‘నేను హోంవర్క్ రాయను’.. పిల్లాడు రాసిన లెటర్‌‌తో టీచర్‌కి షాక్, నెటిజన్లు ఫిదా

‘నేను హోంవర్క్ చేయలేదు. ఎందుకంటే స్కూల్ వర్క్‌ని ఇంటి దగ్గర చేయడం నాకు ఇష్టం లేదు.’ అని రాసిన ఆ బుడతడు.. చాలా మంది కళ్లు తెరిపించాడు.

news18-telugu
Updated: February 17, 2019, 8:45 PM IST
‘నేను హోంవర్క్ రాయను’.. పిల్లాడు రాసిన లెటర్‌‌తో టీచర్‌కి షాక్, నెటిజన్లు ఫిదా
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
పిల్లలకు హోం వర్క్ ఇవ్వాలా? వద్దా అనేది ఓ పెద్ద ప్రశ్న. కొంతమంది ఇవ్వాలంటారు. మరికొందరు వద్దంటారు. అదో పెద్ద ఇష్యూ. పిల్లలని చక్కగా ఆడుకోనివ్వాలని, వారికి చదువులతో పాటు ఆటలు కూడా ఆడుకోవాలని, అప్పుడే వారి జ్ఞానం వికసిస్తుందని చాలా మంది చెబుతుంటారు. అయితే, అసలు విద్యార్థులకు హోంవర్క్ ఇవ్వాలా? వద్దా? అనే విషయాన్ని ఆ పిల్లలనే ఎప్పుడైనా అడిగితే ఎలా ఉంటుంది? అలాంటి ప్రశ్న ఓ టీచర్ తన విద్యార్థిని అడిగింది. అందుకు ఆ బుడతడు ఇచ్చిన సమాధానం చూసి ఆ టీచర్ షాక్ అయితే, నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అతడి వాదన చూసి మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు.

I dont do Home work, Children Home work, Viral New, Viral Video, California, Exam techniques, కాలిఫోర్నియా, హోంవర్క్ చేయనంటున్న పిల్లాడు, వైరల్ న్యూస్, వైరల్ వీడియోలు
ప్రతీకాత్మక చిత్రం

కాలిఫోర్నియాలో ఎడ్వర్డ్ ఇమ్మాన్యుయేల్ కార్టెజ్ అనే విద్యార్థి ఉన్నాడు. శనివారం, ఆదివారం స్కూలుకి సెలవులు కాబట్టి, ఈ వీకెండ్‌లో పూర్తి చేయాలంటూ హోంవర్క్ ఇచ్చింది. అయితే, టీచర్ ఇచ్చిన హోంవర్క్‌ని ఇంటి దగ్గర చేయకుండానే పాఠశాలకు వెళ్లాడు ఎడ్డీ. వీకెండ్ అంతా ఎంజాయ్ చేసి హోంవర్క్ చేయకుండా ఎందుకు వచ్చావంటూ టీచర్ నిలదీసింది. అసలు హోంవర్క్ ఎందుకు చేయలేదో వివరణ ఇవ్వాలని ఆర్డర్ వేసింది. అందుకు అతడు ఇచ్చిన సమాధానం చూసి షాక్ అయింది.

I dont do Home work, Children Home work, Viral New, Viral Video, California, Exam techniques, కాలిఫోర్నియా, హోంవర్క్ చేయనంటున్న పిల్లాడు, వైరల్ న్యూస్, వైరల్ వీడియోలు
ప్రతీకాత్మక చిత్రం

‘నేను హోంవర్క్ చేయలేదు. ఎందుకంటే స్కూల్ వర్క్‌ని ఇంటి దగ్గర చేయడం నాకు ఇష్టం లేదు. వీకెండ్ ఉండేది స్నేహితులతో ఆడుకుని ఎంజాయ్ చేయడానికి. నాకు ఏది సంతోషంగా అనిపిస్తే అదే చేస్తా. నువ్వు బాస్ కానీ, టీచర్ కానీ అయితే తప్ప.. రియల్ వరల్డ్‌ జాబ్స్ ఎప్పుడూ హోంవర్క్‌ ఇవ్వవు. కాబట్టి స్కూల్ వర్క్ ఇంటిదగ్గర చేయకూడదు. ఎందుకంటే దాని వల్ల ఉపయోగం లేదు.’ అని రాశాడు.

I dont do Home work, Children Home work, Viral New, Viral Video, California, Exam techniques, కాలిఫోర్నియా, హోంవర్క్ చేయనంటున్న పిల్లాడు, వైరల్ న్యూస్, వైరల్ వీడియోలు
హోంవర్క్ వృధా అంటూ ఎడ్డీ టీచర్‌కు రాసిన లెటర్

ఆ లెటర్‌లో అతడు రాసిన ఈ పదాలే హైలైట్ అనుకుంటే, అంతకు మించిన అద్భుతమైన వాక్యాలు మరిన్ని ఉన్నాయి. ‘హోంవర్క్ అనేది ఉపయోగం లేదు కాబట్టి, స్టూడెంట్ వర్సెస్ హోంవర్క్ కేసులో ఎడ్డీ వాదనకు కోర్టు మద్దతుగా నిలిచింది. ఇక కేసు క్లోజ్ అయింది’ అని ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు.
I dont do Home work, Children Home work, Viral New, Viral Video, California, Exam techniques, కాలిఫోర్నియా, హోంవర్క్ చేయనంటున్న పిల్లాడు, వైరల్ న్యూస్, వైరల్ వీడియోలు
ప్రతీకాత్మక చిత్రం

ఈ లెటర్ చూసిన నెటిజన్లు అతడి టాలెంట్‌ను చూసి ఫిదా అయిపోతున్నారు. కొందరైతే అతడికి నోబెల్ ప్రైజ్ ఇవ్వాలని సూచిస్తే, మరికొందరు ఆ బుడతడికి వందకు 100 మార్కులు వేస్తున్నారు.ఓ నెటిజన్ అయితే, ‘నేను టీచర్ కాదు. బాస్ కూడా కాదు. కానీ హోంవర్క్ చేయాల్సి వస్తోంది.’ అంటూ నిర్వేదంగా పెట్టిన పోస్ట్ కూడా ఆకట్టుకుంటోంది.

మొత్తానికి ఈ పిల్లాడి లెటర్ ఇంటర్నెట్‌లో పెద్ద సంచలనంగా మారింది.
Published by: Ashok Kumar Bonepalli
First published: February 17, 2019, 8:40 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading