Home /News /trending /

IAFS MIG FIGHTER AIRCRAFT CRASHES IN RAJASTHANS BARMER TWO PILOTS GO MISSING PAH

MiG Fighter: కుప్పకూలిన మిగ్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్.. ఇద్దరు పైలెట్లు దుర్మరణం

విమాన ప్రమాద ఘటన

విమాన ప్రమాద ఘటన

Rajasthan: భారత వైమానిక దళానికి చెందిన మిగ్ ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్ గురువారం కుప్పకూలింది. ఈ ఘటనలో.. ఇద్దరు పైలట్లు మంటల్లో చిక్కుకుని దుర్మరణం పాలయ్యారు.

భారత్ లో మరో విమాన ప్రమాద ఘటన జరిగింది. రాజస్థాన్‌లోని బార్మర్‌లో ఐఏఎఫ్‌కు చెందిన మిగ్ ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్ (MiG Fighter Aircraft Crashes)  కుప్పకూలింది. ఈ ప్రమాదంలో.. ఇద్దరు పైలట్లు మంటల్లో కాలిపోయారు.  అధికారులు తెలిపిన నివేదికల ప్రకారం.. ఇద్దరు పైలట్లు విమానంలో ఉన్నారు. అయితే వారు మంటలలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది.  భారత ఎయిర్ ఫోర్స్ కు చెందిన మిగ్ యుద్ధ విమానం రాజస్థాన్‌లోని (Rajasthan) బార్మర్ జిల్లాలో (Rajasthans Barmer) గురువారం సాయంత్రం కుప్పకూలింది.

బార్మర్ జిల్లాలోని భీమ్డా గ్రామంలో అర కిలోమీటరు మేర చెల్లాచెదురుగా విమాన శిధిలాలు కనిపించాయని ప్రాథమిక నివేదికలు సూచించాయి. ఘటనపై నివేదిక అందుకున్న బార్మర్ జిల్లా కలెక్టర్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, ఎయిర్ ఫోర్స్ అధికారులు ఘటనాస్థలికి చేరుకున్నారు. అధికారులు విచారణ చేపట్టారు.



ఇదిలా ఉండగా గతంలో..  ఢిల్లీ అగ్నిప్రమాదం జరిగింది.

ఈ ఘటనలో మ‌ృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. మంటలు చల్లారిన తర్వాత ఆ భవనంలో రెస్క్యూ సిబ్బంది సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. మూడో అంతస్తులో కొన్ని చోట్ల మాంసపు ముద్దలు కనిపించాయని..  అవి మానవ మృతదేహాలవేనని అధికారులు స్పష్టం చేశారు. ఐతే ఎన్ని శవాలున్నాయన్న దానిపై స్పష్టత లేదు. మృతదేహాలు పూర్తిగా కాలిపోయి.. ముక్కలముక్కలవడంతో.. లెక్కించడం కష్టంగా మారింది. అర్ధరాత్రి వరకు 27 మృతదేహాలను వెలికితీశారు. ఇవాళ మూడో అంతస్తులో మరికొన్ని  మానవ అవయవాలు లభించడంతో.. మరో ముగ్గురు (Delhi Fire Mishap) మరణించిన ఉండొచ్చని అధికారులు తెలిపారు. మొత్తం 30 మంది మరణించినట్లుగా భావించవచ్చని పేర్కొన్నారు.

ఈ ఘటనకు సంబంధించి మరిన్ని కీలక వివరాలను అగ్నిమాపకశాఖ అధికారులు వెల్లడించారు. అగ్నిప్రమాద సమయంలో ఓ గదిలో మీటింగ్ జరిగిందని.. 50 మంది వరకు దానికి హాజరయ్యారని పేర్కొన్నారు. ఆ గదిలోనే ఎక్కువ శవాలు లభ్యమయినట్లు పేర్కొన్నారు. ఢిల్లీలోని ముంద్కా మెట్రో స్టేషన్‌ (Mundka Metro station)సమీపంలో ఘోర అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ముంద్కా మెట్రో స్టేషన్ 544వ నంబరు స్తంభం వద్ద ఉన్న మూడంతస్తుల వాణిజ్య భవనంలో పెద్ద ఎత్తున మంటలు (Delhi Fure Accident) ఎగిసిపడ్డాయి.

సాయంత్రం 04.30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. పెద్ద ఎత్తున మంటలు, దట్టమైన పొగలు అలుముకోవడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అగ్నిమాపక సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. 24 ఫైరింజన్లను రంగంలోకి దించారు. ఓ వైపు మంటలు అదుపు చేస్తూనే.. మరోవైపు భవనంలోని కార్యాలయాలలో చిక్కుకున్న పలువురిని కాపాడారు.
Published by:Paresh Inamdar
First published:

Tags: AIRCRAFT, Pilot, Rajasthan

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు