అత్యంత అందమైన భార్య...అనుష్కను ఆకాశానికెత్తేసిన విరాట్ కోహ్లీ

ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో ఆరు వరుస ఓటముల తర్వాత తొలి విజయాన్ని నమోదు చేసుకుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు. వరుస ఓటములతో విమర్శలకు గురవుతున్న విరాట్ కోహ్లీకి ఈ విజయం పెను ఊరట కలిగిస్తోంది.

news18-telugu
Updated: April 14, 2019, 4:30 PM IST
అత్యంత అందమైన భార్య...అనుష్కను ఆకాశానికెత్తేసిన విరాట్ కోహ్లీ
విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ(ఫైల్ ఫోటో)
  • Share this:
ఐపీఎల్ సీజన్-12లో ఆరు వరుస ఓటముల తర్వాత ఏడో మ్యాచ్‌లో తొలి విజయాన్ని దక్కించుకుంది రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్టు. శనివారం కింగ్స్‌ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 8 వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ విజయం ఆర్సీబీ ఫ్యాన్స్‌తో పాటు ఆ జట్టు ఆటగాళ్లకు పెను ఊరట నిలిచింది. వరుస ఓటములతో తీవ్ర విమర్శలు ఎదుర్కొనేందుకు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీకి కొత్త ఉత్తేజాన్ని ఇచ్చింది. ఈ మ్యాచ్‌ అనంతరం గెలిచిన ఉత్సాహంలో ఏబీ డివిలియర్స్‌, కోహ్లి సరదాగా చిట్‌ చాట్‌ చేశారు. ఈ సందర్భంగా వరుస ఓటములతో ఎదురైన ఒత్తిడిని అధిగమించేందుకు తన భార్య, బాలీవుడ్ అనుష్క శర్మ తనను ఎంతో ప్రోత్సహించిందంటూ విరాట్ కోహ్లీ ఆకాశానికెత్తేశాడు. తన స్ట్రెస్‌ బస్టర్‌ అనుష్కనేనంటూ పొగడ్తలతో ముంచెత్తాడు. ఆమె తన భార్యగా ఉండడం తన అదృష్టమని చెప్పుకొచ్చాడు.

ipl 2019,virat kohli,ipl,virat kohli ipl 2019,kohli,ipl 2019 news,virat kohli ban from ipl 2019,vivo ipl 2019,virat kohli ipl,ipl 2019 rcb,kohli ipl 2019,kohli rcb ipl 2019,ipl 2019 live,kohli ban from ipl,ipl 2019 auction,virat kohli crying on ipl 2019,ipl 2019 highlights,kohli fights,virat kohli ban from ipl,kohli abusing,kohli tension,virat kohli ipl 2019 news,virat kohli ipl 2019 photo,IPL 2019 : ఐపీఎల్ నుంచి విరాట్‌ కోహ్లీ ఔట్...? వరల్డ్ కప్‌పై ప్రభావం పడకుండా ఉండేందుకేనా...?
విరాట్ కోహ్లీ(ఫైల్ ఫోటో)


అనుష్కతో గతేడాది తనకు పెళ్లి జరగడం తన జీవితంలో జరిగిన గొప్ప విషయంగా చెప్పుకొచ్చాడు. ఈ పెళ్లితో తన ప్రపంచమే మారిపోయిందన్నాడు. అత్యంత అందమైన, గొప్ప వ్యక్తిత్వం కలిగిన భార్య తనకుందని, తనను ఇది మరింత బలవంతుడిని చేసిందన్నాడు. గతంలో చిన్న చిన్న విషయాలకే తాను తీవ్ర ఆందోళనకు గురయ్యేవాడినని..అయితే అనుష్మ తన జీవితంలోకి వచ్చిన తర్వాత తన ఆలోచన విధానం పూర్తిగా మారిపోయిందని చెప్పుకొచ్చాడు.

virat kohli, anushka sharma, virat kohli anushka sharma marriage, virat anushka wedding, విరాట్ కోహ్లి, అనుష్క షర్మ, విరాట్ అనుష్కల పెళ్లి
విరాట్ కొహ్లీ-అనుష్క శర్మ ( Anushka Sharma/ Twitter )
ఒక బలమైన వ్యక్తి మనతో ఉంటే మనం కొండనైనా ఢీకొనగలమని..అనుష్క తనలో ఎప్పుడూ స్ఫూర్తి నింపుతూ ఉంటుందని చెప్పాడు. సానుకూలంగా ఉండేలా ప్రేరేపిస్తుందన్నాడు. ఆమెతో గడిపితే ఎలాంటి ఒత్తిడైనా దూరం అవుతుందని కోహ్లి చెప్పుకొచ్చాడు. విజయం దక్కిన రాత్రి తమకు చాలా ప్రత్యేకమని కోహ్లి తెలిపాడు.
First published: April 14, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు