తక్షణం రుణాలిచ్చే ఇన్స్టంట్ లోన్ యాప్ (instant loan apps) లు.. ఏం పత్రాలివ్వకున్నా రుణాలిస్తామని వెంటపడుతున్న ఆన్లైన్ ముఠా. ఫోన్ తీసి ఏదైనా ఓపెన్ చేద్దామంటే ఇది తిప్పితే లక్షాధికారి కావొచ్చని ఒకడు.. ఇంకేదైనా లింక్ ఓపెన్ చేసి దానిలో చిన్నపాటి క్విజ్ లో పాల్గొన్నా కోట్లు సంపాదిచ్చని ఒక వెబ్సైట్. అసలు ఫోన్ లో నెట్ ఓపెన్ చేద్దామంటేనే భయంగా ఉంది. అంతేగాక ఈ రుణాల యాప్ ల దగ్గర రుణాలు తీసుకుని చాలా మంది వారి వేధింపులకు తాళలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సిటీ పోలీసులు ట్విట్టర్ వేదికగా ఒక ఆసక్తికర వీడియోను షేర్ చేశారు.
ఆన్లైన్ మోసాలు నానాటికీ పెరిగిపోతున్న వేళ హైదరాబాద్ సిటీ పోలీసులు షేర్ చేసిన ఈ వీడియో అందర్నీ ఆకట్టుకుంటున్నది. ఇందులో ఒక కోతి ముసుగు కప్పి ఉన్న ఒక బొమ్మ దగ్గరకి వెళ్లింది. ఆ ముసుగు తీయగానే ఆ కోతికి దూల తీరిపోయింది.
— హైదరాబాద్ సిటీ పోలీస్ Hyderabad City Police (@hydcitypolice) January 14, 2021
ఇంతకీ ఆ కోతి ముసుగు తీయగానే ఏం వచ్చిందనుకుంటున్నారా..? పులి బొమ్మ. దానిని చూసిన కోతి.. ఒక్కసారిగా గెంతుతూ భయంతో అక్కడ్నుంచి పరుగు లంకించుకుంది. ఈ వీడియోను షేర్ చేస్తూ... ‘అన్ని వెబ్ లింక్ లను ఓపెన్ చేయకండి.. అందులో కొన్ని ప్రమాదకారమైనవి ఉండొచ్చు..’ అంటూ రాసుకొచ్చారు పోలీసులు. ఇప్పుడు నెట్టింట ఈ వీడియో వైరలవుతున్నది. మీరూ ఓ లుక్కేయండి మరి..
Published by:Srinivas Munigala
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.