హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Aadhaar Door Service: ఇక మీ ఇంటి దగ్గరే ఆధార్ సేవలు... ఎలా పొందాలో తెలుసుకోండి

Aadhaar Door Service: ఇక మీ ఇంటి దగ్గరే ఆధార్ సేవలు... ఎలా పొందాలో తెలుసుకోండి

Aadhaar Door Service: ఇక మీ ఇంటి దగ్గరే ఆధార్ సేవలు... ఎలా పొందాలో తెలుసుకోండి
(ప్రతీకాత్మక చిత్రం)

Aadhaar Door Service: ఇక మీ ఇంటి దగ్గరే ఆధార్ సేవలు... ఎలా పొందాలో తెలుసుకోండి (ప్రతీకాత్మక చిత్రం)

Aadhaar Door Service | మీరు ఏవైనా ఆధార్ సేవలు పొందాలనుకుంటే సిబ్బందిని మీ ఇంటికే పిలిపించొచ్చు. ఉదాహరణకు కొత్తగా ఆధార్ నమోదు, అడ్రస్ మార్పు, ఫోన్ నెంబర్ అప్‌డేట్, బయోమెట్రిక్ వివరాల నమోదు లాంటి సేవలన్నింటినీ ఇంటిదగ్గరే పొందొచ్చు.

  ఆధార్ కార్డు ఉన్నవారందరికీ శుభవార్త. ఇక మీరు ఆధార్ సేవలను ఇంటి దగ్గరే పొందొచ్చు. ఆధార్‌లో అప్‌డేట్స్ ఏవైనా ఉన్నా, మార్పుచేర్పులు ఏవైనా చేయాలన్నా మీరు ఆధార్ కేంద్రానికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఆధార్ సేవలు అందించేందుకు సిబ్బంది నేరుగా మీ ఇంటికి వస్తారు. తపాలా శాఖ అందిస్తున్న అద్భుతమైన అవకాశమిది. ప్రైవేట్ సంస్థలతో పాటు తపాలా శాఖ కూడా ఆధార్ సేవలను అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు పోస్ట్ ఆఫీసుల్లో ఆధార్ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. బయట ఆధార్ కేంద్రాల్లో పొందినట్టుగానే పోస్ట్ ఆఫీసుల్లోని ఆధార్ సెంటర్లలో సేవలు పొందొచ్చు. అయితే ఆధార్ సేవలను ఇంటి దగ్గరే అందించాలని తపాలా శాఖ నిర్ణయించింది. అంటే మీరు ఏవైనా ఆధార్ సేవలు పొందాలనుకుంటే సిబ్బందిని మీ ఇంటికే పిలిపించొచ్చు. ఉదాహరణకు కొత్తగా ఆధార్ నమోదు, అడ్రస్ మార్పు, ఫోన్ నెంబర్ అప్‌డేట్, బయోమెట్రిక్ వివరాల నమోదు లాంటి సేవలన్నింటినీ ఇంటిదగ్గరే పొందొచ్చు.

  ఆధార్ సేవల్ని ఇంటి దగ్గర అందించాలని హైదరాబాద్‌లోని పోస్టల్ శాఖ నిర్ణయించింది. ప్రస్తుతం ఇంటి దగ్గర ఆధార్ సేవలు పొందే అవకాశం హైదరాబాదీలకు మాత్రమే. అయితే ఒకరిద్దరు ఇంటిదగ్గర ఆధార్ సేవలు పొందాలనుకుంటే కుదరదు. కనీసం 30 మంది ఉంటి వారికి ఇంటి దగ్గర ఆధార్ సేవలు అందుతాయి. ప్రజలకు ఆధార్ సేవల్ని మరింత దగ్గర చేయాలన్న ఉద్దేశంతో పోస్టల్ శాఖ ఈ నిర్ణయాన్ని తీసుకుంది. అపార్ట్‌మెంట్‌వాసులు, కాలనీవాసులు కలిసి ఒకేసారి ఆధార్ సేవలు పొందేందుకు అద్భుతమైన అవకాశమిది. మరి మీ కాలనీలో లేదా అపార్ట్‌మెంట్‌లో కనీసం 30 మంది ఆధార్ సేవలు పొందాలనుకుంటే 9440644035 నెంబర్‌కు కాల్ చేయాలి.

  Redmi Note 8: రూ.9,999 ధరకే 4జీబీ+64జీబీ స్మార్ట్‌ఫోన్... ఎలా ఉందో చూడండి

  ఇవి కూడా చదవండి:

  Aadhar Reprint: ఆధార్ కార్డు పోయిందా? ఈ స్టెప్స్ ఫాలో అవండి

  Aadhaar: ఆధార్ అప్‌డేట్ చేయించాలా? ఆన్‌లైన్‌లో స్లాట్ బుక్ చేయొచ్చు ఇలా

  Aadhaar Charges: ఆధార్ సెంటర్‌లో అసలు ఛార్జీలు ఎంతో తెలుసా?

  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: Aadhaar Card, Aadhaar card, AADHAR, India post, UIDAI

  ఉత్తమ కథలు