Home /News /trending /

I WAS NOT BORN TO EAT AND SIT AT HOME I WILL GO TO SCHOOL AND STUDY AFGHAN GIRL VIDEO GOES VIRAL ON SOCIAL MEDIA PRV

Afghanistan news: ‘‘నేను ఇంట్లో తిని కూర్చోవడానికి పుట్టలేదు.. పాఠశాలకు వెళ్లి చదువుకుంటాను” సోషల్​మీడియాలో వైరల్​గా ఆప్ఘన్​ బాలిక వీడియో

మాట్లాడుతున్న యువతి (Photo: Twitter)

మాట్లాడుతున్న యువతి (Photo: Twitter)

తాలిబన్లు అధికారం మాత్రమే చేజిక్కించుకుంటే పర్లేదు. అప్ఘనిస్తాన్​ మహిళల (women) జీవితాలను స్వాధీనం చేసుకున్నారు. వారి స్వాతంత్య్రాన్ని స్వాధీనం చేసుకున్నారు. కఠినమైన షరియా చట్టాలను ఆ దేశంలో రుద్దుతున్నారు. దీంతో సగటు అప్ఘన్​ యువతి (girl) అక్కడ వెక్కివెక్కి ఏడుస్తోంది.

ఇంకా చదవండి ...
    అప్ఘనిస్తాన్ (Afghanistan)​. గత కొన్ని నెలలుగా ప్రపంచం దృష్టిని తనవైపు తిప్పుకున్న దేశం. 20 ఏళ్లుగా తాలిబాన్లతో పోరాటం చేసిన అమెరికా ఒక్కసారిగా సైన్యాన్ని వెనక్కి తీసుకోవడంతో తాలిబాన్లు రెచ్చిపోయారు. దేశాన్నే వశం చేసుకున్నారు. అంతే అప్పటివరకు స్వతంత్రంగా బతికిన వాళ్లంతా అఫ్ఘన్​ను వదిలి పక్కదేశాలకు వలస వెళ్లారు. మరికొందరైతే విమానాలకు వేళాడుతూ వెళ్లిన దృశ్యాలు కనిపించాయి. ఎందుకు అంత భయం తాలిబన్లంటే. వారు అధికారం మాత్రమే చేజిక్కించుకుంటే పర్లేదు. అప్ఘనిస్తాన్​ మహిళల (women) జీవితాలను స్వాధీనం చేసుకున్నారు. వారి స్వాతంత్య్రాన్ని (Independence) స్వాధీనం చేసుకున్నారు. కఠినమైన షరియా చట్టాలను ఆ దేశంలో రుద్దుతున్నారు. దీంతో సగటు అప్ఘన్​ యువతి (girl) అక్కడ వెక్కివెక్కి ఏడుస్తోంది.

    అమ్మాయిలకు చదువు కల్పించాలంటూ..

    ప్రస్తుతం అప్ఘన్లో పాఠశాలలు (schools) ప్రారంభమైన అక్కడ బాలురు (boys) మాత్రమే చదువుకోవడానికి వెళుతున్నారు. దీంతో తమకూ చదువుకోవడానికి అవకాశం కల్పించాలని అమ్మాయిలు (girls) డిమాండ్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించి ఒకరికొకరు ఫొటోలు, వీడియోలు షేర్​ చేస్తున్నారు. ఆప్ఘన్ జర్నలిస్ట్ బిలాల్ సర్వరీ ఆ వీడియోను సోషల్​ మీడియాలో (social media) ట్వీట్ చేశారు. ఇందులో ఓ యువతి (girl) అమ్మాయిలకు చదువు అవసరం అంటూ గట్టిగా మాట్లాడింది.

    హక్కులు హరించడానికి వారెవరు?

    ఆ వీడియోలో .. దేశం అభివృద్ధికి అమ్మాయిలు చదువుకోవటం (girl studying) అవసరమని చెప్పింది బాలిక. దేశం కోసం పని చేయడానికి ఓ మంచి అవకాశం వచ్చిందని తెలిపింది. మహిళలకు అల్లా (Allah) హక్కుల కోసం పోరాడానికి అల్లా అవకాశం కల్పించినట్లు ఆమె చెప్పింది. హక్కులు హరించడానికి తాలిబాన్లు ఎవరు అంటూ యువతి ప్రశ్నించింది. ఈ రోజు ఉన్న బాలికలు రేపు తల్లులు అవుతారు. అమ్మాయిలు చదువుకోకుంటే వారి పిల్లలకు (children) ఎలా నడవడిక, చదువు నెర్పుతారని ప్రశ్నించింది. ‘‘నేను కొత్త తరం నుంచి వచ్చాను. నేను ఇంట్లో తిని పడుకోవాడానికి పుట్టలేదు” అని చెప్పింది ఆమె. తను పాఠశాలకు వెళ్లాలని వ్యాఖ్యానించింది ఆ బాలిక.

    దేశం అభివృద్ధి కోసం ఎదైనా చేయాలని ఉందని చెప్పింది. చదువు లేకుండా దేశం ఎలా అభివృద్ధి చెందుతుందని ప్రశ్నించింది ఆ బాలిక. నేను విద్య (Education)ను పొందలేకపోతే ఆఫ్ఘానిస్తాన్ లోని ఏ బాలిక చదువుకోలేదని యువతి వీడియోలో (video) పలికింది. మాకు చదువు లేకుంటే ప్రపంచంలో మాకు విలువ ఉండదని చెప్పింది . ప్రస్తుతం ఈ వీడియో సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది.



    ప్రత్యేకంగా చదువుకోవచ్చంటూ.. అనుమతివ్వని వైనం

    ఆప్ఘనిస్తాన్ ను తాలిబాన్లు అక్రమించిన తర్వాత మహిళల హక్కులు (Women rights) హరించడం ఆందోళన కలిగిస్తోంది. తమ రాజ్యంలో బాలికలు చదువుకోవచ్చని కానీ, బాలురతో కలిసి చేదుకోబోరని తాలిబాన్లు (Taliban) అప్పట్లో ప్రకటించారు. తాలిబాన్లు అధికారం చేపట్టిన తర్వాత రాజధాని నగరం కాబూల్‌తో సహా ఆఫ్ఘనిస్తాన్‌లోని పాఠశాలలు ఒక నెలపాటు మూతపడ్డాయి. దేశంలోని మదర్సస్, ప్రైవేట్, ప్రభుత్వ విద్యాసంస్థలు తెరవడానికి ఏర్పాట్లు చేయాలని అధికారులను కోరుతూ తాలిబాన్ ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. అబ్బాయిలకు మాత్రమే పాఠశాలలకు వెళ్లేందుకు అవకాశం కల్పించింది. తాలిబాన్ ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో అమ్మాయిల గురించి ప్రస్తావించలేదు. పాఠశాలలకు ఉపాధ్యాయులు, మగ విద్యార్థులే హాజరు కావాలని ప్రకటనలో ఉన్నట్లు రాయిటర్స్ తెలిపింది.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Afghanistan, EDUCATION, Viral Video, Women

    తదుపరి వార్తలు