హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Gutka stain inside aircraft : విమానంలో గుట్కా మరక..చొక్కా విప్పించి తుడిపించాలంటూ నెటిజన్లు ఫైర్

Gutka stain inside aircraft : విమానంలో గుట్కా మరక..చొక్కా విప్పించి తుడిపించాలంటూ నెటిజన్లు ఫైర్

విమానంలో గుట్కా మరక

విమానంలో గుట్కా మరక

Gutka stain inside aircraft: గుట్కా,పాన్‌పరాగ్‌ నమిలేవారు ఎక్కడపడితే అక్కడ ఊస్తుంటారు. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో ఇది ఎక్కువగా ఉంటుంది. ఉత్తర భారతదేశంలోని అనేక నగరాల్లో గుట్కా,పాన్ పరాగ్ లను నమిలి ఎక్కడపడితే అక్కడ ఊస్తుండటం మనం చూడవచ్చు.

ఇంకా చదవండి ...

Gutka stain inside aircraft: గుట్కా,పాన్‌పరాగ్‌ నమిలేవారు ఎక్కడపడితే అక్కడ ఊస్తుంటారు. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో ఇది ఎక్కువగా ఉంటుంది. ఉత్తర భారతదేశంలోని అనేక నగరాల్లో గుట్కా,పాన్ పరాగ్ లను నమిలి ఎక్కడపడితే అక్కడ ఊస్తుండటం మనం చూడవచ్చు. బస్సుల్లో,రైళ్లల్లో కూడా ఇంతే. ఇదేంటని ఎవరైనా ప్రశ్నిస్తే..వారిపై దాడులు చేయడానికి కూడా వెనకాడరు కొందరు. అయితే దక్షిణ భారతదేశంలో ఇది అత్యంత అరుదుగా కనిపిస్తుంది. దక్షిణ భారతదేశంలో అక్కడక్కడా రోడ్లపై గుట్కాలు,పాన్ పరాగ్ లు నమిలి ఊసే వాళ్లు కూడా ఎక్కువ ఉత్తర భారతదేశం నుంచి ఇక్కడికి పనుల కోసం వచ్చిన వాళ్లే. అధికారులు అనేక ప్రచారాలు నిర్వహించిన తర్వాత కూడా ప్రజలు బహిరంగ పరిశుభ్రత సమస్యను చాలా తేలికగా తీసుకుంటున్నారు అనేదానికి IAS అధికారి అవనీష్ శరణ్ సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్ట్ నిదర్శనంగా ఉంది.

గుట్కా,పాన్‌పరాగ్‌ నమిలే అలవాటు ఉన్న వ్యక్తి...విమానాన్ని కూడా వదిలిపెట్టలేదు. విమానం కిటికీ వద్ద కూర్చొని ప్రయాణించిన ఆ వ్యక్తి విండో వద్ద గుట్కాను ఊశాడు. దీంతో అక్కడ మరక పడింది. ఆ విమానంలో ప్రయాణించిన ఐఏఎస్‌ అధికారి అవనీష్ శరణ్.. కిటికీ వద్ద గుట్కా మరక ఉండటాన్ని గమనించారు. దీంతో తన మొబైల్‌ ఫోన్‌తో దాని ఫొటో తీశారు. అనంతరం ట్విట్టర్‌ లో "ఎవరో తన గుర్తింపును ఇలా వదిలివెళ్లారు" అని హిందీలో పేర్కొంటూ ఆ ఫొటోను పోస్ట్‌ చేశారు.విమానంలో గుట్కా ఉమ్మిన వ్యక్తిపై ఈ మేరకు తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.


ALSO READ Modi@8: ప్రధాని మదిలో గుజరాత్ కి ప్రత్యేక స్థానం..బుల్లెట్ రైలు, ఎయిమ్స్ రాజ్‌కోట్, గ్రీన్ ఎయిర్‌పోర్ట్..

మరోవైపు ఈ ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. దీంతో విమానంలో గుట్కాను ఊసిన వ్యక్తిపై నెటిజన్లు మండిపడ్డారు. ఇప్పటి వరకు బస్సులు, రైళ్లను అశుభ్రం చేస్తున్నారు. ఇప్పుడు విమానాల్లో కూడానా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ వ్యక్తి చొక్కా విప్పించి దానిని తుడిపించాలని కొందరు డిమాండ్‌ చేశారు. అతడిని గుర్తించి భారీగా జరిమానా విధించాలని కొందరు సూచించారు.

First published:

Tags: AIRCRAFT, Viral image

ఉత్తమ కథలు