హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Affair: తండ్రి ఎఫైర్ గురించి తెలుసుకున్న కూతురు.. అతడు ఎవరితో సంబంధం పెట్టుకున్నాడో తెలిసి..

Affair: తండ్రి ఎఫైర్ గురించి తెలుసుకున్న కూతురు.. అతడు ఎవరితో సంబంధం పెట్టుకున్నాడో తెలిసి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఏదైనా సంబంధంలో మధ్య నమ్మకం అనేది చాలా ముఖ్యం అని అంటారు. భార్యభర్తలు, కుటుంబ సభ్యుల మధ్య కూడా విశ్వాసం అనేది కీలకమైన పాత్ర పోషిస్తుంది.

ఏదైనా సంబంధంలో మధ్య నమ్మకం అనేది చాలా ముఖ్యం అని అంటారు. భార్యభర్తలు, కుటుంబ సభ్యుల మధ్య కూడా విశ్వాసం అనేది కీలకమైన పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా వైవాహిక జీవితంలో మోసాలు చాలా సందర్భాల్లో ఊహించని పరిణామాలకు దారితీస్తాయి. అయితే ఇటీవల తన తండ్రి తన తల్లిని ఎలా మోసం చేశాడో వెల్లడించిన ఓ యువతి.. షాకింగ్ విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ యువతి బెస్ట్‌ఫ్రెండ్‌తోనే.. ఆమె తండ్రి ఎఫైర్ పెట్టుకున్నాడని వివరించింది. ఈ మేరకు ఆమె టిక్‌టాక్‌లో ఓ వీడియోను షేర్ చేసింది. @diana.j.t అనే టిక్‌టాక్‌ ఖాతాలో షేర్ చేయబడిన వీడియోలో డయానా అనే యువతి తన స్టోరిని వివరించింది. తన బెస్ట్‌ఫ్రెండ్‌తో.. తన తండ్రి ఏ విధంగా ఎఫైర్ పెట్టుకున్నాడో చెప్పింది.

‘నా కుటుంబం మొత్తం ఒక ఫ్యామిలీ రెస్టారెంట్‌ నిర్వహిస్తుంది. నా స్నేహితురాలు.. గ్రెట్చెన్ వయసులో నాకంటే మూడేళ్లు పెద్దది. ఆమె ఇంట్లో నుంచి చదువు సాగిస్తోంది. మిగిలిన సమయాల్లో మా ఫ్యామిలీ రెస్టారెంట్‌లో పనిచేస్తుంది. అయితే నా తండ్రికి.. వేరే మహిళతో వివాహేతర సంబంధం ఉన్న విషయం నా తల్లికి తెలిసింది. అయితే ఆమె ఎవరో బయటి వ్యక్తి అని భావించారు. కానీ తర్వాత నా తండ్రి వివాహేతర సంబంధం పెట్టుకుంది.. నా బెస్ట్‌ ఫ్రెండ్‌ గ్రెట్చెన్ తోనే అని తెలిసింది’అని డయానా తెలిపింది.

IPL 2021: ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఐపీఎల్ మ్యాచ్‌లకు ఫ్యాన్స్‌కి ఎంట్రీ.. ఆన్‌లైన్‌లో టికెట్లు ఎప్పటి నుంచి అంటే..


అయితే డయానా తన స్నేహితురాలిపై కోపంతో ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ విషయం తెలుసుకున్న తర్వాత తన తల్లి రెస్టారెంట్‌లో ఈ వ్యవహారం గురించి బహిరంగంగా చర్చించినట్టుగా డయానా తెలిపింది. తన తల్లి ఇప్పుడు విడాకులు తీసుకుని విడిపోయిందని డయానా చెప్పింది. ఇకపై రెస్టారెంట్‌లో కూడా పనిచేయదని తెలిపింది. 26 ఏళ్ల అమ్మాయి కోసం తన తండ్రి.. తల్లిని విడిచిపెట్టాడని తెలుసుకున్నందుకు బాధగా ఉందని డయానా ఆవేదన వ్యక్తం చేసింది.

Shocking: అతడు డాక్టర్.. ఆమె టీచర్.. 9 ఏళ్ల క్రితం నాటి వీడియోలతో..

ఈ మేరకు mirror వార్త కథనాన్ని ప్రచురించింది. ఇక, చివరిగా తన తల్లి విడాకులు తీసుకున్న మరో వివాహం చేసుకని సంతోషంగా ఉందని డయానా తెలిపింది.

First published:

Tags: Extra marital affair

ఉత్తమ కథలు