Indian Railways : వామ్మో... రైల్వే ట్రాక్ విరిగిపోయిందిగా... కొద్దిలో తప్పిన ఎక్స్‌ప్రెస్ ప్రమాదం...

Train Accident : పాకిస్థాన్‌లో రైలు ప్రమాదం జరిగి... 24 గంటలు కూడా గడవక ముందే... అలాంటి మరో దుర్వార్త మనం వినాల్సి వచ్చేదేమో. లక్కీగా అలా జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Krishna Kumar N | news18-telugu
Updated: July 12, 2019, 11:39 AM IST
Indian Railways : వామ్మో... రైల్వే ట్రాక్ విరిగిపోయిందిగా... కొద్దిలో తప్పిన ఎక్స్‌ప్రెస్ ప్రమాదం...
పగిలిన ట్రాక్
Krishna Kumar N | news18-telugu
Updated: July 12, 2019, 11:39 AM IST
హైదరాబాద్ నుంచీ కాగజ్‌నగర్‌కు వెళ్తున్న ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్‌ను జమ్మికుంట దగ్గర నిలిపివేశారు. అందులో ప్రయాణికులు... రెడ్ సిగ్నల్ వల్ల ట్రైన్ ఆగిందేమో అనుకున్నారు. వేరే ట్రైన్ వెళ్లేవరకూ తమ ట్రైన్ వెళ్లదని కొంతమంది చెప్పుకున్నారు. కానీ కాసేపటి తర్వాత అసలు విషయం తెలిసి అంతా... అమ్మో... అవునా అంటూ ఒకరికొకరు దేవుడున్నాడు... ప్రాణాలు దక్కాయి అని చెప్పుకున్నారు. ఇంతకీ ఏమైందంటే... ఆ ట్రైన్ వెళ్తున్న ట్రాక్‌ ఓ చోట విరిగిపోయింది. దానిపై నుంచీ రైలు వెళ్లక ముందే ఈ విషయాన్ని గమనించారు. అలర్టైన రైల్వే అధికారులు... వెంటనే రైలును ఆపివేశారు. ఆఘ మేఘాలపై అక్కడకు వెళ్లి ట్రాక్‌ను రిపేర్ చేస్తున్నారు. విరిగిన ట్రాక్‌ని తొలగించి మరో ట్రాక్ వెయ్యబోతున్నారు.

intercity express,hyderabad intercity express,hyderabad,intercity express trains to sirpurkagaznagar,intercity,hyderabad jaipur express,akola hyderabad express,kaghaznagar,express,secunderabad,intercity expresstrain,indian railways,sirpurkagaznagar to hyderabad trains,akola intercity,hyderabad deccan namapally,hyderabad jaipur train,kagaznagar,express trains to sirpurkagaznagar trains,gatimaan express,gaya express,sirpur kagaznagar,రైలు ప్రమాదం, ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్,
పగిలిన ట్రాక్


రైలు అన్నాక ఎట్టిపరిస్థితుల్లో ట్రాక్‌పైనే వెళ్లాలి. విరిగిన ట్రాక్ వల్ల చాలా ప్రమాదం. రైలు వెళ్లే వేగం, ఆ కుదుపులకు కచ్చితంగా ట్రాక్ కదలక మానదు. అదే జరిగితే... బోగీలు... పక్కకు వెళ్లి పల్టీలు కొట్టే ప్రమాదం ఉంటుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో మనం ఊహించకపోవడమే మంచిది.

పాకిస్థాన్‌లో ఇలాగే... రెండు రైళ్లు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో 14 మంది చనిపోగా... మరో 79 మంది గాయాలపాలయ్యారు. గురువారం ఉదయం సాధిఖాబాద్ దగ్గర్లో రోజూలాగే... వల్హర్ గ్రామం దగ్గర వేగంగా వస్తోంది అక్బర్ ఎక్స్‌ప్రెస్. సరిగ్గా అదే ట్రాక్‌పై ఉన్న గూడ్సురైలును బలంగా ఢీకొంది. ఈ ఘటనలో పదిమంది ప్రయాణికులు అక్కడికక్కడే చనిపోయారు. మరో నలుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. ప్రమాదంలో రైలు చాలా గట్టిగా ఢీకొట్టడం వల్ల బోగీలు ఒకదానిపై ఒకటి ఎక్కేశాయి. బోగీలను హైడ్రాలిక్ కట్టర్ల సాయంతో తొలగించాల్సి వచ్చింది.

First published: July 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...