Home /News /trending /

IAS OFFICER IPS DIPANSHU KABRA SHARE A FUNNY VIDEO THE YOUNG MAN REACHED THE FRIENDS PROCESSION AND DANCING IN AS THE TRAINING PAH

Viral video: ఇదేక్కడి మల్టీ పర్ఫామెన్స్ రా అయ్యా.. చూసేందుకు రెండు కళ్లు చాలట్లేదుగా..

మాస్ స్టెప్పులతో ఇరగ దీస్తున్న వ్యక్తి

మాస్ స్టెప్పులతో ఇరగ దీస్తున్న వ్యక్తి

Man Dance video: నేటి యువతలో చాలా వరకు గవర్నమెంట్ జాబ్ సాధించాలని కలలు కంటారు. అందులో యూనిఫామ్ జాబ్ (Police job) కు ఉండే క్రేజ్ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ కొందరు మాత్రమే దీన్ని సాధిస్తారు.  అలాంటి వారు.. తమ సొంత ఊరికి వస్తే స్థానికులు, వారి స్నేహితులు చేసే హల్ చల్ మాములుగా ఉండదు.

ఇంకా చదవండి ...
Ias officer IPS Dipanshu Kabra sharded a funny video: ప్రస్తుతం సమాజంలో ప్రభుత్వ ఉద్యోగులకు  డిమాండ్ చాలా ఎక్కువ. అదేవిధంగా వీరికి సోసైటీలో కూడా చాలా రెస్పెక్ట్ ఇస్తుంటారు. ప్రభుత్వ కొలువు సాధించాలని చాలా మంది కలలు కంటారు. కానీ కొందరు మాత్రమే.. దీని కోసం చివరి వరకు గట్టిగా ప్రయత్నిస్తారు. దీని కోసం సంవత్సరాల తరబడి సమయం కేటాయించాల్సి ఉంటుంది. కొందరు దీని కోసం చివరి వరకు కష్టపడి తాము.. కోరుకున్న ఉద్యోగాన్నిసాధిస్తారు. మరికొందరు మధ్యలోనే వదిలేస్తారు. పట్టణాలలో కన్నా.. గ్రామాల్లో ప్రభుత్వ ఉద్యోగం సాధించిన వారిని నెత్తిన పెట్టుకుని చూస్తారు. వారిని ఆకాశం నుంచి ఊడి పడ్డట్లు చూస్తారు. వారికిచ్చే మర్యాద మామూలుగా ఉండదు. ఇక పెళ్లి సంబంధాలలో కూడా ప్రభుత్వ ఉద్యోగం వారికే మొదటి ప్రయారీటి ఇస్తున్నారు.

ఇక, స్నేహితులలో, బంధువులలో ఎవరైన వ్యక్తి గవర్నమెంట్ జాబ్ సాధిస్తే.. వారిని తన గ్రామంలో గ్రాండ్ గా వెల్ కమ్ చేబుతారు. సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. కొన్ని భయంకరంగాను, మరికొన్ని ఫన్నీగాను ఉంటాయి. కొందరు నెటిజన్లు చూడటానికి భయకరంగా ఉన్న వీడియోలు చూడటానికి ఆసక్తి చూపిస్తుంటారు. ఎదైన గొప్ప పనిచేస్తే వారిని వెల్ కమ్ చెప్పిన అనేక ఘటనలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.


ప్రస్తుతం ఈ వీడియోలో..గవర్నమెంట్ ఉద్యోగం సాధించిన వారిని.. ప్రత్యేక వాహానంలో ఊరేగించి, మెడలో పూల దండలు, డీజే, బ్యాండ్ లు, స్నేహితుల మాస్ స్టెప్పులు మాములుగా ఉండదు మరీ.. ఈ కోవకు చెందిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

పూర్తి వివరాలు.. ఒక వ్యక్తి యూనిఫామ్ ఉద్యోగాన్ని సాధించాడు. అతనికి సదరు గ్రామస్థులు బ్యాండ్, డీజేలతో గ్రాండ్ గా వెల్ కమ్ చేప్తున్నారు. ఈ క్రమంలో.. గ్రామంలో అందరు డ్యాన్స్ లు, డప్పుల చప్పుళ్లతో హోరెత్తిస్తున్నారు. ఇంతలో ఒక వ్యక్తి మరీ కొంచెం వెరైటీ స్టెప్పులతో అక్కడివారి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. అతను మరీ.. కొంచెం మద్యం సేవించాడో ఏంటో కానీ.. వెరైటీ డ్యాన్ తో అక్కడి వారిని తెగ నవ్విస్తున్నాడు. అతను.. అప్పుడే.. పోలీసు ట్రైనింగ్ లో కవాతు మాదిరిగా లెఫ్ల్ రైట్ కవాతు చేస్తున్నాడు.. మళ్లీ వెంటనే.. అధికారికి సెల్యూట్ చేస్తున్నట్లు పోజ్ ఇస్తున్నాడు. ఆ తర్వాత.. యోగా, ఎక్సర్ సైజ్ లు చేస్తున్నాడు. అంతలోనే క్రికెట్ లో బౌలింగ్ వేస్తున్నట్లు తన ఎక్స్ ప్రెషన్ ను, డ్యాన్స్ పర్ఫమెన్స్ తో అక్కడి వారిని షాక్ కు గురిచేస్తున్నాడు.ఈ ఘటన ఎక్కడ జరిగిందో వివరాలు లేవు. ఈ ఫన్నీ వీడియోను ఐపీఎస్ అధికారి దీపాంషు కబ్రా తన ట్విట్టర్‌లో షేర్ చేశారు. దీంతో ఇది వైరల్ గా మారింది.
Published by:Paresh Inamdar
First published:

Tags: Government jobs, Viral Video

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు