ఐశ్వర్యరాయ్‌పై అవమానకర ట్వీట్.. అది తప్పేం కాదంటున్న బాలీవుడ్ హీరో

వివేక్ ఒబెరాయ్ ట్విట్టర్ ఫోటో

Bollywood News: క్షమాపణ చెప్పాలని తనను అడుగుతున్నారని, కానీ తాను ఎలాంటి తప్పు చేయలేదని వివేక్ ఒబెరాయ్ స్పష్టం చేశాడు.

 • Share this:
  బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్‌ను అవమానించేలా ట్వీట్ చేసి వివాదానికి తెర తీశాడు తోటి నటుడు వివేక్ ఒబెరాయ్. గతంలో ఐశ్వర్య.. సల్మాన్ ఖాన్, వివేక్ ఒబెరాయ్‌లతో డేటింగ్ చేసింది. ఆ తరువాత అభిషేక్‌ని పెళ్లి చేసుకొని కూతుర్ని కూడా కన్నది. దీన్ని ఎన్నికల ఫలితాలకు లింక్ చేస్తూ ఓ వ్యక్తి పోస్ట్ తయారు చేశారు. ఐశ్వర్య, సల్మాన్‌లను ఉద్దేశిస్తూ ఒపీనియన్ పోల్ అని, ఐశ్వర్య-వివేక్‌లను ఉద్దేశిస్తూ ఎగ్జిట్ పోల్ అని, ఐశ్వర్య-అభిషేక్ వారి కూతురు ఆరాధ్యలను ఉద్దేశిస్తూ రిజల్ట్ అని రాశారు. ఐశ్వర్యని అవమానించే విధంగా ఉన్న ఈ పోస్ట్‌ను పోస్ట్ చేయడమే కాకుండా ‘క్రియేటివ్! నో రాజకీయాలు.. కేవలం జీవితమే’ అని కామెంట్ పెట్టాడు కూడా. అయితే, ఈ ట్వీట్‌పై పలు వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో వివేక్ స్పందించాడు.

  ‘క్షమాపణ చెప్పాలని నన్ను అడుగుతున్నారు. క్షమాపణ కోరేందుకు నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. కాకపోతే, నేనేం తప్పు చేశా? నేను తప్పు చేస్తే కచ్చితంగా క్షమాపణ కోరతా. నేను తప్పు చేశానని అనుకోవడం లేదు. అందులో తప్పేం ఉంది? ఎవరో మెమేను ట్వీట్ చేశారు. దానికి నేను నవ్వుకుంటూ ట్వీట్ చేశానంతే’ అని వెల్లడించాడు.

  ఇది కూడా చదవండి:
  ఐశ్వర్యరాయ్‌ని అవమానించిన వివేక్ ఒబెరాయ్.. నోటీసులు జారీ చేసిన..
  First published: