• HOME
  • »
  • NEWS
  • »
  • TRENDING
  • »
  • I DONT FEAR FOR COVID BUT THIS FAN A CORONA PATIENT WANTS TO REPLACE A FAN IN A VIDEO WHICH GO VIRAL ON SOCIAL MEDIA NK

Viral: కరోనా కాదు ఈ ఫ్యాన్ బయపెడుతోంది.. వీడియో చూసి పగలబడి నవ్వుతున్న నెటిజన్లు

Viral: కరోనా కాదు ఈ ఫ్యాన్ బయపెడుతోంది.. వీడియో చూసి పగలబడి నవ్వుతున్న నెటిజన్లు

కరోనా పేషెంట్‌ని భయపెడుతున్న ఫ్యాన్ (image credit - twitter)

Viral Video: నిజమే... ఆ ఫ్యాన్‌ని చూస్తే... ఎవరైనా సరే భయపడతారు. దాని ముందు కరోనా కూడా చిన్నబోతుంది. ఎందుకో తెలుసుకుందాం. ఆ వీడియో మనం కూడా చూద్దాం.

  • Share this:
    Viral Video: దేశంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతుంటే... రకరకాల వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఐతే... ఓ వీడియో నెటిజన్లను బాగా నవ్విస్తోంది. అందులో ఓ కరోనా పేషెంట్... తన బెడ్‌కి పైన సీలింగ్‌కి వేలాడుతున్న ఫ్యాన్‌ని మార్చమని ఆస్పత్రి అధికారులను వేడుకున్నాడు. మధ్యప్రదేశ్... చింద్వారాలో జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కరోనా వచ్చినప్పుడు అతను చాలా భయపడ్డాడు. తీరా ఆస్పత్రిలో చేరాక... ఇప్పుడు కరోనా కంటే ఈ ఫ్యానే తనను ఎక్కువ భయపెడుతోందని ఆ వీడియోలో స్వయంగా చెప్పాడు. అందుకే ఆ వీడియో వైరల్ అయ్యింది. అందరూ అది చూసి నవ్వుతున్నారు.

    ఈ వీడియో మొత్తం 2 నిమిషాల 17 సెకండ్లు ఉంది. అందులో కరోనా సోకిన కుర్రాడు ఆస్పత్రి వార్డులో ఓ బెడ్‌పై ఉన్నాడు. ఆ వార్డులో చాలా మంది పేషెంట్లు ఉన్నారు. అతను తన మొబైల్‌తో సెల్ఫీ వీడియో తీశాడు. తనపైన ఉన్న ఫ్యాన్‌ని అందులో చూపించాడు. ఆ ఫ్యాన్ గుండ్రంగా తిరుగుతూనే... ఉడి మీద పడుతుందేమో అన్నట్లుగా తిరుగుతోంది. అదే అతన్ని కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. "మిత్రులారా నేను చింద్వారాలో అతి పెద్ద ఆస్పత్రిలో చేరాను. కానీ ఇక్కడ పరిస్థితి లా ఉందో చూడండి" అని అతను వీడియోని చూపించాడు. "నా బెడ్‌కి పైన ఓ విదేశీ ఫ్యాన్ తిరుగుతోంది. దాన్ని చూస్తుంటే భయం వేస్తోంది. కరోనా వల్ల భయం లేదు... ఈ ఫ్యాన్ భయపెడుతోంది" అని చెప్పాడు. ఆ వీడియో మీరూ చూడండి.


    పైకి ఈ వీడియో నవ్విస్తున్నా... తెరవెనక ఇది మన దేశంలోని ఆస్పత్రుల పరిస్థితిని బయటపెడుతోంది. కరోనా మనకి కొత్త కాదు. 15 నెలలుగా ఉంది. అయినా సరే మన దేశంలో వైద్య రంగం మెరుగవ్వలేదు. ఇప్పటికీ ఆస్పత్రుల్లో కనీస సదుపాయాలు కూడా సరిగా లేవు. నిన్న విశాఖలో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో రక్తం తుడిచేందుకు దూది కూడా లేదన్నారని పేషెంట్ బంధువులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి చిన్న చిన్న సదుపాయాలు కూడా లేకుండానే ఆస్పత్రులను నడిపేస్తున్నారు. ఈ వీడియోలో ఫ్యాన్ కూడా అంతే... అది మీద పడితే ప్రాణాలకే ప్రమాదం. అయినా సరే దాన్ని అలాగే తిరగనిస్తున్నారు. ప్రమాదం జరిగాక కళ్లు తెరిచేకంటే... ముందే మేలుకోవాలి కదా.

    ఇది కూడా చదవండి:Apologies to Allah: అల్లాకు క్షమాపణలు.. దీక్ష చేయలేకపోతున్నా... ఓ యువకుడి కథ

    "కరోనా కంటే ముందు ఈ ఫ్యానే నన్ను చంపేసేలా ఉంది" అని ఆ పేషెంట్ అన్నాడంటే... అక్కడి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మనం అంచనా వేసుకోవచ్చు. ఈ వీడియోపై మనలాంటి అందరూ స్పందిస్తున్నారు. ఆ ఫ్యాన్ మార్చమని ట్విట్టర్, వాట్సాప్‌లో డిమాండ్ చేస్తున్నారు. అతను త్వరగా కోవిడ్ నుంచి కోలుకోవాలని కోరుకుంటున్నారు. ఫ్యాన్ మార్చేలోపే నువ్వు రికవరీ అవ్వాలి అని ఓ నెటిజన్ కోరారు.
    Published by:Krishna Kumar N
    First published:

    అగ్ర కథనాలు