16 ఏళ్లప్పుడే రేప్‌కి గురయ్యా, కానీ ఆ విషయం దాచిపెట్టా...

అమెరికన్ సుప్రీంకోర్ట్ నామిని బ్రెట్ కవనాగ్‌పై వచ్చిన లైంగిక ఆరోపణలపై అధ్యక్షుడు ట్రంప్ స్పందించిన తీరుకు వ్యతిరేకంగా తన జీవితంలో జరిగిన దారుణ సంఘటనను బయటపెట్టిన పద్మలక్ష్మి...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: September 26, 2018, 4:38 PM IST
16 ఏళ్లప్పుడే రేప్‌కి గురయ్యా, కానీ ఆ విషయం దాచిపెట్టా...
పద్మలక్ష్మి
  • Share this:
అమెరికాకు చెందిన భారత రచయిత్రి, మోడల్ పద్మలక్ష్మి సంచలన విషయాలు బయటపెట్టింది. మోడల్ గానే కాకుండా నటిగా, టీవీ వ్యాఖ్యత, నిర్మాతగా కూడా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న పద్మలక్ష్మీ... ‘నా 16వ ఏటే రేపు‌కి గురయ్యా... కానీ ఆ విషయం దాచిపెట్టా...’ అంటూ తన జీవితంలో జరిగిన విషాద సంఘటనను బయటపెట్టింది. ఇప్పుడామె వయసు 48 ఏళ్లు. అమెరికన్ సుప్రీంకోర్ట్ నామిని బ్రెట్ కవనాగ్‌పై వచ్చిన లైంగిక ఆరోపణలపై అధ్యక్షుడు ట్రంప్ స్పందించిన తీరుకు వ్యతిరేకంగా పెద్ద వ్యాసమే రాసుకొచ్చింది పద్మలక్ష్మి. 32 ఏళ్ల తర్వాత తనపై జరిగిన అత్యాచారాన్ని బయటపెట్టిన పద్మలక్ష్మి... ట్విట్టర్లో పెను సంచలనమే సృష్టించింది. అయితే ఆమె ఫాలోవర్స్‌లో చాలామంది కూడా పద్మలక్ష్మిని ఆదర్శంగా తీసుకుని తమపై జరిగిన అఘాయిత్యాలను వెల్లడిస్తుండడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

న్యూయార్క్ టైమ్స్ మ్యాగజైన్ కోసం ఒపినియన్‌లో పద్మలక్ష్మీ రాసిన వ్యాసంలో తనకు జరిగిన దారుణం గురించి వివరించింది పద్మలక్ష్మీ. అందులో ఏముందంటే...

‘‘నాకు 16 ఏళ్లు ఉన్నప్పుడు లాస్ ఏంజెల్స్‌లోని ఓ మాల్‌లో కలిసి ఓ అబ్బాయితో డేటింగ్ చేశాను. స్కూల్ అయిపోయిన తర్వాత ఆ మాల్‌లో పనిచేసేదాన్ని. అతనూ అక్కడే పని చేసేవాడు. గ్రే సిల్క్ సూట్ వేసుకుని నా దగ్గరికి వచ్చి ఫ్ల్రట్ చేసేవాడు. అప్పుడతనికి 23 ఏళ్లు. బాగా హ్యాండ్సమ్‌గా ఉండేవాడు. కాలేజీలో చదివేవాడు. ఓ రోజు మేం బయటికి వెళ్లినప్పుడు అతను నన్ను శారీరకంగా లొంగదీసుకునేందుకు ప్రయత్నించాడు. ఎక్కడెక్కడో టచ్ చేస్తూ నన్ను రెచ్చగొట్టాడు. అప్పుడు నేను వర్జిన్ అని అతనికి తెలుసు. కానీ అతనేం చేస్తున్నాడో నాకు అర్థం కాలేదు. డేటింగ్ మొదలెట్టిన కొన్ని నెలలకే అతను నన్ను రేప్ చేశాడు.

ఆ దారుణ సంఘటన గడిచిన వారం రోజుల నుంచి నా మెదడును మళ్లీ తులిచి వేస్తోంది. అమెరికన్ సుప్రీంకోర్ట్ నామిని బ్రెట్ కవనాగ్‌పై ఇద్దరు మహిళలు ధైర్యం ముందుకొచ్చి లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. క్రిస్టెన్ బ్లాసే స్పష్టంగా బ్రెట్‌ తనను ఏ విధంగా రేప్ చేశాడో వివరించింది. స్కూల్లో చదువుతున్నప్పుడు నోటిని మూసి రేప్ చేశాడని చెప్పింది. డెబోరా రమిరెజ్ కాలేజీలో ఉన్నప్పుడు రేప్ చేశాడని చెప్పింది.

