190 చలాన్లు... రూ.32,610 ఫైన్... ఆ బండి ఇదే...

ఇప్పటి వరకు అతని పేరు మీద ఎన్ని చలానాలు జారీ అయ్యాయో తెలుసా? మొత్తం 190. ఆ చలాన్లకు జరిమానా రూ.32,610. ఇదీ ఆ డ్రైవర్ ట్రాక్ రికార్డ్.

news18-telugu
Updated: May 8, 2019, 4:21 PM IST
190 చలాన్లు... రూ.32,610 ఫైన్... ఆ బండి ఇదే...
190 చలాన్లు... రూ.32,610 ఫైన్... ఆ బండి ఇదే... (image: echallan.tspolice.gov.in)
  • Share this:
పొరపాటునో, లేక ట్రాఫిక్ పోలీసులు చూడట్లేదనో ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించి ఆ తర్వాత ఫైన్ కట్టే సందర్భాలు దాదాపు అందరికీ అనుభవమే. ఎవరైనా నాలుగైదుసార్లు, అది కూడా వందల రూపాయల్లో చలాన్లు కట్టి ఉంటారు. కానీ ఓ వ్యక్తి పేరు మీద ఏకంగా 190 చలాన్లు ఉన్నాయంటే నమ్ముతారా? అతనికి చలాన్లు కట్టడమంటే బండిలో పెట్రోల్ పోయించుకున్నంత ఈజీ అయిపోయింది. అతని పేరు వుండేటి సింహేంద్ర రావు. ఇప్పటి వరకు అతని పేరు మీద ఎన్ని చలానాలు జారీ అయ్యాయో తెలుసా? మొత్తం 190. ఆ చలాన్లకు జరిమానా రూ.32,610. ఇదీ ఆ డ్రైవర్ ట్రాక్ రికార్డ్.

Hyderabad Cab driver, traffic violations, traffic rules, 190 challans, hyderabad traffic rules, echallan.tspolice.gov.in, హైదరాబాద్ క్యాబ్ డ్రైవర్, ట్రాఫిక్ రూల్స్, ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘన, 190 చలాన్లు, ట్రాఫిక్ పోలీస్
(image: echallan.tspolice.gov.in)


ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించడంలో సెంచరీలు కొట్టేశాడు ఆ డ్రైవర్. మరి ట్రాఫిక్ పోలీసులు ఊరుకుంటారా? 26-01-2016 తేదీన తొలిసారి బుక్కయ్యాడు. అప్పట్నుంచి 07-05-2019 వరకు మొత్తం 190 ట్రాఫిక్ నిబంధనల్ని ఉల్లంఘించాడు. అందులో 87 చలాన్లకు రూ.14,940 ఇప్పటికే చెల్లించేశాడు. 103 చలాన్లకు రూ.17,670 పెండింగ్‌లో ఉంది. ఇన్ని చలాన్లు చూసి పోలీసులే షాకయ్యారు. గచ్చిబౌలిలోని ఐఐఐటీ జంక్షన్‌లో నో పార్కింగ్ జోన్‌లో ఉన్న ఆ వాహనాన్ని సీజ్ చేశారు పోలీసులు. ఇప్పటి వరకు చలాన్లు చెల్లించనందుకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. దీంతో సింహేంద్ర రావు కోర్టులో హాజరుకాక తప్పదు. 10 చలాన్లు పెండింగ్‌లో ఉంటే పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేస్తున్నారు.

Photos: గూగుల్ పిక్సెల్ 3ఏ, 3ఏ ఎక్స్ఎల్ స్మార్ట్‌ఫోన్స్ ఎలా ఉన్నాయో చూశారా?

ఇవి కూడా చదవండి:

Google Pixel 3a: గూగుల్ పిక్సెల్ 3ఏ, 3ఏ ఎక్స్ఎల్ స్మార్ట్‌ఫోన్స్ రిలీజ్... ప్రత్యేకతలు ఇవేAndroid Q: ఆండ్రాయిడ్ 10 క్యూ రిలీజ్ చేసిన గూగుల్... ఫీచర్స్ ఇవే

SBI Flexi Deposit: ఈ డిపాజిట్‌ స్కీమ్‌తో మీకు లాభాలెన్నో...
First published: May 8, 2019, 2:01 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading