హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

ఆంటీని హగ్ చేసుకోవాలి.. పర్మిషన్ ఇవ్వండి.. అంటూ ఆ పసిపాప ఏం చేసిందో చూడండి.. ఈ వీడియోకు నెటిజన్లు ఫిదా..

ఆంటీని హగ్ చేసుకోవాలి.. పర్మిషన్ ఇవ్వండి.. అంటూ ఆ పసిపాప ఏం చేసిందో చూడండి.. ఈ వీడియోకు నెటిజన్లు ఫిదా..

పర్మిషన్ అడుగుతున్న పాప

పర్మిషన్ అడుగుతున్న పాప

Viral Video: అమ్మా.. నాన్న.. ఆంటీ అంటూ చంటిపాప మన దగ్గరకొస్తే.. ఎత్తుకోమని ఏడిస్తే మనం ఒక్కక్షణం కూడా ఆగలేం కదూ. అటువంటిది ఓ పాలబుగ్గ పసిపాప.. మా ఆంటీని హగ్ చేసుకోవాలి.. తనకు పర్మిషన్ ఇవ్వండి అంటూ ఓ సెక్యూరిటీ గార్డును అడుగుతుంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

ఇంకా చదవండి ...

  చిన్న పిల్లలు(Child babys) ఏ పని చేసినా.. ముద్దుగా అనిపిస్తుంటుంది. వారిని చూస్తే కోపం అనేది రాకపోగా మనస్సుకు కాస్త ప్రశాంతత కూడా ఉంటుంది. పిల్లలు(Childrens) ఉన్న ఇంట్లో అంతా సందడి సందడిగా ఉంటుంది. బయటకు వెళ్తున్న క్రమంలో వాళ్లు చెప్పే టాటా అనేది ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంటుంది. తాజాగా ఓ చిన్నారి అలాంటి పని చేసింది. ఆ వీడియో(Video) ఇప్పుడు సోషల్(Social Media) మీడియాలో వైరల్ గా (viral) మారింది. తన ఆంటికి వీడ్కోలు(Send Off) చెప్పడానికి ఎయిర్ పోర్టులో ఆ చిన్నారి.. అక్కడే ఉన్న సెక్యూరిటీ గార్డ్ తో పర్మిషన్ అడుగుతుంది.

  Samantha Stylist: ప్రీతమ్ జుకల్కర్ ఒక గే.. అతడితో సమంత అలా చేస్తుందా.. నిజాన్ని బయటపెట్టిన..


  అలా పర్మిషన్ అడిగే తీరు ఎంతో ముచ్చటేస్తుంది. అందుకే ఈ వీడియో అంత వైరల్ అయింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఖతార్‌లోని హమద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. అక్కడ ఓ మహిళ విదేశాలకు వెళ్తుంటే.. వీడ్కోలు పలకడానికి ఆ కుటుంబం ఎయిర్ పోర్ట్ కు వచ్చారు. ఆమె సెక్యూరిటీ గార్డ్ వద్ద ఫార్మాల్టీస్ పూర్తి చేసుకొని లోపలకు వెళ్లింది. ఇంత‌లో ఓ చిన్నారి సెక్యూరిటీ పాయింట్ వ‌ద్ద‌కు వ‌చ్చి అక్క‌డ నిలుచున్న సెక్యూరిటీతో మా అత్త‌ను కౌగిలించుకోవాలి ప‌ర్మిష‌న్ ఇవ్వండి అని అడిగింది.

  Flipkart: సీరియల్ నటుడికి షాక్ ఇచ్చిన ఫ్లిప్‌కార్ట్‌.. ఇయర్ ఫోన్స్ ఆర్డర్ చేస్తే.. అతడికి ఏమి వచ్చిందో తెలుసా..


  ఆ చిన్నారి అడిగిన తీరు చూస్తే.. ఎవరైనా కరిగిపోవాల్సిందే.. అలాగే అక్కడే ఉన్న సెక్యూరిటీ గార్డ్ పర్మిషన్ ఇచ్చేశాడు. లోపలకు పరుగుగెత్తుకుండా అత్తా అనుకుంటూ వెళ్లింది ఆ చిన్నారి. వాళ్ల అత్త అక్కడ క్యూలో నిల్చొని ఉంది. ఆ చిన్నారిని చూసిన అత్త.. పరుగున వచ్చి.. ఆ చిన్నారిని ఎత్తుకొని ముద్దాడింది. ఇదంతా కప్తాన్ హిందుస్థాన్ అనే వ్య‌క్తి వీడియో తీసి సోష‌ల్ మీడియాలో పోస్టు చేయ‌గా వైర‌ల్‌గా మారింది. కేవ‌లం రెండు రోజుల వ్య‌వ‌ధిలో 6 ల‌క్ష‌లకు పైగా చూశారు.

  WhatsApp Features: త్వరలోనే వాట్సాప్​లో మరిన్ని కొత్త ఫీచర్లు.. ఇక ప్రత్యర్థి యాప్స్​కు చుక్కలే..


  ఇప్ప‌టికే ఈ వీడియోను 62 వేల మందికి పైగా లైక్ చేశారు. దీనిపై నెటిజ‌న్లు త‌మ‌దైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ఎంతో క్యూట్ గా ఉంది పాప అంటూ కొందరు పోస్టు చేస్తుంటే.. ఆ చిన్న వయస్సులోనే ఆ చిన్నారికి ఎంత ఆలోచన ఉంది.. సెక్యూరిటీని పర్మిషన్ అడగాలనే ఆలోచన  రావడం అనేది అమోఘం అంటూ ప్రశంసిస్తున్నారు.

  Published by:Veera Babu
  First published:

  Tags: Trending news, Viral Videos

  ఉత్తమ కథలు