‘వాళ్లు చెప్పిందే నిజమైతే... ఎన్నో ఏళ్ల కిందటే అతని మీద కేసు పెట్టి ఉండేవాళ్లు...’ అని అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. అయితే వాళ్లు అప్పుడెందుకు కేసు పెట్టలేదో నాకు ఇప్పుడు అర్థమైంది. ఇన్నాళ్లు పోలీసుల దగ్గరికి వెళ్లకుండా ఆ దారుణ అనుభవాన్ని తమలోనే ఎందుకు దాచుకున్నారో నాకు తెలుసు...



మీలో చాలామంది అనుకోవచ్చు... నాపై రేప్ జరిగిన రాత్రి నేను మద్యం తాగి ఉండొచ్చని... కాని నేను తాగలేదు. మీలో చాలామంది నేను ఆ రోజు ఎలాంటి డ్రెస్ వేసుకున్నానో అని ఊహించుకోవచ్చు. కావాలనే అతన్ని రెచ్చగొట్టే విధంగా పొట్టి దుస్తులు వేసుకున్నానని వాదించవచ్చు. కానీ ఆ రోజు నేను శరీరాన్ని నిండుగా కప్పే లాంగ్ స్లీవ్స్ వేసుకున్నాను. మేమిద్దరం కలిసి రెండు పార్టీలకు వెళ్లాం. ఆ తర్వాత మా అపార్ట్‌మెంట్ గదికి వెళ్లాం. నేను బాగా అలిసి పోయాను. దాంతో వెంటనే బెడ్ మీద పడుకుని నిద్రలోకి జారుకున్నాను.

ఆ తర్వాత ఏం జరిగిందో నాకు బాగా గుర్తుంది. కొద్ది సేపటికి నా కాళ్ల మధ్య ఓ పదునైన కత్తితో కుచ్చుతున్నట్టుగా నొప్పి వచ్చింది. కళ్లు తెరిచి చూస్తే తను నాపైన ఉన్నాడు. ‘ఏం చేస్తున్నావ్...’ అని అడిగాను. ‘ఆగు... మొదట్లో కాస్త నొప్పిగానే ఉంటుంది...’ అన్నాడు. ‘వద్దు అలా చేయకని’ అరిచాను. తను వినిపించుకోలేదు. నొప్పి బాగా పెరిగింది. అయినా అతను అలాగే చేస్తూ ఉన్నాడు. భయంతో ఏడ్చేశాను. ఆ తర్వాత ‘నువ్వు పడుకుంటే నొప్పి తగ్గిపోతుందిలే...’ అని చెప్పి నన్ను ఇంట్లో దింపేశాడు... ఆ సంఘటన ఇప్పటికీ నా మెదడులో అలాగే ఉండిపోయింది. నా పైన రేప్ జరిగిందా... లేక నేను సెక్స్ ఎంజాయ్ చేశానా... అనే విషయం కంటే నేను వర్జినిటీ కోల్పోయాననే విషయం ఇంట్లో వాళ్లకి చెప్పాలంటేనే నాకు భయం వేసింది. నేనే ఏదో తప్పు చేశాననే భావన నన్ను వెంటాడింది...’ అంటూ పెద్ద వ్యాసం రాసుకొచ్చింది పద్మలక్ష్మి.

‘ఈజీ ఎగ్జాటిక్’ పేరుతో పద్మలక్ష్మీ రాసిన మొట్టమొదటి వంటల పుస్తకం 1999లో గౌర్మౌంట్ ప్రపంచ వంటల పుస్తకాల పురస్కారాలలో ‘ఉత్తమ మొదటి వంటల పుస్తకం’ అవార్డు గెలుచుకుంది. ఆ తర్వాత అమెరికన్ కుక్కింగ్ రియాలిటీ షో ‘టాప్ షెఫ్’కు 2006 నుంచి వ్యాఖ్యతగా వ్యవహరిస్తోంది పద్మలక్ష్మి. ఈ కార్యక్రమం ద్వారా ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్న పద్మలక్ష్మి.. 2016లో మహిళా దినోత్సవం నాడు ‘లవ్, లాస్ అండ్ వాట్ వియ్ ఈట్’ పుస్తకం విడుదల చేస్తోంది. ఫెమినిస్ట్‌గా మహిళా హక్కుల కోసం పోరాటం చేస్తున్న పద్మలక్ష్మీ... 48 ఏళ్ల వయసులోనూ ఇన్‌స్టాగ్రామ్‌లో హాట్ అండ్ బోల్డ్ ఫోటోలను పోస్ట్ చేస్తుంటుంది.

పద్మలక్ష్మి హాట్ వీడియో చూసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి...

Published by: Ramu Chinthakindhi
First published: September 26, 2018, 12:00 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading