నడ్డి విరుస్తున్న హైదరాబాద్ రోడ్లు.. పటపటా విరుగుతున్న వెన్నుపూస..

Hyderabad Roads: రోడ్డెక్కగానే భారీ గుంతలు, పెద్ద పెద్ద గొయ్యిలు, డ్యాన్స్ రాకున్నా ఆటోమేటిక్‌గా డ్యాన్స్ చేయించే ఎత్తుపళ్లాలు దర్శనమిస్తున్నాయి. ఈత కొట్టే దమ్ముంటే ఆ గుంతల్లో సరిపడా నీళ్లు కనిపిస్తున్నాయి.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: October 10, 2019, 3:15 PM IST
నడ్డి విరుస్తున్న హైదరాబాద్ రోడ్లు.. పటపటా విరుగుతున్న వెన్నుపూస..
హైదరాబాద్ రోడ్ల పరిస్థితి ఇదీ..
  • Share this:
రోడ్డెక్కితే భద్రంగా ఇంటికి చేరతామో లేదోనన్న భయం.. ఎలాగోలా రోడ్డెక్కినా క్షణక్షణం గుండె దడ.. ఏ గుంతలో పడి బైక్ ఫట్‌మని అంటుందో.. బైక్ కింద పడి శరీరంలో ఏ బొక్క విరుగుతుందో.. 20 కిలోమీటర్ల వేగానికి మించి వెళితే నరకానికి దారులు వెతుక్కున్నట్లే.. ఎందుకలా అనుకుంటున్నారా? దానికంతటికీ కారణం హైదరాబాద్ రోడ్లే. అవును! రోడ్డెక్కగానే భారీ గుంతలు, పెద్ద పెద్ద గొయ్యిలు, డ్యాన్స్ రాకున్నా ఆటోమేటిక్‌గా డ్యాన్స్ చేయించే ఎత్తుపళ్లాలు దర్శనమిస్తున్నాయి. ఈత కొట్టే దమ్ముంటే ఆ గుంతల్లో సరిపడా నీళ్లు కనిపిస్తున్నాయి. మురికి కాలువల్లో నిండిన నీళ్లు రోడ్లను అభిషేకం చేస్తున్నాయి. భారీ వర్షాలతో హైదరాబాద్ రోడ్లన్నీ దారుణంగా తయారయ్యాయి. ఇంటి నుంచి బైక్ తీసుకొని వెళ్తే.. భద్రంగా ఇంటికి చేరుతామో, లేక గుంతల్లో పడి మంచం ఎక్కుతామో తెలీకుండా మారాయి. రోడ్ల వల్ల బైక్ పార్టులన్నీ వదులై పోతున్నాయి. కార్లలో వెళితే.. నాలుగు టైర్లు నాలుగు రకాలుగా నృత్యం చేస్తున్నాయి.

హైదరాబాద్ రోడ్ల పరిస్థితి ఇదీ..


బైక్‌పై వెళ్తే.. ప్రస్తుతం ఉన్న రోడ్ల వల్ల నడ్డి విరుగుతోంది. వెన్నుపూస ఫట్‌ఫట్‌మంటున్నాయి. ఇక ముసలివాళ్లైతే ఒకసారి బయటికి వెళ్తే.. ఇంటికి వచ్చి మంచం పట్టాల్సి వస్తోంది మరి. దాదాపు నెల రోజులుగా వర్షాలు భారీగా కురుస్తున్నాయి. కుండపోతతో రోడ్లను పనికిరాకుండా చేస్తున్నాయి. అయితే, ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుందామన్నా వర్షాలు ఆ అవకాశం ఇవ్వడం లేదు. అప్పుడే భగభగమండే ఎండ పోయి.. క్షణాల్లో కారుమబ్బులు కమ్ముకొంటున్నాయి. మరు క్షణమే.. వర్షం బీభత్సం సృష్టిస్తోంది. ఏదేమైనా జీహెచ్‌ఎంసీ త్వరితగతిన చర్యలు తీసుకోకపోతే నగరవాసులు త్వరలోనే మంచాన పడాల్సిన పరిస్థితి వచ్చేలా ఉంది.

దారుణంగా తయారైన హైదరాబాద్ రోడ్లు
కాగా, వరుసగా వర్షాలు కురవడంతో పలు మార్గాల్లో రోడ్లు దెబ్బతిన్నాయని, 160కి పైగా మాన్‌సూన్ ఎమర్జెన్సీ బృందాలతో మరమ్మతులు చేయిస్తున్నామని అధికారులు తెలిపారు. వర్షాల వల్ల రోడ్ల మరమ్మతులకు ఆటంకం కలుగుతోందని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్ కుమార్ చెప్పారు. వర్షాలు తగ్గాక యుద్ధప్రాతిపదికన రోడ్ల మరమ్మతులు చేపడతామని వెల్లడించారు.

దారుణంగా తయారైన హైదరాబాద్ రోడ్లు
First published: October 10, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు