హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Banjara Hills Prashant : జోగినిగా మారిన ట్రాన్స్‌జెండర్ ప్రశాంతి.. వేడుకలా జోగుకల్యాణం

Banjara Hills Prashant : జోగినిగా మారిన ట్రాన్స్‌జెండర్ ప్రశాంతి.. వేడుకలా జోగుకల్యాణం

జోగుకల్యాణం చేసుకున్న ప్రశాంతి

జోగుకల్యాణం చేసుకున్న ప్రశాంతి

టిక్ టాక్ ఫేమ్ బంజారాహిల్స్ ప్రశాంత్ ట్రాన్స్ జెండర్ గా మారిన సంగతి తెలిసిందే. ఇప్పుడామె జోగినిగా రూపాంతరం చెందింది. హైదరాబాద్ లోని బోరబండ ప్రాంతం అల్లాపూర్ కు చెందిన ట్రాన్స్ జెండర్ గౌరారం ప్రశాంతి తల్లిదండ్రుల సమక్షంలో మంగళవారం నాడు కత్తితో వివాహమాడి జోగినిగా మారింది.

ఇంకా చదవండి ...

టిక్ టాక్ ఉధృతి కొనసాగిన రోజుల్లో తమదైన టాలెంట్ తో తెలుగు గడ్డపైనే చాలా మంది పాపులారిటీ సాధించారు. అందరిలోకీ, లైంగికతను దాచుకోకుండా.. తామున్న స్టేటస్ లోనే ధైర్యంగా వీడియోలు చేసిన కొందరు ప్రత్యేకంగా నిలిచారు. ఉప్పల్ బాలు.. బంజారాహిల్స్ ప్రశాంత్.. కాగజ్ నగర్ సాయి.. హైదరాబాద్ లైలా పారు.. లాంటివాళ్లకు ఇప్పటికీ క్రేజ్ తగ్గలేదు. సోషల్ మీడియాలో వాళ్లపై పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగినా, చాలా మందికి వాళ్లంటే చిన్న చూపు ఉన్నా, మీమ్స్ క్రియేటర్లకు ఆ బ్యాచ్ ఎంతగానో ఉపయోగపడుతూనే ఉన్నారు. నిషేధం తర్వాత టిక్ టాక్ స్టార్లు కొందరు వేరే ప్లాట్ ఫామ్స్ లో పెర్మామెన్సులు చేస్తుండగా, ఇంకొందరు నిజంగానే జెండర్ మార్చేసుకున్నారు. బంజారాహిల్స్ ప్రశాంత్ అయితే జెండర్ మార్చుకోవడమేకాదు ఏకంగా జోగినిగానూ మారిపోయాడు. తల్లిదండ్రులు, బంధువల సమక్షంలో ప్రశాంతి జోగు కల్యాణం ఘనంగా జరిగింది. వివరాలివి..

టిక్ టాక్ ఫేమ్ బంజారాహిల్స్ ప్రశాంత్ ట్రాన్స్ జెండర్ గా మారిన సంగతి తెలిసిందే. ఇప్పుడామె జోగినిగా రూపాంతరం చెందింది. హైదరాబాద్ లోని బోరబండ ప్రాంతం అల్లాపూర్ కు చెందిన ట్రాన్స్ జెండర్ గౌరారం ప్రశాంతి తల్లిదండ్రుల సమక్షంలో మంగళవారం నాడు కత్తితో వివాహమాడి జోగినిగా మారింది. ఆమె మెడలో గురువు మూడుముళ్లు వేశాడు. మామిడి, నేరేడు, వేప ఆకులతో వేసిన మండపంలో సంప్రదాయబద్దంగా జరిగిన జోగు వివాహానికి ప్రశాంతి కుటుంబీకులు, బంధువులు తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో..

గురువు (మేఘన)తో ప్రశాంతి జోగుకల్యాణం

Padma awardee : కూతురిపై అత్యాచారం.. పద్మ అవార్డు గ్రహీత పాడు పని.. హైకోర్టు షాకింగ్ తీర్పు



తొలుత పండితుడి సూచనల మేరకు ప్రశాంతి తల్లిదండ్రులు అనంతలక్ష్మీ, నర్సింహులు ‘ఎల్లమ్మ మునిరాజు జోగుకల్యాణం’గా పిలిచే వివాహ క్రతువు నిర్వహించారు. అనంతరం గురువు భూపేశ్ నగర్ జగన్ యాదవ్(మేఘన), ప్రశాంతి మెడలో మూడు ముళ్లు వేశాడు. అంతకంటే ముందు ఉంగరాలు మార్చుకోవడం, తలపై జీలకర్ర-బెల్లం ఉంచడం తదితర కార్యక్రమాలు నిర్వహించారు.

రాజధాని రియల్టర్ అజయ్‌ చౌదరిపై ఐటీ దాడులు.. మాజీ సీఎం సన్నిహితుడు.. సైకిల్ పార్టీపై ఆర్థిక పిడుగు!



ప్రశాంతిని జోగు కల్యాణం చేసుకున్న అనంతరం గురువు (మేఘన) ఆ పెళ్లికి హాజరైన మరికొంత మంది ట్రాన్స్ జెండర్ల మెడలలోనూ మూడు ముళ్లు వేశాడు. అమ్మవారి సేవలో జీవితాన్ని అంకితం చేయడం అదృష్టంగా భావిస్తున్నట్లు జోగినిగా మారిన వధువు ప్రశాంతి మీడియాకు తెలిపింది. వివాహ వేడుక అనంతరం బంధుమిత్రులకు కమ్మటి విందు భోజనం ఏర్పాటు చేశారు. హైదరాబాద్ సహా వివిధ ప్రాంతాలకు చెందిన ట్రాన్స్ జెండర్లు ప్రశాంతి వివాహానికి హాజరయ్యారు. జోగిని వ్యవస్థ ఉండాలా? కొనసాగాలా? అనేదానిపై భిన్నవాదనలున్న సంగతి తెలిసిందే.

First published:

Tags: Hyderabad, Marriage, Transgender

ఉత్తమ కథలు