ఏపీ సీఎం జగన్‌పై జేడీ చక్రవర్తి సంచలన వ్యాఖ్యలు.. ఆయన వ్యవహార శైలి అలా ఉందంటూ..

Trending News: తాను ఇబ్బంది పడుతున్నా చూసి కూడా ఏమైందని కనీసం అడగలేదని, ఆయన ప్రవర్తన చూసి షాకయ్యానని జేడీ చక్రవర్తి తెలిపారు.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: June 7, 2019, 1:01 PM IST
ఏపీ సీఎం జగన్‌పై జేడీ చక్రవర్తి సంచలన వ్యాఖ్యలు.. ఆయన వ్యవహార శైలి అలా ఉందంటూ..
జేడీ చక్రవర్తి (Wikipedia Pic)
  • Share this:
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై సీనియర్ సినీ నటుడు జేడీ చక్రవర్తి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంతో పోల్చితే ఆయన వ్యవహార శైలిలో ఎంతో మార్పు వచ్చిందని చెప్పారు. ఆయన కీలక పాత్రలో నటించిన ‘హిప్పీ’ చిత్రం గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్ర ప్రచార కార్యక్రమంలో భాగంగా జేడీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఇటీవల ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన జగన్‌పై మీ అభిప్రాయం ఏంటి? అని విలేకరి అడిగిన ప్రశ్నకు జేడీ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ‘2008లో జోష్ సినిమా షూటింగ్‌లో భాగంగా విమానంలో వెళ్తున్నా. అప్పటికే నాకు యాక్సిడెంట్ అయ్యి బాధపడుతున్నా. సీట్లో కూర్చోలేక వీల్ చైర్‌ కోసం అడిగా. ఆ సమయంలో జగన్ నా పక్కనే ఉన్నారు. కనీసం ఆయన నన్ను చూసి కూడా పలకరించలేదు. ఆయన ప్రవర్తన చూసి షాకయ్యా. అదే 2018లో మరోసారి విమానంలో వెళ్తుండగా అప్పుడు కూడా జగన్ అదే విమానంలో ప్రయాణించారు. విమానం దిగి వెళ్తుండగా జగన్ దంపతులు నా వద్దకు వచ్చారు. హలో చెప్పి బాగున్నారా అండీ! అని పలకరించారు.’ అని వెల్లడించారు.

జగన్‌లో మార్పు ఎంత వచ్చిందో చెప్పడానికి ఇదో ఉదాహారణ అని జేడీ చక్రవర్తి అన్నారు. హలో చెప్పాల్సిన అవసరం ఆయనకు లేదని, కానీ చెప్పారని అన్నారు. పదేళ్లలో ఆయన ఎంతో పరిణతి సాధించారని కొనియాడారు.
Published by: Shravan Kumar Bommakanti
First published: June 7, 2019, 1:00 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading