీటర్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. దీంతో ఇది కాస్త వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు.. డ్రైవర్ సమయ ధైర్యానికి మెచ్చుకుంటున్నారు.
Published by:Paresh Inamdar
First published:

Tags: Elephant attacks, Kerala, Viral Video

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు