కుక్క అనుకొని ఎలుగుబంటిని పెంచుకున్నాడు... ఆ తర్వాత ఏమైందంటే...

Bear : కుక్కకీ, ఎలుగుబంటికీ తేడా తెలియకపోతే ఎలా... అసలా రెండూ ఒకేలా ఎక్కడుంటాయి... మరి ఆ సింగర్ ఎందుకు కనిపెట్టలేకపోయాడు?

Krishna Kumar N | news18-telugu
Updated: June 15, 2019, 10:43 AM IST
కుక్క అనుకొని ఎలుగుబంటిని పెంచుకున్నాడు... ఆ తర్వాత ఏమైందంటే...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
Malaysia : మలేసియాలో పాపులర్ సింగర్ సోఫియా యాషిన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఎలుగుబంటిని పెంచుకుంటున్నందుకు జైల్లో పెట్టారు. అతను మాత్రం అది ఎలుగుబంటి అని తాను అనుకోలేదనీ, అది కుక్క అనుకొని పెంచుకుంటున్నానని తెలిపాడు. కొన్ని రోజుల కిందట రాత్రి వేళ వీధిలో వెళ్తుంటే... అది కనిపించిందనీ... చాలా నీరసంగా ఉందనీ... ఇంటికి తెచ్చి... పెంచుకుంటున్నాననీ వివరించాడు. ఆ పిల్ల ఎలుగుబంటిని చాలా చక్కగా చూసుకుంటున్నాననీ, ఇప్పుడు అది చాలా ఆరోగ్యంగా ఉందని చెప్పాడు 27 ఏళ్ల యాషిన్. చట్టాన్ని అతిక్రమించే ఉద్దేశం తనకు లేదనీ, అనారోగ్యంతో ఉన్న జంతువును కాపాడాలని అనుకున్నానే తప్ప... అది ఎలుగుబంటి అని అనుకోలేదని లబోదిబోమంటున్నాడు.


బ్రూనో అని పేరు పెట్టి పెంచుకుంటున్న ఎలుగుబంటి... తాజాగా ఇంటి కిటికీలోంచీ బయటకు వచ్చింది. గట్టిగా అరిచింది. అది చూసిన చుట్టుపక్కల వాళ్లు కంగారుపడ్డారు. అమ్మో ఎలుగుబంటి అంటూ కేకలు పెట్టారు. వెంటనే ఇంట్లోంచీ బయటకు వచ్చిన యాషిన్ అది ఎలుగుబంటి కాదనీ, కుక్క అనీ వాదించాడు. వాళ్లు మాత్రం నీ కళ్లు నెత్తికెక్కాయా... ఆ నల్ల జుట్టు, ముఖం చూస్తే తెలియట్లా... అది కుక్క కాదు ఎలుగుబంటి... అని ఫైర్ అయ్యారు. పోలీసులకు కాల్ చేశారు. కౌలాలంపూర్‌లోని సింగర్ హౌస్‌పై నిషేధం విధించిన అధికారులు... అతన్ని అరెస్టు చేసి, ఎలుగుబంటిని దగ్గర్లోని జూకి తరలించారు. చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

 

ఇవి కూడా చదవండి :

కేంద్రానికి కేజ్రీవాల్ షాక్... కేజ్రీవాల్‌కి ఢిల్లీ పోలీసుల షాక్...

ఆస్ట్రేలియా క్రికెట్ బ్యాట్ల కంపెనీపై సచిన్ కేసు.. 2 మిలియన్ డాలర్ల దావా...40వేల ఏళ్ల నాటి తోడేలు తల... ఇప్పటికీ అలాగే ఉంది... సైబీరియా మంచులో...

డబ్బుల్లేని ATMపై ఫైన్... ఆర్బీఐ కొత్త నిర్ణయం
First published: June 15, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading