Home /News /trending /

Video: ఇలాంటి కుక్కలు బంగారం షాపుకి కాపలాగా ఉంటే దొంగలకు పండగే

Video: ఇలాంటి కుక్కలు బంగారం షాపుకి కాపలాగా ఉంటే దొంగలకు పండగే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

దొంగతనం జరుగుతుండగా సీసీటీవీలో రికార్డయిన వీడియోను'లవ్లీ ఫేక్ డాగ్' అనే ఫేస్​బుక్​ పేజీ పోస్ట్ చేసింది. ఈ వీడియో క్షణాల్లో వైరల్ కావడంతో నెటిజన్లు ఆసక్తికర కామెంట్లు చేస్తున్నారు.

కుక్కలకు ఉన్న విశ్వాసం మరే జంతువుకు ఉండదంటారు. అందువల్లే, దొంగల నుంచి రక్షణ కొరకు అనేక మంది తమ ఇళ్లలో, షాపుల్లో కుక్కలను కాపలాగా పెట్టుకుంటారు. అయితే, థాయిలాండ్​లో బంగారు షాపు కాపలాగా ఉన్న ఓ కుక్క మాత్రం దొంగతనం జరుగుతుంటే గురక పెట్టి నిద్రపోయింది. ఆ షాపుతో, యజమానితో తనకు అస్సలు సంబంధం లేనట్లు వ్యవహరించింది. దుకాణంలోని భద్రతా ప్రోటోకాల్‌లు సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో పరీక్షించడానికి థాయిలాండ్​ పోలీసులు నిర్వహించిన మాక్ డ్రిల్‌లో లక్కీ అనే హస్కీ కుక్క వ్యవహరించిన తీరుపై నెటిజన్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. థాయ్​లాండ్​ పోలీసులు మాక్​ డ్రిల్​లో భాగంగా చియాంగ్​ మాయా సిటీలోని వోరావుట్ లోమ్వానావాంగ్ అనే బంగారం వ్యాపారికి చెందిన షాపులోకి దొంగ వేషంలో ఓ పోలీసు అధికారి ప్రవేశించాడు. నల్లటి టోపీ, మూతికి మాస్క్​ కట్టుకొని ఉన్న అతడు యజమానిని గన్నుతో బెదిరించి బంగారు నగలను సంచిలో సర్థుకొని అక్కడి నుండి పారిపోయాడు.

అయితే, దొంగతనం జరుగుతున్న సమయంలో అక్కడే కాపలాగా ఉన్న కుక్క మాత్రం ఇదేమీ పట్టనట్లు గురకపెట్టి నిద్రపోయింది. అయితే, కొద్ది సేపటి తర్వాత దొంగ వేషంలో ఉన్న ఆ పోలీసు అధికారి మళ్లీ షాపు దగ్గరకు వచ్చాడు. జరిగిందంతా ఓ నకిలీ దొంగతనమని, మీ దుకాణంలోని భద్రతా ప్రోటోకాల్‌లు సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో పరీక్షించడానికి ఈ మాక్ డ్రిల్​ నిర్వహించామని తెలిపాడు. షాపులో నిజమైన దొంగతనం జరిగినప్పుడైనా కుక్క మేలుకుంటుందా అని ప్రశ్నించాడు.కుక్క తీరుపై నెటిజన్ల అసహనం..
షాపు యజమాని దీనికి సమాధానమిస్తూ.. ‘‘నిజం చెప్పాలంటే.. నా ఉద్దేశ్యంలో మా కుక్క మనుషుల భాషను అర్థం చేసుకుంటుంది. షాపులోకి వచ్చిన వారి వ్యవహారశైలిని బట్టి వారు దొంగో, కాదో తేల్చేస్తుంది. అది ఎప్పుడూ చాలా హుషారుగా, అప్రమత్తంగా ఉంటుంది. నేను ఏ చిన్న శబ్ధం చేసినా సరే అది అలర్ట్​ అవుతుంది. అయితే, మీరు నకిలీ దొంగ అని నేను ముందుగానే పసిగట్టాను.. అందువల్లే, మీరు నగలు దొంగలిస్తున్నా.. ఎటువంటి శబ్దం చేయలేదు. కావాలంటే, మీరు నన్ను గన్నుతో బెదిరించినప్పుడు నా హావభావాలను సీసీటీవీ కెమెరాల్లో గమనించండి.”అని అన్నాడు.

ఒక పోలీసు 'దొంగ'గా నటిస్తున్నాడని, మిమ్మల్ని మా కుక్క ఎన్నో సార్లు చూసిందని యజమాని లోమ్వానావాంగ్ తెలిపారు. ఇది వినగానే ఆశ్చర్యపోవడం ఆ పోలీసు వంతైంది. కాగా, దొంగతనం జరుగుతుండగా సీసీటీవీలో రికార్డయిన వీడియోను'లవ్లీ ఫేక్ డాగ్' అనే ఫేస్​బుక్​ పేజీ పోస్ట్ చేసింది. ఈ వీడియో క్షణాల్లో వైరల్ కావడంతో నెటిజన్లు ఆసక్తికర కామెంట్లు చేస్తున్నారు. దొంగతనం జరిగేటప్పుడు కుక్క అలా గుర్రుపెట్టి నిద్రపోవడంపై వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఒక వేళ తెలిసిన వ్యక్తులు షాపును దోచుకుపోతే ఇలాగే చూస్తూ ఊరుకుంటుందా? అని ప్రశ్నిస్తున్నారు.
Published by:Ashok Kumar Bonepalli
First published:

Tags: Gold, Robbery, Thailand, VIRAL NEWS, Viral Video

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు